నందివెలుగు కో – ఆపరేటివ్ క్రెడిట్ సోసైటీ లిమిటెడ్ 4వ శాఖ ప్రారంభోత్సవం.

 నందివెలుగు కో – ఆపరేటివ్ క్రెడిట్ సోసైటీ లిమిటెడ్  4వ శాఖ ప్రారంభోత్సవం



రైతులు,  చిన్న వ్యాపారులకు రుణ సౌకర్యం


డిపాజిట్ కు అధిక వడ్డీ 


 తక్కువ వడ్డీ కి బంగారంపై రుణం


వ్యవస్దాపక చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు 


ప్రారంభించిన శ్రీ బాష్యం విద్యాసంస్దల అధినేత రామకృష్ణ, 

మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి పట్టణంలోని గౌతమబుద్దారోడ్డు ఉపోదయ మార్కెట్ ఎదుట నంది వెలుగు కో - ఆపరేటివ్ క్రెడిట్ సోసైటీ లిమిటెడ్ 4వ శాఖ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న బాష్యం విద్యా సంస్దల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.


 ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ సులభంగా రుణాలు ఇవ్వటం సోసైటీ  బ్యాంక్ ప్రత్యేకత అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు, వ్యాపారులకు మెరుగైన సేవలను సోసైటీ అందిస్తుందని అన్నారు. 


 వెలుగు కో - ఆపరేటివ్ క్రెడిట్ సోసైటీ లిమిటెడ్ సంస్ద చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, నందివెలుగు, లో మూడు శాఖలు ఉండగా, 4వ శాఖ మంగళగిరిలో ప్రారంభిచంటం జరిగిందన్నారు. సామాన్యడికి అందుబాటు లో ఉండి నందివెలుగు కోపరేట్ బ్యాంకు 2020లో  ప్రారంభం కాగా, నేటికి  80 కోట్లు బుక్ వాల్యూ తో ఉందన్నారు. బ్యాంక్ డిపాజిట్ చేసిన వారికి ఆధిక వడ్డీ లభిస్తుందన్నారు. లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకున్న వారికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వడ్డీ పొందవచ్చని అన్నారు.  రైతులు, చిన్న వ్యాపారులు సులభంగా రుణ సౌకర్యం ఉంటుందని అవకాశాన్ని మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మీ కోటేశ్వరరావు కోరారు.


 కార్యక్రమంలో జాతీయ పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాఅంజనేయులు పట్టణ ప్రముఖులు  పోతినేని శ్రీనివాసరావు, నన్నపనేని నాగేశ్వరావు, సంకా బాలాజీ గుప్తా,  డాక్టర్ బాలవెంకటరావు, డాక్టర్  గిరిజా, దామర్ల నరసింహం, ఇసునూరి అనిల్ చక్రవర్తి, పితాళ్ల మస్తాన్ రావు, తోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Comments