ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని కాపాడాలి.




*ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని కాపాడాలి*



- ఎన్నికల రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా 


పార్వతీపురం, ఏప్రిల్ 26 (ప్రజా అమరావతి): ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని కాపాడాలని ఎన్నికల రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం  పర్యటించిన రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నత అధికారులు, పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహణ ఒకటే అజెండా ఉండాలని, ఏ ఇతర అజెండా ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలలో తప్పులు చేస్తే ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలను  నిజాయితీ, విశ్వాసంతో నిర్వహించాలని ఆయన చెప్పారు. నిబంధనలు, చట్టాలు అందరికీ సమానమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని కాపాడాలని తద్వారా మాతృదేశాన్ని, రాజ్యాంగానికి వన్నె తేవాలని ఆయన చెప్పారు. ఎక్కడా ఎటువంటి అపోహలకు తావు లేకుండా పనిచేసి జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఆయన సూచించారు. 


జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరుపుటకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. పార్వతీపురం ఉద్యాన కళాశాలలో జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల కౌంటింగ్ ఏర్పాటు చేశామని, పాడేరు, రంపచోడవరంలలో ను కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న ఎన్నికల వివిధ బృందాలు, కంట్రోల్ రూం పని విధానాన్ని వివరించారు. 


పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పోలీసు శాఖ పరంగా చేపట్టిన చర్యలను వివరించారు. 


ఈ సమావేశంలో అదనపు డిజిపి డా శంక బ్రత బాగ్చి, పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్ మెహర్డ , పార్లమెంటరీ నియోజకవర్గ పోలీసు పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి , విశాఖ రేంజ్ డి ఐ జి విశాల్ గున్ని, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, అదనపు ఎస్పీ డా. ఓ.దిలీప్ కిరణ్, ఏఎస్పీ సునీల్ షరోన్, పాలకొండ డిఎస్పీ జి.వి. కృష్ణా రావు, ఎస్ డి సి ఆర్ వి సూర్యనారాయణ, పోలీసు ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.

Comments