జగన్‌పై దళిత సమాజం తిరగబడింది.*జగన్‌పై దళిత సమాజం తిరగబడింది


*


*రాజకీయాలను జగన్ కలుషితం చేశారు*


*నీ మీద రాళ్లు వేస్తే హత్యాయత్నం... మాపై వేస్తే భావప్రకటన స్వేచ్ఛా?*


*నా దళితులు.. అంటూ దళితుల్ని ఊచకోత కోసిన సైకో ఈ జగన్ రెడ్డి*


*అధికారంలోకి వచ్చాక ప్రతి పేద వాడికీ 2 సెంట్లు స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తా*


*నా వల్ల ప్రతి ఇంట్లో సంపద సృష్టి జరిగింది... జగన్ రెడ్డి మాత్రం తన ఇంట్లో సంపద సృష్టించుకున్నాడు*


*నీళ్లొస్తే సంపద పెరుగుతుందనడానికి శ్రీ సిటీ నిదర్శనం*


*కియాకు 600 ఎకరాల భూమిస్తే 12 లక్షల కార్లు తయారు చేసింది.. అదీ సంపద సృష్టి అంటే*


*రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే బాధ్యతతో... రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కూటమిగా ఏర్పడ్డాం*


*2019లో చేసిన చిన్న పొరపాటుకు రాష్ట్రం అధోగతిపాలైంది.. మరోసారి తప్పు చేయొద్దు*


*ఓటు వేసే ముందు బిడ్డల భవిష్యత్తును తలచుకుని ఓటేయండి*


*సత్యవేడు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు*


సత్యవేడు (ప్రజా అమరావతి):


సత్యవేడు ప్రజలకు ధన్యవాదాలు. గతంలో ఎన్నో సార్లు సత్యవేడు క్లాక్ టవర్ వద్ద సభలు పెట్టాను. కానీ ఎన్నడూ లేని విధంగా ఉంది. సమరానికి సై అంటూ సత్యవేడు తొడకొడుతోంది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రత్యేకంగా దళితుల్లో వచ్చిన తిరుగుబాటు చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. ఎక్కడో పుంగనూరులో ఉంటూ.. సత్యవేడులోని ఇసుక, గ్రావెల్, మట్టి మొత్తం దొంగిలించి చెన్నైలో అమ్ముకుంటున్నాడు. ప్రశ్నిస్తే.. నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు అన్నారు. అలాంటి అరాచక శక్తుల్ని ఎదురొడ్డిన నాయకుడు కోనేటి ఆదిమూలం. తెలుగుదేశం పార్టీలోనే జెడ్పీటీసీగా, ఫ్లోర్ లీడర్ గా, జిల్లా పార్టీలో పని చేశారు. పెత్తందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఐఏఎస్ అధికారిగా పని చేసిన వ్యక్తి అవమానాలు భరించలేక తిరుగుబాటు చేసి వేరే పార్టీ నుండి పోటీ చేస్తానని బీజేపీలో చేరారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.


నా దళితులు.. నా దళితులు అంటూ దళితుల్ని ఊచకోత కోసిన సైకో ఈ జగన్ రెడ్డి. సత్యవేడు సాక్షిగా చెబుతున్నా.. రేపు జరిగే ఎన్నికల్లో 29 ఎస్సీ నియోజకవర్గాల్లో కూటమి విజయఢంకా మోగిస్తుంది. అవినీతి డబ్బు వెదజల్లి, మద్యం ఇచ్చి, బస్సుల్లో జనాన్ని తరలించినా ఎవరూ సభల్లో ఉండడం లేదు. అలాంటి సభల నుండి జగన్ రెడ్డి మాట్లాడుతున్నా.. నా నోటి నుండి ఏ రోజైనా తప్పుడు మాట వచ్చిందా? 45 ఏళ్లుగా నిజాయితీని నమ్ముకుని, నీతిగా రాజకీయం చేశాను. అలాంటి నాపై తప్పుడు కేసులు పెట్టాడు. ఒకప్పుడు సమకైక్య రాష్ట్రంలో.. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు కడుతుంటే దాన్ని అడ్డుకున్నందుకు నాపై ఒక కేసు పెట్టారు. అది కూడా ప్రజలకు, నా రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని పోరాటం చేశాను. అలాంటి నాపై గత ఐదు సంవత్సరాల్లో ఈ సైకో ఏకంగా 22 కేసులు పెట్టాడు. 


