నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చూద్దాం: కేంద్రమంత్రి అమిత్ షా*.

 *నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చూద్దాం: కేంద్రమంత్రి అమిత్ షా* 









సిద్దిపేట జిల్లా: ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి)

మెదక్ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర హోంశా ఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. 



తెలంగాణలో బీజేపీ కనీసం 12 లోక్ సభ స్థానాల్లో గెలి పించాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 


నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపు నిచ్చారు. సిద్దిపేటలో ఈరోజు ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జనసభ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మాట్లాడు తూ… అయోధ్యలో రామ మందిరం కోసం ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వ తంగా అంతర్భాగం చేసేం దుకు మోదీ ఎంతో చేశార న్నారు. 


తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉందన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి బీఆర్ఎస్, కాంగ్రె స్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహిం చడం లేదని ఆరోపించారు. 


బీజేపీ వచ్చాక సెప్టెంబర్ 17న తప్పకుండా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తా మని హామీ ఇచ్చారు. ఈ పదేళ్ల కాలంలో దేశంలో ఎన్నో సమస్యలను పరిష్క రించామని… జమ్ము కశ్మీర్‌ లో ఆర్టికల్ 370ని తొలగిం చామని చెప్పారు. 


తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం గా మార్చేశారని ఆరోపిం చారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తెలం గాణలో అవినీతి లేకుండా చేస్తామన్నారు. సమగ్ర తెలంగాణ వికాసం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు...

Comments