వేసవి సెలవుల్లో విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించాలని డీఈవోలకు సూచన.


విజయవాడ (ప్రజా అమరావతి);


*2024-25 విద్యా సంవత్సరానికి  సరికొత్తగా పాఠ్యపుస్తక ముఖచిత్రాలు*


*1,2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పుస్తకాల ముఖ చిత్రాలు మార్పు*


*సులభంగా గుర్తించేందు కోసమే సరికొత్తగా పాఠ్యపుస్తకాలు*


*పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్(cse.ap.gov.in) లో అందుబాటులో పాఠ్యపుస్తకాలు*


*ద్విభాషా పాఠ్యపుస్తకాలు చదవడం వల్ల మరింత మెరుగ్గా ఆంగ్ల నైపుణ్యాలు*


*వేసవి సెలవుల్లో విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించాలని డీఈవోలకు సూచన*


: *పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్*


 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు   cse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరానికి 1,2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మారనున్నాయని తెలిపారు. ఆయా తరగతుల పుస్తకాల ముఖ చిత్రాలు సులభంగా గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


పాఠ్యాంశాలపై మరింత పట్టు సాధించేలా వేసవి సెలవుల్లో విద్యార్థులను చదివేలా ప్రోత్సహించాలని డీఈవోలకు సూచించారు.  ద్విభాషా పాఠ్యపుస్తకాల రూపంలో ఉన్న సైన్స్ మరియు సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను కథలుగా చదవడం ద్వారా సంబంధింత సబ్జెక్ట్ ల పై మరింత అవగాహన పెరగడమేగాక, ఆంగ్ల భాషా నైపుణ్యాలు సైతం మరింత మెరుగుపడతాయన్నారు.  కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కాకుండా, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నానన్నారు.


విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పుల ద్వారా మన విద్యార్ధులను గ్లోబల్ సిటిజన్ గా తీర్చిదిద్దాలన్నదే  తమ లక్ష్యమని ఆయన తెలిపారు. మన పిల్లల భవిష్యత్ కోసమే విద్యారంగంలో వినూత్నమైన మార్పులని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. 


Comments