హజ్ యాత్రికులకు సౌకర్యవంతమైన యాత్రకు సర్వం సిద్ధం చేయాలి.


విజయవాడ (ప్రజా అమరావతి)


          హజ్ యాత్రికులకు సౌకర్యవంతమైన యాత్రకు సర్వం సిద్ధం చేయాలి


మొత్తం 2580 మంది హజ్ యాత్రికులు కాగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి 728 మంది 

హజ్ యాత్ర కు మే 26 నుండి మే 9 మధ్యలో విజయవాడ నుండి బయలుదేరుతారు.

జూలై 1 నుండి జూలై 21 లోపు తిరిగి విజయవాడ చేరుకుంటారు.

యాత్ర కాలం మొత్తం 38 నుండి 42 రోజులు.

ఈ ఏడాది హజ్ యాత్రికుల సౌకర్యం కోసం గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోని మదర్సాలో వసతి ఏర్పాటు .

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. యాత్రను విజయవంతం చేయాలి.

                               -   మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి  హర్షవర్థన్.

    హజ్ యాత్ర ను విజయవంతం చేయాలని, కేంద్ర, రాష్ట్ర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని  మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి  హర్షవర్థన్ ఆదేశించారు. హజ్ 2024 యాత్ర సఫలం చేయటంలో భాగంగా ఏపీ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో మొదటి సన్నద్ధత సమావేశం విజయవాడలోని వించ్ పేటలోని సాజాహిర్ ముషాఫిర్ ఖానా లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ మాట్లాడుతూ హజ్ యాత్రకు ఈ ఏడాది కోటా 2902 మందికి గాను ఇప్పటి వరకు 2580 మంది నమోదు చేసుకున్నారన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి 728 మంది, హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుండి 1118 మంది, బెంగుళూరు ఎంబార్కేషన్ పాయింట్ నుండి 725 మంది, చెన్నై ఎంబార్కేషన్ పాయింట్ నుండి 9 మంది హజ్ యాత్రకు బయలుదేరనున్నారని వివరించారు. హజ్ యాత్రికులు ఆయా ఎంబార్నేషన్ పాయింట్ల నుండి మే 26 నుండి జూన్ 9 మధ్య బయలుదేరుతారని, సుమారు 38 నుండి 42 రోజుల యాత్ర ముగించుకుని జూలై 1 నుండి 21 లోపు తిరిగి విజయవాడకు చేరుకుంటారని తెలిపారు. విజయవాడ ఎంబార్కేషన్ నుండి యాత్రికుల ప్రయాణానికి స్పైస్ జెట్ తన సేవలు అందించటానికి ముందుకు వచ్చినట్లు వివరించారు. 

       హజ్ యాత్రికుల సౌకర్యం కొరకు గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోని మదరసాలో వసతి ఏర్పాటు చేయనున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి  హర్షవర్థన్ తెలిపారు.  మదర్సా వద్ద టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేయాలని, పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని, అంతరాయం లేకుండ నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని హర్షవర్థన్ ఆదేశించారు. అలాగే భద్రత చర్యల్లో భాగంగా మహిళా పోలీసులను సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. యాత్రికులకు అసౌకర్యం కలగకుండా ఎయిర్ పోర్ట్ అధికారులు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తారని తెలిపారు. ఆర్టీసీ అధికారులు ఎసీ బస్సులను యాత్రికులను మదరసా నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు పంపించే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం 24 గంటలు పనిచేసేలా మదరసా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు.  హజ్ కు వెళ్లే యాత్రికులు వసతి కేంద్రం వద్దకు 24 గంటల ముందుగానే చేరుకోవాలని హర్షవర్థన్ సూచించారు. 

      హజ్ యాత్రకులు సుమారు 40 రోజుల పర్యటనకు మాత్రమే అనుమతి ఉందని, అంతకంటే ఎక్కువ రోజులకు అనుమతి లేదని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి  హర్షవర్థన్ వివరించారు. హజ్ యాత్రికులు హ్యాండ్ బ్యాగేజి కింద 8 కేజీల బ్యాగ్,  చెక్ ఇన్ లగేజీ కింద 20 కేజీల బరువున్న రెండు బ్యాగులు అనుమతి ఉందని చెప్పారు. ఎస్ బి ఐ బ్యాంక్ తమ శాఖ తాత్కాలిక సెంటర్  ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. హజ్ యాత్రికులు ప్రయాణానికి ముందే ఎస్ బి ఐ ఎకౌంట్ ను తమ స్వస్థలం వద్ద ఓపెన్ చేయించి ఉంచుకోవాలని సూచించారు. ఒక్కో యాత్రికునికి సుమారు రూ. 4లక్షల వరకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ అందిస్తున్నట్లు చెప్పారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ కార్డులు కూడా యాత్రికులకు అందుబాటులో ఉంచామన్నారు.  హజ్ యాత్రికులకు తిరుగు ప్రయాణంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద ప్రతి ఒక్కరికి 5 లీటర్ల జామ్ జామ్ క్యాన్లను అందిస్తామని హర్షవర్ధన్ తెలిపారు. 

     సీఆర్డీఏ అడిషినల్ కమిషనర్ షేక్. హలీం బాషా, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారి లక్ష్మీకాంత రెడడ్డి,  హజ్ కమిటీ స్టేట్ సభ్యులు, ఏపీ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎల్. అబ్ధుల్ ఖాదర్, ఎస్బీఐ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం. నాగవేణి, డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్,  హజ్ యాత్రకు సేవలందిస్తున్న ఎయిర్ లైన్స్ అధికారులు, గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ, కస్టమ్స్, ఆర్టీసీ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్ అండ్ బీ, బీఎస్ఎన్ఎల్, ఫైర్ సర్వీసు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Comments