ప్రకృతి యొక్క ప్రాముఖ్యత కరోనా లాంటి కష్ట కాలం ద్వారా తెలుసుకోగలిగాం - ఎంఎల్ఏ ఆర్కే...

 *ప్రకృతి యొక్క ప్రాముఖ్యత కరోనా లాంటి కష్ట కాలం ద్వారా తెలుసుకోగలిగాం - ఎంఎల్ఏ ఆర్కే...


*


*మంగళగిరి నగరానికి ఎకో పార్క్ ఒక వరం అంటూ ప్రకటన....*


*మరొకసారి ప్రజల మరొకమారు ఆశీర్వదిస్తే మంగళగిరి నగరానికి వరమైన టెంపుల్ హిల్ ఎకో పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామంటూ ప్రకటన...*

మంగళగిరి (ప్రజా అమరావతి);

ఈ రోజు ఉదయం మంగళగిరి  ఎయిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఎకో పార్క్ లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారీ రోశయ్య, మంగళగిరి శాసనసభ అభ్యర్థిని మురుగుడు లావణ్య, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు....


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ : 


కరోనా లాంటి కష్టకాలంలో ప్రకృతి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ తెలిసిందని...ఆక్సిజన్ విలువ గురించిన ఆవశ్యకత సమాజం మొత్తం గ్రహించిందని...


అటువంటి మంచి ఆక్సిజన్ మంగళగిరి ప్రజలకు ఈ టెంపుల్ హిల్ ఎక్కువ పార్క్ ద్వారా అందడం మంగళగిరి ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు...


గత రెండున్నర సంవత్సరాల కాలంలో టెంపుల్ హిల్ ఎకో పార్కు ను విశేషంగా అభివృద్ధి చేశామని...


ఎకో పార్క్ ఆవరణలో హిల్ ట్రెక్కింగ్, గిరి ప్రదర్శన, చిన్న పిల్లలకు పార్కు, మరియు ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను ప్రభుత్వ సహాయ సహకారాలతో కల్పించామని అన్నారు..


మంగళగిరి ప్రజలు మరొకమారు ఆశీర్వదిస్తే ఈ టెంపుల్ హిల్ ఎకో పార్కు ను ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు...

Comments