వందలాది మంది తెలుగుదేశం పార్టీ నేతలపై, జనసేన, బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టాడు. కేసులు పెట్టి వేధించే సైకో.. ఇప్పుడు బీద అరుపులు అరుస్తున్నాడు. నువ్వు కేసులు పెడతావు. కానీ మేము ప్రజల తరఫున మాట్లాడి నిలదీస్తే బూతులు మాట్లాడుతున్నారని గావుకేకలు పెడుతున్నాడు. 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ రెడ్డిని సైకో అనడం తప్పా? వీటికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా జగన్ రెడ్డీ? ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.33 వేల కోట్లు దారి మళ్లించినోడిని సైకో అనడం తప్పా? పేద దళితులకు నేను భూమి కొనుగోలు పథకం అమలు చేశా. దాన్ని రద్దు చేసినోడిని సైకో అనడం తప్పా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక రాయితీలు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు రద్దు చేసినోడిని సైకో అనడం తప్పా? మెడికల్ సీట్లలో రిజర్వేషన్లు రద్దు చేశాడు. బ్యాక్ లాగ్ పోస్టులు లేవు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. కేంద్ర పథకాలు రద్దు చేశాడు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ రద్దు చేశాడు. డ్రైవర్లను ఓనర్లుగా మార్చే లక్ష్యంతో అందించిన స్వయం ఉపాధి పథకాలు రద్దు చేశాడు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్  పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. ప్రశ్నించిన దళితుల గొంతు నొక్కాడు. 188 మంది దళితుల్ని చంపారు. 6 వేల మంది దళితులపై దాడులకు పాల్పడ్డారు. మద్యం అరాచకాన్ని ప్రశ్నించిన దళిత యువకుడు విక్రమ్ ని హత్య చేయించాడు. ఇలాంటి దళిత ద్రోహిని సైకో అనడం తప్పా?


ఇసుక, గ్రావెల్, మట్టి 200 టిప్పర్లు పెట్టి చెన్నైలో అమ్ముకుంటున్నాడు. ఆకాశమే హద్దుగా ఇక్కడ ఒక పుడింగి దోచుకుంటున్నాడు. అటవీ భూముల్లో యూకలిప్టస్ చెట్లు పెంచితే.. అక్కడ కూడా కమిషన్లు కొట్టేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు డెన్ గా చిత్తూరు జిల్లాను మార్చారు. ఎర్ర చందనం స్మగ్లర్ ని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబెట్టారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వాడికి ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నావ్. దళితుడికి శిరోముండనం కేసులో జైలు శిక్ష పడిన వాడికి ఎమ్మెల్యే సీటిచ్చారు. ఇలాంటి వారిని చిత్తుచిత్తుగా ఓడించి, వైసీపీని భూస్థాపితం చేసిన రోజే మనకు భవిష్యత్ ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో 22 కేసులున్న వ్యక్తి ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉన్నాడు.గతంలో ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగాడు, నెత్తిన చెయ్యి పెట్టి, బుగ్గన ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి పేదలపై ధరల బాదుడు, పన్నుల వాతలు తప్ప ఇంకేమైనా ఉందా? కరెంటు ఛార్జీలు పెంచను అన్న వ్యక్తి 9 సార్లు పెంచి 60 వేల కోట్ల భారం వేశాడు. కానీ, ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచని చరిత్ర తెలుగుదేశాన్ని. గతంలో రూ.200 ఉన్న కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 చేసిందెవరు జగన్ రెడ్డీ. రూ.60 ఉన్న మద్యం ధరల్ని రూ.200కి పెంచి సొంతంగా మద్యం వ్యాపారం పెట్టాడు. మద్య నిషేధం పేరుతో మహిళల ఓట్లు వేయించుకున్నాడు. మద్యం నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. అలాంటి వాడు కల్తీ మద్యం రుద్దుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. దేశంలో ఎక్కడా దొరకని పిచ్చి బ్రాండ్లు ఏపీలో ఎందుకు దొరుకుతున్నాయో ఆలోచించాలి. ఒకసారి చూడండి..తమిళనాడుకి ఏపీకి పెట్రోల్ ధరలకు 20 తేడా ఎందుకు ఉంది? ధరలు పెంచి పన్నులు పెంచి మంచి పాలన అనడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి. ఇది పరిపాలనా? చెత్తపై కూడా పన్ను వేసిన ముఖ్యమంత్రిని సైకో అనడం తప్పా? ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? కేసులు పెడతారా? అరెస్టు చేస్తారా? ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున పోరాడుతా. 200 టిప్పర్లతో దోచుకుంటుంటే ప్రశ్నించకూడదా? దొంగల్ని పట్టుకుంటే దాడి చేస్తారా?


అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టేవారు వారి ఎమ్మెల్యేలు. ఎవరు ఎక్కువ బూతులు తిడితే వారికి మంత్రి పదవి. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తే వారొక మంత్రి. ఇంకా ఎక్కువ బూతులు వారికి ప్రమోషన్లు. పవన్ కల్యాణ్ పై దాడి చేసినోడికి పదవులిస్తారు. రాష్ట్రం కోసం, నీతి నిజాయితీతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిపై బూతులు తిడతావా? జగన్ రెడ్డికి తెలిసిందల్లా.. పెళ్లాళ్ల గురించి మాట్లాడడం, ఆడవారిని తిట్టించడమే. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నాడు. చివరికి చెల్లెల్ని కూడా అవమానించే దుర్మార్గుడు ఈ సైకో. రాజకీయాల్లో జగన్ రెడ్డి లాంటి రాక్షసులకు చోటు ఉండకూడదు. రాష్ట్రంలోని సంపద మొత్తం తన దగ్గరే ఉండాలనుకునే అహంకారి ఈ జగన్ రెడ్డి. రాష్ట్రం నాశనమైపోయినా తన ఖజానా నిండితే చాలు అనుకునే వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలు చేయడం అలవాటుగా మారిపోయింది.  గత ఐదేళ్లుగా ప్రజల్ని ఎన్ని రకాలుగా అవస్థలు పెట్టాడో ప్రజలంతా చూశారు.


కోడికత్తిని మించిపోయిన విధంగా.. విజయవాడలో గులకరాయి నాటకం మొదలు పెట్టాడు. ఇతను వెళ్తుంటే కరెంటు పోయిందంట, ఎవరో రాయి విసిరారంట, దాన్ని నేనే గులకరాయితో చంపించేందుకు ప్రయత్నించానని డ్రామా మొదలు పెట్టాడు. దానికి ఏకంగా హత్యా యత్నం కింద కేసు పెట్టి ఒక బీసీ బిడ్డని అరెస్టు చేశారు. నీపై గులకరాయి వేస్తే.. హత్యాయత్నం అంటాడు. కానీ, నాపై గానీ, తెలుగుదేశం పార్టీ నాయకులపై గానీ రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడినా కనీసం ఎక్కడా కేసు కూడా నమోదు చేయలేదు. పైగా డీజీపీ దాన్ని సమర్ధించడమే కాకుండా, ప్రజాస్వామ్యం అంటున్నాడు. జగన్ రెడ్డి తన సైకో తనంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇంకా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. గొడ్డలి గురించి ఎవరూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నాడు. గులకరాయి వేస్తే.. రాష్ట్రానికి అవమానమంట. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాపై దాడులు చేస్తే మాత్రం కేసులు ఉండవంట. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు. ఐదేళ్లలో ఒక ఎమ్మెల్యేని గానీ, ఎంపీని గానీ ఈ జగన్ రెడ్డి కలిశాడా? కానీ, సాయంత్రం వస్తే కాసులు లెక్కేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. 


