కూరగాయల మార్కెట్ పడగొట్టి మా బతుకులు రోడ్డుకీడ్చారు!.

 


*కూరగాయల మార్కెట్ పడగొట్టి మా బతుకులు రోడ్డుకీడ్చారు!**ప్రభుత్వ ఆదరవు లేక అష్టకష్టాలు పడుతున్నాం*


*లోకేష్ మీ కష్టాలు తీరుస్తారని నారా బ్రాహ్మణి భరోసా*


మంగళగిరి (ప్రజా అమరావతి): వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి కూరగాయల మార్కెట్ ను పడగొట్టి తమ బతుకులను రోడ్డుకీడ్చారని కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి కాళీమాత ఆలయం దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ ను బ్రాహ్మణి సోమవారం రాత్రి సందర్శించారు. వ్యాపారులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. మార్కెట్ పడగొట్టడం వల్ల తమకు షెల్టర్ లేకుండాపోయిందని వ్యాపారులు వాపోయారు. దళారుల బెడద కూడా ఎక్కువగా ఉందని, కూరగాయలకు గిట్టుబాటు ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరిలో కూరగాయల వ్యాపారుల కోసం మార్కెట్ నిర్మిస్తారని , ఎవరూ ఆందోళన చెందవద్దని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. వ్యాపారుల కష్టాలపై లోకేష్ కు అవగాహన ఉందని, లోకేష్ ను ఆదరించి అసెంబ్లీకి పంపితే  చిరు వ్యాపారులకు ప్రభుత్వం నుంచి లోన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. అంతకుముందు కూరగాయల మార్కెట్ పక్కనే ఉన్న కాళీమాత ఆలయంలో బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. 


Comments