ఓటమి భయంతో క్లాస్ వార్ అంటూ జగన్ కాకమ్మ కబుర్లు.

 *ఓటమి భయంతో క్లాస్ వార్ అంటూ జగన్ కాకమ్మ కబుర్లు*



*తన తండ్రి మరణానికి కారణం రిలయన్స్ అని దాడులు చేయించి...అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ వ్యక్తికే ఎంపీ పదవిచ్చాడు.* 


*జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ప్రజల భూములకు రక్షణ కరువు*


*రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై నీ బొమ్మెందుకు జగన్?*


*సంక్షేమానికి బడ్జెట్ లో టిడిపి 19.15% పెడితే జగన్ పెట్టింది 15.8% మాత్రమే*


*దేశంలో మోదీ గ్యారెంటీ – రాష్ట్రంలో కూటమి షూరిటీ సూపర్ హిట్*


*శవరాజకీయాలతో వృద్ధులను బలితీసుకుంటున్న జగన్*


*దర్శి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*


*ల్యాండ్ టైటింగ్ యాక్టుపై ప్రభుత్వం తెచ్చిన గెజిట్ ప్రతులను చించి వేసిన చంద్రబాబు* 


 *అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని హామీ*


దర్శి (ప్రజా అమరావతి):- మూడు పార్టీలు కలిశాకా వేరే పార్టీకి అవకాశం లేదు. అటు కేంద్రం ఇటు రాష్ట్రంతో డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో రాబోతుంది. మాగుంట ఓంగోలు బ్రాండ్. అలాంటి వ్యక్తిని కాదని సైకో ఎర్రచందనం స్మగ్లర్ ని తెచ్చారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తండ్రి ఎమ్మెల్యే, ఇప్పుడు రవికుమార్ సమర్ధవంతమైన నాయకులుగా ఉన్నారు. క్యాంపెయిన్ లో కాన్పు చేసి తల్లి బిడ్డను కాపాడింది. మిమ్మల్ని కాపాడే శక్తి లక్ష్మీకి ఉంది. సమర్ధవంతమైన డాక్టరే కాదు ప్రజా నాయకులు కూడా. జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్. ప్రజా జీవితంలో నిజమైన హీరో. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా సైకోని ఇంటికి పంపాలన్నదే ఆయన అభిమతం. దేశాన్ని 2047కి నెంబర్ వన్ చేయాలనేది మోదీ సంకల్పం. తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలన్నదే మా సంకల్పం. ఐదేళ్లు జగన్ పరదాలు కట్టుకొని తిరిగాడు. చెట్లు నరికేశాడా లేదా? ఎన్నికల ముందు ప్రజల దగ్గరకు వచ్చి తల మీద చెయ్యి పెట్టి, బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చాక బాధుడే బాధుడు చేశాడు. ఇప్పుడు ఏం చేశాడో చెప్పలేక, ఏం చేయాలో చెప్పలేక జగన్ కన్ఫూజ్ లో పడిపోయాడు.

*జలగ జగన్ జనాల రక్తాన్ని పీలిస్తే కూటమి రక్తాన్ని ఎక్కిస్తుంది*

సంక్షేమానికి బడ్జెట్ లో టిడిపి 19.15 శాతం పెడితే జగన్ 15.8 శాతం మాత్రమే. చేయని పనికి డబ్బు కొట్టుకుంటున్నారు తప్పా జగన్ చేసింది ఏమీ లేదు. చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు, ఆదరణ కింద బీసీలకు ఆదునిక పని ముట్లు, రంజాన్ తోఫా, అన్న క్యాంటీన్, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్ల మీద సబ్సిడీలు, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, చేనేత, మత్స్య కార్మికులకు రాయితీలు ఇచ్చాడా?. ఎస్సీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనారిటీలకు 10 పథకాలు రద్దు చేశారు. సంక్షేమం అంటే రూ.10 ఇచ్చి మీ దగ్గర నుంచి రూ.100  దోచుకుంటే జగన్ రూ.1,000 దోచుకున్నారు. జలగ జగన్ జనాల రక్తాన్ని పీలిస్తే కూటమి రక్తాన్ని ఎక్కిస్తుంది. 

