అట్టహాసంగా కలవపూడి శివ నామినేషన్.

 **అట్టహాసంగా కలవపూడి శివ నామినేషన్**


 

**వేలాదిగా కదిలిన శివసైన్యం**


**తండోపతండాలుగా తరలివచ్చిన కార్యకర్తలు

కలవపూడి శివ అభిమానులు**



**కారుపై అభివాదం చేస్తూ  చిరునవ్వులుతో అప్యాయంగా ముందుకు కదిలిన కలవపూడి శివ**


**ప్రత్యర్థుల కళ్ళు చెదిరేలా కలవపూడి శివ నామినేషన్ ఘట్టం**


**ఉండి రహదారులన్నీ జనంమయం**


**సొంత గడ్డ కలవపూడి నుంచి మొదలైన ర్యాలీ**


**నామినేషన్ ఘట్టం విజయవంతం కావడంతో కలవపూడి శివ అభిమానుల్లో పెరిగిన జోష్**



ప.గో (ప్రజా అమరావతి);

 

ఎటు చూసినా జనం... కేరింతలు కొడుతూ కదం తొక్కిన అభిమానులు.. నృత్య, వాయిద్యాలతో ఉండి నియోజకవర్గం దద్దరిల్లిపోయింది.ఉండి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ నామినేషన్ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది..ముందుగా కలవపూడి గ్రామ దేవతలు మారెమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లను దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు కలవపూడి శివ...ఆ తర్వాత ఆయన పెద్దల వద్ద ఆశీర్వాదాలు తీసుకుని అనంతరం ఆయన సొంత ఊరు కలవపూడి నుండి భారీ ర్యాలీతో బయలుదేరారు.భారీ ర్యాలీతో బయల్దేరిన కలవపూడి శివ ఉండి ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకున్నారు...ఉండి ఎమ్మార్వో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు...



ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం, కలవపూడి శివ విజయోత్సవంగా సాగింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు..పెద్దసంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మహిళలు, యువతీ, యువకులు ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు...కలవపూడి శివను చుస్తు కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ కలవపూడి శివ ప్రయాణిస్తున్న వాహనానికి ముందు వెనక నడవడం చూస్తే, ఈ ఎన్నిక కలవపూడి శివకు వన్ సైడ్ అవుతుంది అన్నది అర్థమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఉండి నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నెలల్లోనే క్యాడర్ అంతా తన వైపు తిప్పుకొని విజయ  పదాన ముందుకు సాగుతూ ఉంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  ఈ నామినేషన్ ఉత్సవ తీరును చూసి ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోతోందని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వీటన్నిటికీ మించి నామినేషన్ పర్వాన్ని చూసిన చాలామంది ఉండి నియోజకవర్గంలో కలవపూడి శివ గెలుపు ఖాయమంటూ మౌత్ టాక్ వినిపించింది......ఈ నామినేషన్ల పర్వం చూస్తుంటే  టీడీపీ కంచుకోట బద్దలు అయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషణకులు..

Comments