మంగళగిరిలో గెలుపు దిశగా కమ్యూనిస్టు.

 *మంగళగిరిలో గెలుపు దిశగా కమ్యూనిస్టు**ఉండవల్లి సెంటర్ లొ జొన్నా మోత!*


*ఎర్రజెండా బిడ్డకు ఎదురెళ్లి మరి ఆప్యాయ ఆలింగనాలూ*


*శివశంకరుడి నుదుటన వీర తిలకం దిద్దిన మహిళలు*


*జొన్నా రోడ్ షో కు పోటెత్తిన జనం*


 మంగళగిరి/తాడేపల్లి. (ప్రజా అమరావతి);


*జొన్నా.. జొన్నా.. జొన్నా.. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే నినాదాం. ఇండియా కూటమి బలపరచిన  అసెంబ్లీ అభ్యర్థి జొన్న శివశంకర్‌ రోడ్‌ షో అదిరింది.*


*డీజే, ఆంధ్ర ప్రజానాట్యమండలి నృత్యాలు...  వారి వెనక 50 మందికి పైగా మహిళా డప్పు కళాకారులతో.. రోడ్ షో మోత మోత..మోపించారు..*


*వారి వెనక ప్రత్యేక కోయ నృత్యాలతో... ప్రజలను మంత్రముగ్ధులను చేశారు..*


*అడుగడుగునా మహిళలు... జొన్న శివశంకర్ కు హారతిలిచ్చి నీరాజనాలు పట్టారు..* 


కరుడుగట్టిన కమ్యూనిస్టులు కదిలారు. శివశంకరుడుని అలింగనం చేసుకుని నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. వృద్ధులు సైతం అడుగులో అడుగు వేశారు. గెలుపు నీదే అంటూ భుజం తట్టారు. వృద్ధ మహిళలు సైతం హారతి ఇచ్చి తిలకం దిద్దారు. మా శంకరుడు మళ్లీ వస్తాడు.. మా సమస్యలు తీరుస్తాడు.. నాడు ఆయన కల్పించిన నీడలో బతుకుతున్నాం అంటూ ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయారు.


*20 సంవత్సరాలు సర్పంచ్‌ గా ఉండవల్లి అభివృద్ధికి ఆయన వేసిన బాటలు.. మరవలేమని ఆయనకే తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.*


*శివశంకర్‌కు మద్దతుగా కార్మికులు, కర్షకులు కదం తొక్కారు. ఓటుతో నోటుకు చెక్‌ పెడదాం.. డబ్బుతో ఏమైనా చేయావచ్చనుకుంటున్న పార్టీలను మట్టి కరిపిద్దాం.. శివశంకరుడిని గెలిపించుకుందాం.. మంగళగిరి రాజకీయ చరిత్రలో శివశంకరుడి పేరు చిరస్థాయిగా నిలుపుదాం అంటూ యువత గళం విప్పారు. ఏదిఏమైనా మంగళగిరిలో  ప్రధాన పార్టీల రాతలు మారనున్నాయి అనడంలో సందేహం లేదు.

Comments