*రాలిపోతున్న నవరత్నాలు*

ట్రాక్టర్ ఇసుక రూ.1000 నుంచి రూ.5000 పెంచారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియాను తుంగలో తొక్కేస్తాను. ఉచిత ఇసుకను అందిస్తుంది. నాడు క్వార్టర్ రూ.60 ఉంటే నేడు రూ. 200 పెరిగింది. అంటే రూ. 140 ఎవరి జేబులోకి వెళుతున్నాయి? జలగ జగనన్నకి పోతున్నాయి. క్వార్టర్ తో కిక్కు ఎక్కదు. రెండు క్వార్టర్ తీసుకుంటే గుండెల్లో మంట కాలేయం దెబ్బతింటుంది. అంటే జే బ్రాండ్లతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచుకున్నారు. జేబ్రాండ్లు రద్దు చేసి మందు బాబుల ఆరోగ్యం కాపాడతాను. మద్యం మాఫీ చేస్తేనే ఓట్లు అడుగుతానన్నాడు మరి చేశాడా? ఈ విషయంలో జగన్ ని నిలదీయాలి. పట్టాదారు పాసు పుస్తకం చూస్తే దీని మీద జగనన్న భూ హక్కు చట్టం ఉంది. భూమి జనాలది బొమ్మ జగన్ దా? ఈ పుస్తకాన్ని చించి చెత్తబుట్టలో పారేయాలి. ఆ పుస్తకం భూమి యజమాన్యులది ఉండాలి. అది మీ భూమి మీ హక్కు. అంతేగాని మన భూమి మీద సైకో పెత్తనం ఏంటి? పట్టాదారు పాసుపుస్తకం 10 (1) లేదు. అడంగల్ లేదు. అన్నింటిని రద్దు చేసే జగన్ పేరుతో మీ భూములన్ని ఆన్ లైన్ లో పెట్టుకుంటారంటా? అదే విధంగా క్రిటికల్ రివర్ అనే కంపెనీకి ఈ బాధ్యతను అప్పగించేందుకు సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ నుతెచ్చారు. జగన్ యముడు మీ భూమి లెక్కలన్ని రాసేసుకున్నాడు. మీ భూమి మీది కాదు. మీ భూమి సైకో గుప్పెట్లో ఉంది. ఆయన ఒక ప్రైవేటు కంపెనీ పెట్టుకున్నాడు. అందులో రికార్డుల్ని భద్రపరుచుకున్నారు. ఆ రికార్డుల్ని మార్చేస్తే మీ భూమి గోవిందా. ఒకప్పుడు మీ భూమిని అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకునేవారు. కాని ఇప్పుడు హక్కు లేదు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పర్మిషన్ ఇస్తేనే మీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ లేదు. ప్రైవేట్ ఆర్మీ రాబోతుంది. ఈ చట్టం అక్టోబర్ 2023 నుంచి అమల్లోకి వచ్చేసింది. అందరి మెడలకు ఉరితాళ్లు వేసి జలగ సైకో బటన్ ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు నొక్కితే అప్పుడు ప్రజల ప్రాణం ఆగిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ లో రికార్డులు పెట్టకుండా జగన్ బినామా క్యాలిఫోర్నియాలో ఉంటే   క్రిటికల్ రివర్ అనే సంస్థకు అప్పగిస్తున్నారు. మీ భూమికి భద్రత ఉందా? ఈ చట్టానికి ప్రజలు ఆమోదిస్తారా? ఈ నల్లచట్టాన్ని చించి చెత్తబుట్టలో పారేద్దామా లేదా?

*అవినాష్ చేతికి గొడ్డలిచ్చి రాష్ట్రం మీదకు పంపారు*

నాలుగో రత్నం మైనింగ్ మాఫియా – గెలాక్సి గ్రానైట్ ని కొల్లగొట్టారా లేదా? ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరోరత్నం ప్రజల ఆస్తుల కబ్జా, ఏడో రత్నం ఎర్రచందన్న గంజాయి, ఎనిదోవ రత్నం దాడులు కేసులు, తొమ్మిదోవ రత్నం శవరాజకీయాలు - 2014లో తండ్రి లేని బిడ్డ అని జగన్ వచ్చాడు.  రిలయన్స్ పై దాడులు చేయించారు. 2019 అధికారంలోకి వచ్చాక అదే రిలయన్స్  మనిషికి ఎంపీ పదవిని కట్టబెట్టారు. 2019లో హూ కిల్డ్ బాబాయ్ అని అడుతున్నాను. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్నారు. అవినాష్ రెడ్డి పిల్లోడైతే పలకా బలపం ఇవ్వాలి గాని పార్లమెంట్ కు పంపకూడదు. పలకా బలపం ఇవ్వాల్సిన వ్యక్తికి గొడ్డలి ఇచ్చి కడప మీదకు పంపావు. 2019లో కోడి కత్తి డ్రామా లాడారు, ఇప్పుడు గులకరాయి డ్రామా లాడుతున్నారు. రాయి కనపడలేదు గాని దెబ్బతా మిగిలింది. శవరాజకీయాలు చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. 

