రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. భారత ఉప రాష్ట్రపతి కి ఘన స్వాగతం.

 


*రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. భారత ఉప రాష్ట్రపతి కి ఘన స్వాగతం*రేణిగుంట, ఏప్రిల్26 (ప్రజా అమరావతి):  భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్  తిరుపతి జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా  రేణిగుంట విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం 09.58 గం.లకు సతీ సమేతంగా చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి కి  ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్  ఘన స్వాగతం పలికారు.


అడిషనల్ డిజిపి సిఐడి సంజయ్, తిరుపతి జిల్లా ఎస్పి కృష్ణ కాంత్ పటేల్, తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఉప కులపతి జి ఎస్ ఆర్ కృష్ణ మూర్తి, ప్రోటోకాల్ ఎస్డిసి భాస్కర్ నాయుడు తదితరులు ఉప రాష్ట్రపతి గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


అనంతరం ఉప రాష్ట్రపతి గారు 10.05 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు శ్రీవారి దర్శనార్థం బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 1.00 గంటకు జాతీయ సంస్కృత యూనివర్సిటీ చేరుకుని మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.Comments