నేను రూ.5కే అన్న క్యాంటీన్ పెట్టి అన్నం పెట్టాను. పక్కనే తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ప్రభుత్వం మారినా కొనసాగిస్తోంది. పేదల ఆకలి తీరుస్తోంది. కానీ, పేదల నోటి దగ్గరి కూడును దూరం చేసినోడు పేదల మనిషా? పేదలకు మెరుగైన విద్య అందించేలా తెచ్చిన విదేశీ విద్య రద్దు చేసినోడు పేదల మనిషా? 2.62 లక్షల టిడ్కో ఇళ్లు అన్ని సదుపాయాలతో పూర్తి చేస్తే ఇంత వరకు ఎందుకు పేదలకు అందించలేదో సమాధానం చెప్పగలవా? రేపు అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లను పేదలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. జగన్ రెడ్డి ఇళ్ల పట్టాల పేరుతో రూ.7 వేల కోట్లు దోచేశాడు. వాగులు, వంకల్లో స్థలాలిచ్చి ఏదో చేశానని చెబుతున్నాడు. కానీ, నేను చెబుతున్నా.. అధికారంలోకి రాగానే 2 సెంట్ల భూమిచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటా. సేవ అంటే పవిత్రంగా ఉండాలి.. కొంగ జపంలా ఉండకూడదు జగన్ రెడ్డీ.


ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రకటించాం. మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. డ్వాక్రాతో పొదుపు నేర్పించాను. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశమే. ఆడబిడ్డ నిధితో ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తా. తల్లికి వందనంతో బిడ్డను బడికి పంపే ప్రతి తల్లికీ బిడ్డకు రూ.15వేల చొప్పున అందరికీ అందిస్తాను. పిల్లలు బాగా చదువుకోవాలి. మన ఆస్తి మన పిల్లలే. వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. గతంలో దీపం పథకంతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ప్రతి ఒక్కరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. ఆర్టీసీలో ప్రతి మహిళకూ ఉచిత ప్రయాణం కల్పిస్తాను. ఇక్కడే ఉన్న శ్రీ సిటీలోని మహిళా ఉద్యోగులకు ఇదో వరం లాంటిది. మీరెక్కే బస్సుకు నేనే డ్రైవర్. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దూసుకెళ్లే డ్రైవర్ నేనే. యువతకు యువగళంతో ప్రతి ఒక్కరికీ నెలక రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అని దగా చేశాడు. ఒక్క డీఎస్సీ అయినా తీశాడా? ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? సత్యవేడు సాక్షిగా మాటిస్తున్నా.. అధికారంలోకి రాగానే తొలి సంతకంతో డీఎస్సీ ఇస్తా. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తా. పెట్టుబడులు తెస్తా. ఉద్యోగాలు కల్పిస్తా. జగన్ రెడ్డి  పెట్టుబడులు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు కూడా పోయాయి. ఇక్కడే ఉన్న శ్రీసిటీకి 190 పరిశ్రమలు తెచ్చాను. హీరో మోటార్స్, రిపబ్లిక్ ఫోర్జ్, అపోలో టైర్స్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలిచ్చాను. నేను మళ్లీ వచ్చి ఉంటే వందలాది పరిశ్రమలు వచ్చేవి. యువత భవితకు భరోసా కల్పించే బాధ్యత నాది.