*ముసలి వాళ్లను చంపి ఓట్లు దండుకునే కుట్ర పన్నిన జగన్*

సూపర్ సిక్స్ తో పాటు బ్రహ్మండమైన మేనిఫెస్టోని తెచ్చాం. కేంద్రంలో మోదీ గారు మోదీ గ్యారెంటీతో పాటు కూటమి మేనిఫెస్టో వచ్చింది. మన మేనిఫెస్టో గలగల, జగన్ మేనిఫెస్టో వెలవెల. పింఛన్ రూ.200 నుంచి రూ.2,000 చేసింది ఎవరు? ఇదే విషయం ఆ సైకోకి గూబపగిలేట్టు కొట్టి చెప్పాలి. జగన్ ఓ అబద్దాల కోరు. ఇలాంటి వ్యక్తిని భూస్థాపితం చేయాలి. వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోవాలి గాని రాజకీయ ఏజెంట్లు గా పెట్టుకోకూడదని చెప్పాను. మనం కట్టే పన్నులతోనే వాళ్లకు రూ.5,000 జీతాలు ఇస్తున్నారు. ఎన్నికల డ్యూటీలో పెట్టవద్దని చెబితే పేదవాళ్లపై కక్షకట్టి ఏప్రిల్ నెలలో 33 మంది ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి జలగ సైకో. ఇప్పుడు నేరుగా ఇంటి వద్దనే ఇవ్వకుండా బ్యాంక్ లో వేశారు. బ్యాంకుల చుట్టు తిరగలేక ఇప్పటికే 7గురు చనిపోయారు. జగన్ పేద వాళ్ల రక్తం తాగే వ్యక్తి. పేదలను చంపి తద్వారా ఓట్లు రావాలనేది జగన్ నాటకం. నిజమైన పేదల పార్టీ కూటమి. 

*కూటమి వస్తే అదనపు సంక్షేమం*

ప్రతి పేద ముసలి వాళ్లకు రూ.4వేల పింఛన్ ఇస్తాం. పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తాం. ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం. సైకో కి చేతగాక పోతే రాజీనామా చేయాలి. సచివాలయాల్లో 1.50 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరు 40 పింఛన్ ఇస్తే రెండ్రోజుల్లో సరిపోతుంది. అలా చేస్తే సైకోకి ఓట్లు పడవు. మనుషులను చంపేసి రాజకీయ లబ్ది పొందాలనుకునే దుర్మార్గుడిని సైకో కాకపోతే ఏమంటారు? కూటమి అధికారంలోకి వస్తే జగన్ పథకాలకంటే 20 శాతం ఎక్కువ ఇచ్చే పూచి మాది. మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తాం. క్లాస్ వార్ కాదు క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే డబ్బులంతా జగన్ దగ్గరకు వెళుతుంది. ఇసుక,  మద్యం, భూ మాఫియా డబ్బులు ఎవరి దగ్గరకు వెళుతున్నాయి. మెక్కిన వాడి పొట్టలో నుంచి కక్కించే బాధ్యత నాది. క్యాష్ వార్ ఆగిపోతుందని జగన్ బాధపడుతున్నారు. అందుకే క్లాస్ వార్ అంటున్నారు. ఒకే వ్యక్తి లక్షల కోట్లు పెట్టుకొని ప్రజలను బానిసలుగా పెట్టుకొని పాలించాలని చూస్తున్నారు. పేదరికం లేని సమాజం నిర్మాణం చేస్తాను. ఏ పని చేసినా నిరుపేదను దృష్టిలో పెట్టుకుంటాను. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. పింఛన్ రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, కాళ్లు చేతులు లేని వాళ్లకు రూ.15వేలు, తలసేమియా, కిడ్నీ రోగులకు రూ.10వేలు ఇస్తాం. ఎసహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఇస్తాం. రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా ఇస్తాం. నచ్చిన ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోండి. బీసీ డిక్లరేషన్ తెస్తాం. బీసీలు నా కుటుంబ సభ్యులు, వాళ్లకు అండగా నిలబడతాను. రూ.1.50 లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం. ఆదరణకు రూ.5వేల కోట్లు, ఉపాధికి రూ.10వేల కోట్లు ఖర్చు పెడతాం. దేవాలయాల్లో పని చేసే  నాయి బ్రాహ్మణులకు నెలకు రూ.25వేలు, 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తాం. డ్రైవర్లకు రూ.15వేలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు  వడ్డీ లేని రుణాలు ఇస్తాం. 

*ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలన్నీ తీర్చేస్తాం*

సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నిధి కింద రూ. నెలకు రూ.1500 ఇస్తాం. ఐదేళ్లకు రూ.90వేలు ఇస్తాం. ఇంట్లో ఎంత మంది ఉన్నా ఇస్తాం. తల్లికి వందనం కింద బిడ్డకు రూ.15,000 చొప్పున ఎంత మంది ఉన్నా ఇస్తాం. మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయానం కల్పిస్తాం. చంద్రన్నే మీ డ్రైవర్. సురక్షితంగా మిమ్మల్ని గమ్యస్థానాలకు చేరుస్తాను. పాడి రైతులను ఆదుకుంటాం. బ్రాహ్మణులు, వైశ్యులను ఆదుకుంటాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కాపాడతాం. ఇమాం రూ.10వేలు, మౌజన్ లకు రూ.5 వేలు ఇస్తాం. మక్కాకు రూ.లక్ష ఇస్తాం. ఉద్యోగస్థులకు పీఆర్సీ, ఇంటీరియమ్ రిలీఫ్, మొదటి తారీఖు జీతాలు ఇస్తాం. రిటైర్ ఉద్యోగస్థుల పెన్షన్ మొదటి తారీఖు ఇచ్చే బాధ్యత మాది. పోలీసులకు జీతాలు సక్రమంగా వస్తున్నాయా? పీఎఫ్, డీఏ, టీఏ వస్తున్నాయా? మళ్లీ మేం వచ్చిన వెంటనే రావాల్సిన బకాయిలు ఇస్తాను. మెరుగైన జీవితం కావాలంటే కూటమికి ఓటు వేయాలి.

*దర్శిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం*

దర్శిలో ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ స్కూళ్లును మళ్లీ తీసుకువస్తాను. దొనకొండలో పరిశ్రమలు పెడతాను. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి. గంజాయి వద్దు జాబు ముద్దు. గోదావరి నీళ్లను నాగార్జున సాగర్ లో కలిపి నీళ్లి యద్దడి లేకుండా చేయాలని ఒక ప్రాజెక్టును తెచ్చి దర్శిలో మూడు పంటలు వేసుకునే ప్రణాళిక రచిస్తే జగన్ నాశనం చేశారు. దర్శికి నీటి సమస్య లేకుండా చేస్తాను. ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచి నీరు అందిస్తాం. తాళ్లూరులో మొగిలిగుండాల రిజర్వాయర్ శంకుస్థాపన చేస్తే ఒక్క అడుగు ముందుకు వేయలేదు. మళ్లీ నేను వచ్చాక పూర్తి చేస్తాను. నడికుడి – కాళహస్తి రైల్వే వస్తే ఈ ప్రాంతంలో హైదరాబాద్, తిరుపతి పోవాలంటే దర్శి నుంచి నేరుగా వెళ్లొచ్చు దీనిని పూర్తి చేస్తాను. పెద్ద ఉయ్యాల వాడలో రాకపోకల కోసం మూసినదిపై వంతెన, బొట్లపాలెం దొర్నపు వాగుపై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి. రాగమక్కపల్లి వద్ద ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు రూ.7 కోట్లతో ప్రారంభించిన పనులు ఆగిపోయాయి. చందోర వద్ద రూ.6 కోట్ల ఓవర్ బ్రిడ్జికి జగన్ అప్రోచ్ కూడా వేయలేదు. వేయిస్తాం. గుండ్లకమ్మ ఎగువ నీటిని మల్కాపురం దగ్గర లిఫ్ట్ చేసుకొని ముడ్లమూరు, తాళ్లూరుకు నీళ్లందించే అవకాశం ఉంది. దర్శికి మహర్ధశ వస్తుంది. దర్శికి మంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. ఈ ఒంగోలుకు మంచి ఎంపీ బ్రాండ్ అంబాసిడర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఆజాత శత్రువు, ఒక్క పైసా అవినీతి లేదు, నీతి నిజాయితీకి మారుపేరు. వైసీపీ ఎంపీ ఎర్రచందనం బందిపోటు. మీకు బందిపోటు కావాలా? నీతి మంతుడు కావాలా? జేఎస్పీ నాయకులు గరికపాటి వెంకట్, నారపశెట్టి పాపారావు, పమిడి రమేష్, గోరడ్ల రవికుమార్ లు బ్రహ్మండంగా పని చేస్తున్నారు. భవిష్యత్ లో వీళ్లందరికి న్యాయం చేసే బాధ్యత మాది. కూటమి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళితే జగన్ కి పుట్టగతులు ఉండవు’’ అని అన్నారు.


Comments