గతంలో ఓట్లేసి గెలిపించిన మాలలే జగన్ రెడ్డిని ఓటుతో సమాధి చేస్తాం.



*గతంలో ఓట్లేసి గెలిపించిన మాలలే జగన్ రెడ్డిని ఓటుతో సమాధి చేస్తాం


*

*తెదేపా అధినేతను టిడిపి కేంద్ర కార్యాలయంలో కలిసి మద్దతు తెలిపిన మాలసంఘాల నాయకులు*


మంగళగిరి (ప్రజా అమరావతి): మాలల సామాజిక, ఆర్ధిక, రాజకీయ ప్రగతికి దోహదపడ్డ తెలుగుదేశంపార్టీకే మాలల మద్దతు ఉంటుందని మాల మహానాడు నాయకులు తెలియజేశారు.


 మంగళవారం నాడు మాలమహానాడు రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యారు. ఈ సంధర్బంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో మాలలకు ఎన్నడూ జరగని నష్టం జగన్ పాలనలో జరిందని, ప్రజా సమస్యలపై, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన మాల నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 వైసీపీ అంతమే మాలల పంతంగా ఈ ఎన్నికల్లో పనిచేసి జగన్ కు బుద్ధి చెబుతామన్నారు.


 సంక్షేమ పథకాల అమల్లో రాజ్యాంగబద్ధంగా అధనంగా రావాల్సిన వాటా కూడా ఇవ్వకుండా నిర్లక్యంనా చేస్తున్నారన్నారు. 


27 కు పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసి మాలలను అభివృద్ధికి దూరం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఓటు రూపంలో వేటు వేస్తామని మండిపడ్డారు.


 శిరోముండనాలు, అవమానాలు, అక్రమాలతో మాలలను వేధించని రోజు లేదని, గతంలో ఓట్లేసి గెలిపించిన మేమే జగన్ రెడ్డి ఓటుతో సమాధి చేస్తామన్నారు.



*శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ*..జీరో పావర్టీయే లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ అజెండా. 


ఉమ్మడి రాష్ట్రంలో, నవ్యాంధ్రప్రదేశ్‌లో మాలల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు. 


మాలలను రాజకీయంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయేనని జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా నియమించడంతో పాటు ప్రతిభా భారతిని అసెంబ్ీీ స్పీకర్‌గా చేశామన్నారు.


 కాకి మాధవరావ్ ను సి.ఎస్ గా టిడిపి హయాంలో నియమించగా ఇప్పటి వరకు మాలల నుంచి ఒక్కరికీ కూడా అవకాశం ఇవ్వకుండా నిర్లక్యం ే చేశారు. 


ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్ధికంగా బలోపేతం అవుతుందనే ఉద్దేశంతో విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేస్తే.. జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసి అభివృద్ధికి దూరం చేసిందన్నారు. 


ఈ సమావేశంలో  మాల మహానాడు నేతలు గోళ్ల అరుణ్ కుమార్, గుజ్జర్లపూడి చారువక, మల్లెల వెంకట్రావు, అన్నవరపు కిశోర్, అలగా రవికుమార్, గోగులమూడి రాము, యనమల రాజ్ కుమార్, బేతల శరత్ బాబు, వాసుమల్లి జాన్ మార్కు, రవ్వా భూషణం, పి. భీమారావ్, విన్నకోట లావుప్రసాద్, బి. సామ్యేలు, పి. జోత్యి కుమార్, బి. అనిల్, డేవిడ్ విలియమ్స్, బి.కిరణ్ కుమార్, బండ్లమూడి స్టాలిన్, ఎం. శ్రీనివాస్, ఏ. రాజు, దాసరి జయరాజు, విపర్ల పెదబుల్లిబాబు, కోవూరి రజనీకాంత్, మంచాల జోసఫ్, అలగా నానిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Comments