అనథికార ఇసుక రీచ్ల తనిఖీలో 35 లారీలు సీజ్ .

 అనథికార ఇసుక రీచ్ల తనిఖీలో 35 లారీలు సీజ్ కొల్లిపర (ప్రజా అమరావతి);

ఎన్నికల కోడు ఉన్న నేఫథ్యంలో కూడా అక్రమార్కులు కొల్లిపర మండలం అన్నవరపులంక కృష్ణ నది  రీచ్లలో అక్రమ ఇసుక తరలిస్తున్న 31లారీలు 2 ఖాళీలారీలు ప్రొక్లైనర్లు 2 వెరసి 35 వాహనాలు గురువారం రాత్రి గుంటూరు(East) ASP మరియు తెనాలి DSP అథ్వర్యంలో తనిఖీ నిర్వహించగా సరైన పత్రాలు లేనందున 35వాహనాలను సీజ్ చేయటమైందని తెనాలి DSP B.రమేష్ అన్నారు. 


అథికారులనుండి ఈ స్థాయిలో  అంటే 35 లారీలు సీజ్ చేసే స్థాయిలో స్పందన ఉంటుందని తాము ఉహించలేదని అప్పటిదాక నిరాఘాటంగా సాగించిన అక్రమ ఇసుక రవాణాకు బ్రేక్ పటడం ఆశ్పర్యం వేసిందని కొల్లిపర పరిసర ప్రాంత ప్రజలు అనుకొంటున్నారు. 


అంతకు ముందు  కొల్లిపరలో MP MLA అభ్యర్ధులు  పెమ్మసాని చంద్రశేఖర్,  మనోహర్ లు కొల్లిపరలో నదీ గర్భంలోని ఇసుక త్రవ్వకాలతో బోర్లలో నీటిమట్టం పడిపోవటం ఆ తవ్విన గుంతలలో పడి మృతిచెందటంతో ఆ కుటంబాలు పడుతున్న ఆవేదన పై వారు  ప్రచారం చేశారు.


ఏదేమైన అక్రమాలు చేస్తే   అంతకు మునుపున్న అథికారుల్లాకాకుండ మారిన అథికారులు ఉక్కుపాదంతో అణచి వేస్తారన్న సంఙ్ఞలు బలంగా వెళ్ళాయి. 


ఈ వాహనాల తనిఖీలో తెనాలి DSP B.రమేష్, తాలూక CI T.వేంకటేశ్వర్లు, కొల్లిపర SI రవీంద్రనాథ్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.Comments