అన్నదాత పథకంతో ప్రతి రైతుకు రూ.20 వేలు అందిస్తా. బిందు సేద్యం లాంటి పథకాలను పునరుద్దరిస్తాను. ఎన్టీఆర్ హయాంలో తెలుగుగంగ ప్రాజెక్టుతో.. సీమకు నీళ్లిచ్చారు. సత్యవేడుకు తెలుగుగంగ నీరు ఎన్టీఆర్ చలవే. తెలుగు గంగ నీరున్నాయి కాబట్టే శ్రీసిటీ వచ్చింది. పరిశ్రమలొచ్చాయి. పరిశ్రమల కారణంగా నేషనల్ హైవే వచ్చింది. చెన్నైలో విమానాశ్రయం ఉంది. తిరుపతిలో విమానాశ్రయం ఉంది. నెల్లూరులో పోర్టు ఉంది. విమానాశ్రయం కూడా ఏర్పాటు చేస్తే.. ఇక్కడకు పెట్టుబడులు వరదలా వస్తాయి. యువతకు పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పొరుగు ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. 


నా వల్ల రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంపద సృష్టి జరిగింది. కానీ, జగన్ రెడ్డి మాత్రం తన ఇంట్లో సంపద సృష్టించుకుంటున్నాడు. భారతి సిమెంట్ కోసం సిమెంటు కంపెనీలన్నింటినీ బెదిరించి, ధరలు పెంచుకున్నాడు. మరోవైపు సాక్షి పత్రికకు వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టి తన ఆదాయం పెంచుకున్నాడు. ప్రజల ఆదాయం పెరగలేదు. ఆస్తులు పెరగలేదు. కానీ జగన్ రెడ్డి మాత్రం వేల కోట్లు వెనకేసుకున్నాడు. ఈ అప్పుల అప్పారావు నన్ను అడుగుతున్నాడు. ఈ పథకాలన్నింటికీ డబ్బు ఎక్కడి నుండి తెస్తావని. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. నీలా అప్పులు, దోపిడీలు కాదని గుర్తుంచుకో జగన్. హైదరాబాద్ నగరం ఈ స్థాయిలో ఉందంటే కారణం ఎవరు? ఐటీ చదువుకున్న పిల్లలకు బంగారు భవిష్యత్ కల్పించాను. 


అదే సమయంలో సాగునీరు పుష్కలంగా ఉంటే బంగారం పండించే రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు. పోలవరం పూర్తి చేసి గోదావరి నీరు రాయలసీమకు తీసుకు రావాలని ఆకాంక్షించాను. పోలవరం నుండి నాగార్జున సాగర్ నుండి నల్లమల ప్రాజెక్టు నుండి బనకచర్ల అటు నుండి తెలుగు గంగతో సీమకు నీరు తేవడానికి ప్రణాళిక రూపొందించాను. అందుకోసం కృష్ణా గోదావరి అనుసంధానం చేశాను. మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే పెన్నా అనుసంధానించేవాడిని. రాష్ట్రంలో సాగు, తాగునీటికి కొరత ఉండేది కాదు. సంపద సృష్టించే అమరావతిని నాశనం చేశాడు. పోలవరాన్ని ముంచేశాడు. నీళ్లొస్తే సంపద పెరుగుతుందనడానికి శ్రీ సిటీ నిదర్శనం. ఒక పరిశ్రమ వస్తే.. ఆ పక్కనే ఉన్న భూమి విలువ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. రోడ్డేయడం, కాలేజీ రావడం, ప్రాజెక్టు కట్టడం ఇలా ఏదైనా సంపద సృష్టించడమే. 


