రామ్మోహన్ మిశ్రా బుధవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలోని కలెక్టరేట్ను సందర్శించారు.మచిలీపట్నం ఏప్రిల్ 10 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా బుధవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలోని కలెక్టరేట్ను సందర్శించారు.జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీమ్ అస్మి, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డి ఆర్ ఓ కే చంద్రశేఖర రావు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులకు మొక్కలను అందజేసి సాధార పూర్వకంగా స్వాగతం పలికారు.


అనంతరం రాష్ట్ర పరిశీలకులు కలెక్టర్ గారి చాంబర్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలైన బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ ల పనితీరును పరిశీలించారు. అవి ఎలా పనిచేస్తున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.


అనంతరం రాష్ట్ర పరిశీలకులు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ మానిటరింగ్ విభాగాన్ని పరిశీలించారు. 


సి-విజిల్ యాప్ లో ఫిర్యాదు అందిన నూరు నిమిషాల్లో దాన్ని ఎలా పరిష్కరిస్తున్నారో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాష్ట్ర పరిశీలకులకు వివరించారు.

తదుపరి అక్కడే ఉన్న 1950 కాల్ సెంటర్, సర్వీస్ పోర్టల్ తదితర విభాగాలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర పరిశీలకులకు వివరించారు.తదనంతరం  జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వచ్చారన్నారు.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు పైన పోలింగ్ నిర్వహించే సిబ్బందికి శిక్షణ ఎలా ఇస్తున్నారు తదితర వివరాలు రాష్ట్ర పరిశీలకులు అడిగి తెలుసుకున్నారన్నారు. 


పోలింగ్ సమయంలో ఉల్లంఘనలు జరిగితే వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగం ఏ మేరకు సిద్ధంగా ఉందో విచారించారన్నారు.

అన్నింటి  ఏర్పాట్లను పరిశీలించిన పిదప రాష్ట్ర పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.


ఈ పర్యటనలో రాష్ట్ర పరిశీలకులు వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర రావు, కంప్లైంట్ మానిటరింగ్ విభాగం  నోడల్ అధికారి జే. జ్యోతి తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments