తాడేపల్లిలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


 *తాడేపల్లిలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న  టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు**4,6,16 వార్డుల్లో సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న వెంకట్రావు*


 మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి లో 4,6,16,

వార్డులోని శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముని కళ్యాణ మహోత్సవంలో టిడిపి తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సీతారాములను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఓలేటి రాము,తెలుగు యువత అధ్యక్షులు గుద్ధంటి నాగేశ్వరావు, కొరపాటి విజయ్, పోతాబత్తిన శ్రీను, కొక్కిలిగడ్డ సుబ్బారావు, కొమర బచ్చయ్య, ఇసుకపల్లి రవి, ప్రసాద్,దుర్గారావు, సింహాచలం,దర్శి హరికృష్ణ, షేక్ అమీర్,మాగంటి కళ్యాణ్,వల్లూరి హరికృష్ణ, సుకుమార్ శివరాం తదితరులు పాల్గొన్నారు.

Comments