కియాకు 600 ఎకరాల భూమిచ్చి, గొల్లపల్లి రిజర్వాయర్ తో నీరిస్తే రూ.16 వేల కోట్ల పెట్టుబడి పెట్టారు. 20 వేల మందికి ప్రత్యక్షంగా మరో 20 వేల మందికి పరోక్షంగా 20 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. వెనుక బడిన జిల్లాగా పిలిచే ప్రాంతంలో తయారైన కార్లు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. అదీ సంపద సృష్టించడమంటే. గత ఐదు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? ఒక్క కాలువ తవ్వావా? సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, ఆ ఆదాయాన్ని పేదలకు పంచుతా. ప్రభుత్వం నుండి అందుకునే ప్రతి రూపాయి కూడా ఆదాయం పెంచుకునే మార్గం చూపిస్తాను. 


సత్యవేడు, వరదాయపాలెంలను నగర పంచాయతీలుగా చేసి ఆదునిక నగరాలుగా తయారు చేస్తాను. పరిశ్రమలు వస్తే, ఇక్కడ అద్బుత నగరం వస్తుంది. సత్యవేడులో డిగ్రీ కాలేజీ భవనాలు, ఆర్డీవో డీఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాను. కె.వి.పురం మండలంలో కాళంగి ప్రాజెక్టు ఆధునికీకరణ, అరుణానదిలో పిచ్చాటూరు నుండి సురిటిపల్లి వరకు చెక్ డ్యాములు కట్టి భూ గర్భజలాల పెంపునకు కృషి చేస్తాను. దాసుగుప్పం-సత్యవేడు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తా. సత్యవేడులోని మతంగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి పనులు చేస్తా. తెలుగు గంగ నీటిని సత్యవేడుకు మళ్లించి కుడి ఎడమ కాలువలు నిర్మిస్తాను. శ్రీ సిటీలో స్థానికులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తాను. సురుటిపల్లి నుండి నారాయణవరం వరకు డివోషనల్ టూరిజం హబ్ చేసే బాధ్యత తీసుకుంటాను. కడూరు నుండి సత్యవేడు వరకు రెసిడెన్షియల్ కారిడార్ ఏర్పాటు పరిశీలిస్తాను. సత్యవేడు నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేయాలో అంతా చేసి చూపిస్తాను. సత్యవేడు నియోజకవర్గాన్ని జిల్లాలోనే అభివృద్ధికి మోడల్ గా మార్చి చూపిస్తాను. శ్రీ సిటీలో 200 పరిశ్రమలున్నాయి. వాటిని పెంచడం పెద్ద కష్టం కాదు. తెలుగు గంగ కాలువలు వెడల్పు చేస్తే కావలసినంత నీరు నిల్వ చేసుకోవచ్చు. పరిశ్రమలకు అనువైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచేలా చేస్తాను.


మూడు పార్టీలు కలిసి వచ్చినందుకు భయపడుతున్నామని ఈ సైకో జగన్ అంటున్నాడు. మాది భయం కాదు బాధ్యత. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే బాధ్యత. ఈ సైకో నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కలిశాం. ఇండియా 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ కావాలని ప్రధాని మోదీ ఒక మోడల్ రూపొందించారు. ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అయితే.. అందులో ఆంధ్రప్రదేశ్, తెలుగువారు నెంబర్ వన్ గా ఉండాలనేది నా లక్ష్యం.  నాకు దూర దృష్టి ఉంది. దేశంలో జీరో పావర్టీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీని మార్చడమే నా లక్ష్యం. పేదలను పేదరికం నుండి బయటకు తీసుకురావాలనేదే నా కల. దాన్ని సాధించి చూపిస్తాను. కేసుల కోసం, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రం ముందు జగన్ మోకరిల్లాడు. బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి వస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో కూటమిగా ఏర్పడ్డాం. 


