రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై సిఎస్ సమీక్ష
అమరావతి,22 ఏప్రిల్ (ప్రజా అమరావతి):రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.సోమవారం విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ విద్యుత్ డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.జూన్ వరకూ ఎదురయ్యే విద్యుత్ డిమాండుకు అనుగుణంగా తగిన విద్యుత్ సరఫరాకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.వేసవి ఎండలు తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకూ విద్యుత్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇంకా ఈసమావేశంలో విద్యుత్ శాఖకు సంబంధించి పలు అంశాలపై సిఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.
ఎపి ట్రాన్సుకో సిఎండి చక్రధర బాబు మాట్లాడుతూ జూన్ వరకూ రోజు వారీ విద్యుత్ డిమాండు ఏవిధంగా ఉంటుందనేది అంచనా వేశామని పేర్కొంటూ ఈనెలలో 245 మిలియన్ యూనిట్లు,మే లో 236 మిలియన్ యూనిట్లు,జూన్ లో 253 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేసినట్టు వివరించారు.సాధమైనంత వరకూ విద్యుత్ డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో రోజువారి బొగ్గు నిల్వలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో పరిష్కరించడం జరుగుతోందని వివరించారు.
ఈసమావేశంలో డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి,ఇపిడిసిఎల్,సిపిడిసిఎల్,ఎస్పిడిసిఎల్ సిఎండిలు తదితర అధికారులు పాల్గొన్నారుi
addComments
Post a Comment