ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ నాయకులు.

 *తాడేపల్లి 6వ వార్డు సలాం సెంటర్ నుండి ముగ్గురోడ్డు వరకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ నాయకులు.*


తాడేపల్లి (ప్రజా అమరావతి);

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య మరియు మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థిని మురుగుడు లావణ్య విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు 6వ వార్డు సలాం సెంటర్ నుండి ఎన్నికల ప్రచారాన్ని తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి ప్రారంభించారు.*


*ఈ ఎన్నికల ప్రచారం మాజీ కౌన్సిలర్ వేముల లక్ష్మీ రోజా ఆధ్వర్యంలో స్థానిక సచివాలయ కన్వీనర్లు ముదిగొండ ప్రకాష్, సింహాద్రి గోపి, బూత్ కన్వీనర్ ఉప్పు శీను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా JCS కన్వీనర్ ఈదులమూడి డేవిడ్ రాజు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కళ్ళం రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.*


తాడేపల్లి సలాం సెంటర్ నుండి ముగ్గురు రోడ్డు వరకు ప్రతి ఇంటికి వెళ్లి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు గురించి మరియు ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని ఒక్కొక్కరికి రెండు ఓట్లు వేసే అవకాశం వస్తుందని ఒకటి ఎంపీ అభ్యర్థి  కిలారి వెంకట రోశయ్య మరొకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మురుగుడు లావణ్య గారికి వీరిద్దరికీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించుకొని మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరుచుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ST, BC సెల్ కన్వీనర్లు బాలసాని దేవసుందరం (అనిల్) బత్తుల దాసు, మాజీ కౌన్సిలర్ సింకా గంగాధర్, బూత్ కన్వీనర్ కూరగంటి ఉదయరాజు, బత్తుల వెంకటేశ్వరరావు(టైలర్), మాజీ వార్డ్ మెంబర్ రొడ్డ ఎలీషా, వేముల కోటేశ్వరరావు, యూసుఫ్, డొమి, పీటర్, వంశీ షేక్ హుస్సేన్, బెత్తం భాస్కర్, పల్లిపోగు నాగభూషణం, కొండా, రవీంద్ర, వెంకీ, టి సాయి కీర్తి, నారాయణ కృష్ణ మరియు స్థానిక మహిళలు తదితరులు వందలాదిగా పాల్గొన్నారు....

Comments