25 పార్లమెంటు, 160కి పైగా అసెంబ్లీ సీట్లు గెలిపించే బాధ్యత తీసుకోండి. ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపే బాధ్యత నేను తీసుకుంటాను. నా వయసు గురించి ఈ జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నాతో గంట ఎండలో తిరగగలవా? నాలా గంట సేపు ఎండలో ఉండి మాట్లాడగలవా? నా ఆలోచన అజెండా ప్రజా క్షేమం. కానీ, జగన్ రెడ్డి అజెండా వేరు. ఆలోచన వేరు. నన్ను 45 ఏళ్లుగా ఆదరించిన ప్రజల కోసం పరితపిస్తున్నా. నేను ఉన్నా.. లేకున్నా.. ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా ప్రజల జీవితాలు మార్చాలి. ప్రధాని పదవిని కూడా త్యజించి రాష్ట్రాభివృద్ధి కోసం ఇక్కడే ఉండిపోయా. అలాంటి నేను ఈ సైకోతో మాటలు పడాల్సి వస్తోంది. మీ కోసం ఎంత అయినా కష్టబడతా. నా పుట్టిన రోజు నాడు హామీ ఇస్తున్నా.. దేశంలో తెలుగు ప్రజల్ని అగ్రస్థానంలో నిలిపే బాధ్యత తీసుకుంటాను. 


2019లో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం రాష్ట్రాన్ని రివర్స్ పాలనలో నడిపించాడు. అభివృద్ధి లేదు. సంక్షేమం లేదు. రివర్స్ గేర్ లో నడుస్తున్న రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి నా శక్తినంతా కూడగట్టుకుని పని చేస్తాను. యువత ఆలోచించుకోవాలి. రాష్ట్రాన్ని శక్తివంతమైన రాష్ట్రంగా మార్చి నా తెలుగు ప్రజల్ని అగ్రస్థానంలో నిలుపుతాను. జగన్ రెడ్డి మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దు. నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తున్నాం. రివర్స్ పాలనలో రివర్స్ నడుస్తున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టి అభివృద్ధి చేసి చూపిస్తా. దుర్మార్గుడిని ప్రశ్నించగల నాయకులతోనే ప్రజాస్వామ్యం మొదలవుతుంది. జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని ఎదురొడ్డిన ఆదిమూలంకు సీటు ఇచ్చాను. కార్యకర్తలు, నాయకులు అంతా ఒకే తాటిపై ఉండాలి. ఆదిమూలం గెలుపు కోసం అంతా కలిసి పని చేయాలి. మరోవైపు జగన్ రెడ్డి దగాకు బలైపోయిన మరో దళిత నాయకుడు మన వరప్రసాద్.  కావాల్సినంత వాడుకుని తర్వాత అవమానించి గెంటేశారు. వరప్రసాద్ మంచివాడు కాదన్న జగన్ రెడ్డిని అడుగుతున్నా.. ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో రెండు సీట్లు ఇచ్చావ్. మరోవైపు చిత్తూరులో ఎర్రదుంగల స్మగ్లర్‌ని ఎమ్మెల్యేగా నిలబెట్టావ్. అంటే వారు రెడ్లు కాబట్టి సీట్లిచ్చావ్.. వరప్రసాద్ దళితుడు కాబట్టి అవమానిస్తావా? ఇదేనా సమాజిక న్యాయం? రెడ్లకు న్యాయం చేశాడనుకుంటే అక్కడా అన్యాయమే. కేవలం తన కేసుల్లోని రెడ్లకు, తన చెంచాదారులకు మాత్రమే న్యాయం జరిగింది. కమలం గుర్తుపై ఓటు వేసి వరప్రసాద్ ని పార్లమెంటుకు పంపించాలి. ఇక్కడ నొక్కే బటన్ మీకు కేంద్రం నుండి నిధులు తెస్తుంది. సత్యవేడులో.. ఒక బటన్ సైకిల్ గుర్తుపై, మరో బటన్ కమలం గుర్తుపై నొక్కండి. ఈ రెండు బటన్లు బాధ్యతగా భవిష్యత్తు గురించి ఆలోచించి నొక్కండి. మీ జీవితాలకు మార్గం చూపించే బాధ్యత కూటమి తీసుకుంటుంది.

Comments