పేదవారి భవిష్యత్తు మే 13న మనం తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంది : ఎమ్మెల్యే ఆర్కే...

 *పేదవారి భవిష్యత్తు మే 13న మనం తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంది : ఎమ్మెల్యే ఆర్కే...


*

దుగ్గిరాల (ప్రజా అమరావతి);

*దుగ్గిరాలలో గిరిజన సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిని మురుగుడు లావణ్య.....*


ఈ రోజు దుగ్గిరాల మండల కేంద్రం దుగ్గిరాలలో జరిగిన గిరిజన సోదరుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కే మరియు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిని మురుగుడు లావణ్య లు పాల్గొని ప్రసంగించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ : 


రానున్న ఎన్నికలలో పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ జరుగుతుందని, పేదల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడుగా నిలిచి పోరాడుతున్నారని, అవతలి వైపు పెత్తందారులందరూ గుంపుగా కూడి వస్తున్నారని తెలియజేశారు...


మే 13న మీరు తీసుకునే నిర్ణయం పైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదవారి భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలిపారు...


రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలన్న దృఢ సంకల్పం కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని కోరారు...


గుంటూరు పార్లమెంటు సభ్యునిగా కిలారి వెంకట రోశయ్యకు మరియు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యురాలుగా మురుగుడు లావణ్యలకు ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

Comments