నేటి నుండి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు.

 *నేటి నుండి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు


*


జగిత్యాల జిల్లా:ఏప్రిల్ 22 (ప్రజా అమరావతి);

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పా ట్లను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీ లించారు.


తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు, కళ్యాణకట్ట, ఆల య పరిసరాలను తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు..

Comments