మంగళగిరిలో దమాషా ప్రకారం కాపులను ఎందుకు పరిగణలోకి తీసుకోరు ?.

 *మంగళగిరిలో  దమాషా ప్రకారం కాపులను ఎందుకు పరిగణలోకి తీసుకోరు ?*



*రాజకీయ పార్టీలు దీనికి సమాధానం చెప్పాలి..?*


*ఇప్పుడు కాకపోతే మరెప్పుడు..?*


*కొందరిలా ప్యాకేజీలు తీసుకొని..కమ్మకి కొమ్ము కాయం...నిజాయతి ఉంది కాబట్టే కమ్యూనిస్టుకి మద్దతుగా నిలిచాం*


*మంగళగిరిలో కాపు వర్గానికి చెందిన జొన్నా శివశంకర్ గెలవాలని ప్రచారం చేస్తాం*


*జొన్న శివ శంకర్ ను కలిసి మద్దతు తెలిపిన కాపు నాయకులు*


*-- మార్కండేయులు,  కాపు జేఏసీ,కాపు జాగృతి రాష్ట్ర నాయకులు*


మంగళగిరి/తాడేపల్లి (ప్రజా అమరావతి);


పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి.. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న.. ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి జొన్న శివశంకర్ ను గెలిపించాలని కాపు జాగృతి రాష్ట్ర నాయకులు ఓ మార్కండేయులు పిలుపునిచ్చారు.


ఇటీవలే విజయవాడలో పంచాయతీ బోర్డు నుండి పార్లమెంట్ వరకు.. కాపులకు 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని..  మీటింగ్లలో తీర్మానాలు చేసుకున్నాం.. కానీ ఏ రాజకీయ పార్టీ.. వీటిని సీరియస్గా తీసుకొని అమలు చేయడం లేదు...


ప్యాకేజీలు తీసుకొని..  కొందరిలా... కమ్మ, రెడ్దిలకు కాపు కాయం.... కాపుల సంక్షేమమే మా అజెండా... అందుకే స్వాతంత్రంగా... కమ్యూనిస్టు నేతకు మద్దతు పలుకుతున్నాం.


దామాషా ప్రకారం చూస్తే మంగళగిరిలో కాపులు రెండు మూడు స్థానాల్లో ఉన్నారు...కానీ గత మూడు దశాబ్దాలుగా.. ఏ రాజకీయ పార్టీ కూడా కాపులను తమ అభ్యర్థిగా ఇప్పటివరకు ప్రకటించలేదు....!


కాపులకు రిజర్వేషన్స్ ఇస్తే తుని రైలు గొడవ జరిగేదా..? ఎలక్షన్స్ వచ్చేముందే... కాపులు గుర్తుకు వస్తారా..?2014లొ టీడీపీ,2019లొ వైసీపీ కాపులకు రిజర్వేషన్స్ విషయంలో తీవ్ర అన్యాయం చేసింది.


కరడు కట్టిన కమ్యూనిస్టు వాదిగా.. అందరి వాడిగా పేరు సంపాదించిన..  జొన్న శివశంకర్ను ఇండియా కూటమి తరఫున మంగళగిరి.. నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా..పోటీచేయాటాన్ని మేము హర్షిస్తున్నాము.


కాపులందరూ ఆయనను బలపరిచి... అఖండ మెజారిటీతో గెలిపించాలని.. నియోజకవర్గ ప్రజలకు.. పిలుపునిచ్చారు.


ఇప్పటికే కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్.. జొన్నా ని కలిసిన సందర్భంలో ఆయన గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


త్వరలో ఆయన కూడా ప్రచారానికి మాతోపాటు జాయిన్ అవుతారు.


ఈ కార్యక్రమంలో.. దాసరి దుర్గా మల్లేశ్వరరావు, తాటికొండ వాసు, అప్పిగడ్డల బాజీ,జొన్నా రాజేష్,మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కాపు జేఏసీ,  కాపు జాగృతి నాయకులు పాల్గొన్నారు.

Comments