ప్లాస్టిక్ రహిత నగరానికి ప్రజలు సహకరించాలి... కమీషనర్.

 *ప్లాస్టిక్ రహిత నగరానికి ప్రజలు సహకరించాలి... కమీషనర్


 మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి- తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలు, వ్యాపార సంస్థలు 75 మైక్రాన్ ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ పేపర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్, వినియోగించడంతోపాటు, విక్రయించకూడదని ప్రభుత్వ నిషేధాజ్ఞలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్టు నగర కమిషనర్ నిర్మల్ కుమార్  మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ సంచులు వినియోగించడం, అమ్మకాలు జరపటం చేసిన వారిపై భారీ జరిమానాలు విధించటం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మార్కెట్‌కు వెళ్లేటప్పుడు ఇంటి నుంచి వస్త్రం, పేపర్, జూట్ లతో తయారు చేసిన సంచులను వెంట తీసుకువెళ్లాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయించినా, వినియోగించినా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగరంలో నిషేధిత విక్రయిస్తున్న వ్యాపారం సంస్థలపై నగరపాలక సంస్థ, సచివాలయ సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. నగర ప్రజలకు వ్యాపార సంస్థల ప్రతినిధులకు సిబ్బంది ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ప్లాస్టిక్ రహిత నగర నగరానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.


Comments