చంద్రబాబు వడ్డెరలకు రాజకీయంగా ఎలాంటి పదవులు ఇవ్వలేదు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*చంద్రబాబు వడ్డెరలకు రాజకీయంగా ఎలాంటి పదవులు ఇవ్వలేదు* *వడ్డెరల ఎదుగుదలకు తోడ్పడిన జగన్ కే మద్దతిస్తాం* 


*వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ తన్నీరు ధర్మరాజు*


2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయంగా,

వడ్డెరలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ తన్నీరు ధర్మరాజు అన్నారు.మంగళవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్లో వడ్డెర సంఘం నాయకులతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు 

2014లో మాచర్ల అసెంబ్లీ సీటుకు నామినేషన్ వేసుకోమని చెప్పి, ఇవ్వలేదని అన్నారు.2024లో పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, హిందూపురం ఎం.పి. సీటు ఇస్తానని చెప్పి మోసం చేసారని అన్నారు.చంద్రబాబు నాయుడుని నమ్మొద్దని అన్నారు. వడ్డెరలు రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి,

ఎదుగుదలకి తోడ్పడిన వై.యస్.ఆర్.సి.పి.కి వడ్డెరలు పూర్తి మద్దతునిచ్చి వై.యస్.ఆర్.సి.పి

అభ్యర్థులను గెలిపించుకొని, రాబోయే రోజుల్లో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని, మరింతగా రాజకీయ, ఆర్థికాభివృద్ధి పొందాలని అన్నారు.సమాజంలో వడ్డెరలు కూడా ఆత్మగౌరవంగా జీవించాలని కోరుకుంటున్నామని అన్నారు స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినా వై.యస్.కుటుంబం తప్ప వడ్డెరల గురించి పట్టించుకున్న నాథుడు లేడని అన్నారు.2004లో వై.యస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో అయిదు వడ్డెర మహాసభలలో పాల్గొని మాట్లాడుతూ వడ్డెరల

స్థితిగతులు నాకు తెలుసు, మీలో నేనూ ఒకర్ని అని, వడ్డెరలకు ఫైనాన్స్ ఫెడరేషన్, ఒక ఎం.ఎల్.ఏ. సీటు, ఒక హస్తకళల ఛైర్మన్, నాలుగు మునిసిపల్ ఛైర్మన్స్, స్థానిక సంస్థల్లో, రాజకీయ పదవులలో తొలిసారిగా అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు.ఏ రాజకీయ పదవి లేని నాకు మా కూతురు పెండ్లికి ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్. రాజశేఖర్

రెడ్డి పాల్గొని,వడ్డెరలలో ఆత్మస్థైర్యాన్ని నింపారని అన్నారు.వడ్డెరల సామాజిక స్థితిని,జీవన విధానాన్ని చిన్నప్పటి నుండి దగ్గరగా చూసిన వై.యస్.ఆర్. వడ్డెరలను ఎస్.టి. జాబితాలో చేర్చడానికి అప్పటి క్యాబినెట్లో తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగిందని అన్నారు.

తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎలాంటి విషయాలను పట్టించుకోకుండా "ఎక్కడ

వేసిన గొంగళి అక్కడే" అన్నట్లు వెనుకకు నెట్టివేసాయిని అన్నారు.ఆ తరువాత 2019 లో వై.యస్. జగన్మోహన్ రెడ్డి  వడ్డెరలను గుర్తించి ఒక ఎం.ఎల్.ఏ. (గుంటూరు) సీటు ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి యార్డు ఛైర్మన్ గా రెండు పర్యాయాలు ఇచ్చిన ఘనత వై.యస్.జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు.తరువాత

మైనింగ్ డైరెక్టర్గా, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ , వడ్డెర కార్పోరేషన్ చైర్మన్గా , డైరెక్టర్లుగా, గుంటూరు కార్పొరేటర్, గుంటూరు జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ పదవిని  కదిరి, పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తొలిసారిగా దేవాలయాల్లోకి వడ్డెర్లకు ప్రవేశం కల్పిస్తూ,కదిరి నరసింహ్మస్వామి దేవాలయానికి ఛైర్మన్ గా  శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా అవకాశం కల్పించారని అన్నారు.నలుగురు మునిసిపల్ ఛైర్మన్లుగా, ముగ్గురు ఎం.పి.పి.లు, 19 మంది వైస్ ఎం.పి.పి.లు, ముగ్గురు జడ్.పి.టి.సి.లుగా అవకాశం కల్పిస్తూనే, వడ్డెరల ఆర్థికాభివృద్ధికి చేయూ తనిస్తూ,తొలిసారిగా వడ్డెరలకు చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం కల్పిస్తూ, ఎం.ఎల్.సి. గానియమించడం జరిగిందని అన్నారు.వడ్డెరల అభివృద్ధి గురించి పట్టించుకొని పరిష్కరించిన వ్యక్తి వై.యస్. జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.వడ్డెరలు రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి,ఎదుగుదలకి తోడ్పడిన వై.యస్.ఆర్.సి.పి. కి వడ్డెరలు పూర్తి మద్దతునిచ్చి వై.యస్.ఆర్.సి.పి

అభ్యర్థులను గెలిపించుకొని, రాబోయే రోజుల్లో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని, మరింతగా రాజకీయ, ఆర్థికాభివృద్ధి పొందాలనిసమాజంలో వడ్డెరలు కూడా ఆత్మగౌరవంగా జీవించాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెపు ప్రసాద్ వడ్డెర ఫెడరేషన్ డైరెక్టర్  యనమల మాదవి, వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Comments