అటహాసంగా జొన్నా నామినేషన్ ర్యాలీ..!.

 *దద్దరిల్లిన మంగళగిరి.*


*అటహాసంగా జొన్నా నామినేషన్ ర్యాలీ..!**ఎరుపెక్కిన మంగళగిరి గడ్డ* 


*అతడే ఒక సైన్యం*


*--  నామినేషన్ దాఖలు చేసిన జొన్న శివశంకర్.*


మంగళగిరి (ప్రజా అమరావతి);

ఇండియా బ్లాక్ భాగస్వామ్య పార్టీలు అయిన కాంగ్రెస్, సిపిఐ, ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలపరుస్తున్న మంగళగిరి నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి   జొన్న  శివశంకర్  నామినేషన్ కార్యక్రమం సందర్భంగా సోమవారం.మంగళగిరి నగరంలోని చిల్లపల్లి కళ్యాణమండపం లొ బహిరంగ సభ జరిగింది.  ఈ సభలో ముఖ్య అతిథులుగా  సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు సామ్యూల్ తోపాటు సిపిఎం, సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.ఈ  సందర్భంగా.సిపిఎం పోలేట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ.జగన్, చంద్రబాబు మోసగాళ్లయితే... మోడి మోసగాళ్ళకే మోసగాడని విమర్శించారు.జగన్ రాజధానిని వైజాగ్ పంపడానికి చూస్తుంటే..మనం రాజధాని అమరావతే కావాలనుకున్నాం అని అన్నారు.

లొకికత్వాన్ని కాపాడాలంటే బీజేపీ ని ఓడించాలి అని పిలుపు నిచ్చారు.ప్రధాని మోడి గత 10 సంవత్సర పాలనా కాలాన్ని ట్రైలర్ తో పోల్చి చెప్పడాన్ని... చూస్తే నాకు 'నీకు సినిమా చూపిస్తా మామ' పాట గుర్తుకు వస్తుందని చమత్కరించారు.దానర్థం ని అంతు చూస్తానని  రాఘవులు పేర్కొన్నారు.

స్పెషల్ స్టేటస్ ఇస్తానని ద్రోహం చేసిన ద్రోహి బీజేపీ అయితే దానికి మద్దతు తెలుపుతున్న టీడీపీ, జనసేన ద్రోహులు కాదా? అని ప్రశ్నించారు.

బీజేపీ కి సాగిలపడిన జగన్, సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు మోసగాళ్లయితే... మోడి మోసగాళ్ళకు మోసగాళ్లు అని దుయ్యాబట్టారు.

రాజధాని అమరావతిలో ఉండటం మోడీకి ఇష్టం లేదని అందుకే గుప్పెడు మట్టి.. చెంబుడు నీళ్లతో సరిపెట్టుకున్నారని.స్పెషల్ స్టేటస్.. ప్యాకేజీ.. రైల్వే జోన్....  ప్రతీ విషయంలోనూ.. మోడిని ప్రశ్నించని... జగన్, చంద్రబాబు లను ఇంటికి పంపించి...  ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అని బీవీ రాఘవులు పిలుపునిచ్చారు..సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.చుట్టుప్రక్కల నియోజకవర్గాల్లో కల్లా బలమైన అభ్యర్థి జొన్న శివశంకర్ అని కితాబు ఇచ్చారు.గతంలో పారిస్ కంపెనీ వద్ద పేదల భూములకై శివశంకర్ తో పోరాడి.. అరెస్టులు కూడా అయ్యామని...  ప్రజల కోసం నిత్యం పోరాడే శివ శంకరు ను అసెంబ్లీకి...  జంగాల అజయ్ కుమార్ ను పార్లమెంటుకు అఖండ మెజారిటీతో గెలిపించి పంపాలని  ముప్పాల విజ్ఞప్తి చేశారు..ప్రజానాట్యమండలి కళాకారులు పాడిన విప్లవ గేయాలు కమ్యూనిస్టు, కాంగ్రెస్ శ్రేణులను అలరించాయి. కాగా మంగళగిరి సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావుకు డిపాజిట్ పదివేల రూపాయలను ఆటో యూనియన్ నాయకులు టి శ్రీరాములు తదితరులు అందించారు.


*భారీ ర్యాలీ* 


అనంతరం డప్పులు. కొట్టుకుంటూ..  ఎర్రజెండాలు చేతపట్టి సైనికుల వలె మంగళగిరి రోడ్లమీద ర్యాలీగా వెళ్తూ నాయకులు కదం తొక్కారు.  జొన్న అభిమానులు,  సిపిఎం, సిపిఐ,  కాంగ్రెస్ శ్రేణులు వేల సంఖ్యలో నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. 


 బీవీ రాఘవులు ర్యాలీలో ముందుండి.. ఎర్రసైన్యాన్ని ముందుకు నడిపించగా... వెనక వరుసలో డప్పులు....  ఆ తర్వాత ఆంధ్ర ప్రజానాట్యమండలి కళాకారుల నృత్యాలు సాగాయి.


 వీరి వెనక...  ప్రచార రథంపై మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, సిపిఎం మాజీ కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ  నాగేశ్వరరావు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.


వారి వెనక కార్యకర్తలు,ప్రజలు,అభిమానులు వేలాదిగా ఎర్ర జెండాలు పట్టుకొని కవాతు చేశారు.  


వారి వెనక ద్విచక్ర వాహనదారులు, ఆటోలు,  కార్లు బారులు తీరాయి.


మంగళగిరి ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్య తొలగాలన్న డ్రైనేజీ సమస్య వీడాలన్న మంచినీటి సమస్య తొలగాలన్న తనను గెలిపించాలని సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్న శివ శంకర్  కోరారు.

డబ్బున్న రాజకీయ పార్టీలతో తను పోరాడుతున్నానని ప్రజల మద్దతు కావాలని కోరారు.

ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు మంగళగిరి ప్రజల సమస్యలు పట్టలేదా అని ప్రశ్నించారు.ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రజల సమస్యలు గుర్తొకొచ్చాయా అంటూ ఎద్దేవా చేశారు.

గతంలో మంత్రిగా చేసి మరొకరు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు పార్టీల ఫిరాయింపులు చేసి తను లోకల్ అని  చెప్పుకుంటూ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారాన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు మంగళగిరి కి ఏం చేశారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.

కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తుంచుకునే నాయకులు కావాలో అనునిత్యం ప్రజల కోసం పోరాడే ఎర్రజెండా కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


 ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, ఎం సూర్యారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చంగయ్యి, వై నేతాజీ, ఎన్ భవన్నారాయణ, కే నలిని కాంత్, ఈమని అప్పారావు, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, వై వెంకటేశ్వరరావు, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, ఏం పకీరియా, పి బాలకృష్ణ, బి కోటేశ్వరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కే కృష్ణ చౌదరి, కంటేటి జీవన్ సాగర్, కే రాధిక, సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు కే ఉమామహేశ్వరరావు, పి మురళీకృష్ణ, ఎస్ వెంకటరావు, స్థానిక నాయకులు స్థానిక సిపిఎం నాయకులు వివి జవహర్లాల్, వీ రాణి, సిపిఎం పట్టణ కార్యదర్శి బి వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి డి వెంకట్ రెడ్డి, ఐద్వా నాయకురాలు డి శ్రీనివాస్ కుమారి, మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్, రూరల్ కార్యదర్శి ఎం జ్యోతిబాస్, తాడేపల్లి మండలం సిపిఎం సీనియర్ నాయకులు కాట్రగడ్డ శివరామకృష్ణయ్య, ఆవాస్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్తీ, సిపిఐ నాయకులు పి నాగేశ్వరరావు, మైనార్టీ నాయకులు ఎండి యూసుఫ్, సిఐటియు నాయకులు ఆర్ వి నరసింహారావు, నిమ్మగడ్డ బాల ప్రకాష్, నన్నపనేని శివాజీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈదా ప్రతాపరెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఏ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments