అవకాశం ఇవ్వండి... ఎ కో పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తా...

 *అవకాశం ఇవ్వండి... ఎ కో పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తా...**వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుగుడు లావణ్య.*

మంగళగిరి (ప్రజా అమరావతి);

నేను మీ కుటుంబ మనిషిని ఓ అవకాశం ఇవ్వండి ఎకో పార్క్ ను మరింతగా అభివృద్ధి చేస్తా. జూ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటా అని వైఎస్సార్సీపి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని మురుడు లావణ్య హామీ ఇచ్చారు. వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపుమేరకు ఆదివారం ఉదయం నగరంలోని ఎకో పార్క్ నందు పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీ అభ్యర్థి రోశయ్య, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు హాజరయ్యారు. పార్కులో ప్రతి ఒక్క మొక్క పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పచ్చదనాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా లావణ్య తెలిపారు. వేసవిలో ప్రతి  మొక్కకు నీరు పోయాలనారు.మీతో పరిచయం పెంచుకునేందుకు వచ్చా. జగనన్న పోటీ చేసేందుకు నాకు ఓ అవకాశం ఇచ్చారు.మీరూ ఓ  అవకాశం ఇవ్వండి అని వాకర్స్ ను విజ్ఞప్తి చేశారు.


Comments