రాష్ట్రంలో వైసిపి పనైపోయింది.

 *రాష్ట్రంలో వైసిపి పనైపోయింది*


 *-ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్*

 *- వారి ఫేక్ సర్వేలతో ప్రజల్ని, ఎమ్మెల్యేలనే కాకుండా ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా మోసం చేసుకుని, ఊహల్లోకి వెళ్లిన దుస్థితి*

 *-సిద్ధం సభలంటూ రూ. 700 కోట్లు ఖర్చు చేశారు*

 *-గ్రాఫిక్స్లతో ప్రజలను మోసం చేస్తున్నారు*

 *-ఆఖరికి నామినేషన్ లకు కూడా ప్రలోభాలతో జనాన్ని తరలించాల్సిన పరిస్థితి* 

 *-నేను ఏ రోజు వైసీపీని విమర్శించలేదు..*

*-నా జోలికి వస్తున్నారు*

*-నాపై అనవసరంగా వక్రీకరణ రాతలు రాస్తున్నారు*

 *-ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను*

*-పల్నాడులో టిడిపికి ఎక్కడ చూసినా జనం ప్రభంజనంలో వస్తున్నారు*

*- వైసిపి మాదిరి ఎక్కడ ప్రలోభాలు పెట్టింది లేదు*

 *-తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై ఘాటుగా స్పందించిన లావు శ్రీకృష్ణదేవరాయలు*

*-రొంపిచర్ల మండలంలో పర్యటించిన శ్రీకృష్ణదేవరాయలు* 


అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పని అయిపోయిందని, వారు చేసే అసత్య ప్రచారాల్ని ప్రజలు నమ్మే పరిస్థితి  లేదని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తనపై వైసిపి చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఘాటుగా ఖండించారు. రొంపిచర్లలో పర్యటిస్తున్న ఆయన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

 వైఎస్ఆర్సిపి సిద్ధం సభల నిర్వహణకు అక్షరాల రూ. 700 కోట్లు ఖర్చు చేసిందని, అయినా జనం రాక గ్రాఫిక్స్ లు పెట్టి ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సిపి వారు నిర్వహించే ప్రతి సభలకు, ఆఖరికి నామినేషన్ కార్యక్రమాలకు కూడా ప్రలోభాలతో జనాన్ని తరలించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. వైసిపి కోసం పనిచేస్తున్న ఐ - ప్యాక్ టీం సర్వేలన్నీ భోగస్ అని, వాళ్ళు చేసే ప్రచారాలన్నీ అసత్యమేనని చురకలు అంటించారు.  సర్వేలతో వారి ఎమ్మెల్యేల్ని,  నాయకులను మోసం చేయడంతోనే పాటుగా ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా ఊహల్లోకి తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. నేను వైసీపీలో ఉన్నప్పటికీ నేను ఎవరి మీద విమర్శలు చేయలేదని,  ఈరోజు నా జోలికి వస్తూ నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నేను నా కష్టాన్ని నమ్ముకుని, పల్నాడు ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నానని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గాలి టిడిపి వైపునకి తిరిగిందని ల, ఎక్కడ చూసినా సభలకు, కార్యక్రమాలకి స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తున్నారని, వైసిపి మాదిరి ప్రలోభాలు ఎక్కడ గురి చేయట్లేదని పేర్కొన్నారు. రైతు ఒక పంట కోసం ఏ విధంగా కష్టపడతాడో.. పల్నాడు కోసం, ప్రజల కోసం అంతే నేను కష్టపడుతున్నానని, ప్రజలు మావైపే ఉన్నారని గట్టిగా మాట్లాడారు.  13వ తేదీ వరకు ప్రతి టిడిపి కార్యకర్త, నాయకుడు కష్టపడుతూనే ఉండాలని.. ఎట్టి పరిస్థితిలో టిడిపి గెలుపు సాధిద్దాం అని పిలుపునిచ్చారు.

Comments