కోవిడ్ లో రోడ్లు, ఫ్లైట్లు నిర్మానుష్యమైనా ప్రజలకు అండగా ఉన్నాం: ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



*కోవిడ్ లో రోడ్లు, ఫ్లైట్లు నిర్మానుష్యమైనా ప్రజలకు అండగా ఉన్నాం:  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*డోన్ లో రూ.3500 కోట్లతో చేసిన అభివృద్ధి కనపడలేదా?*


*ఎన్నికలప్పుడు మొక్కే గుండాల క్షేత్రం శిథిలావస్థకు చేరినా కట్టాలనిపించలేదా?*


*ఎక్కడా సీటివ్వమని తేల్చే చెప్తే డోన్ కి వచ్చి అడ్డా అంటారా?*


*కోవిడ్-19 విపత్తు సమయంలో ప్రజలకు కూటమి ఏం చేసింది?*


*డోన్ అడ్డా అయితే పార్టీ ఆఫీస్ ఫంక్షన్ హాల్ కి ఎందుకెళ్లింది?*


*గృహప్రవేశంతో పూజాలు చేసిన ఇల్లైనా మీదేనా కాదా?*


*డోన్ లో పూర్తైన 195 అభివృద్ధి పనుల్లో మంత్రి కనిపించలేదా?*


*పార్లమెంట్ లో ప్రజల కోసం ఏనాడైనా గళం విప్పారా? ఒక్క అభివృద్ధి పనైనా చేశారా?*


*అభిమానించే ప్రజలకు అభివృద్ధి చేస్తే 5 సార్లు ఎందుకు ఓడిపోయారు?*


*దొంగ కేసులు పెట్టిందెవరు? దొంగల ఇంటికి వెళ్లి దోపిడినీ ప్రోత్సహించిందెవరు?*


*నీతిమంతులైతే డోన్ లో ఫ్లైఓవర్ పొడవు ఎందుకు పెరిగింది?*


*రాష్ట్ర విభజన సమయంలో రైల్వే మంత్రి అయిన విధానం ఏం నీతి? అదేం రీతి?*


*మీరే చూసుకోండి..మీరే దోచుకోండంటూ వార్డులను వేలానికి వేసిందెవరు?*


*అంగళ్లు, బియ్యం, బెల్లంపై వసూళ్లు చేయడం కూడా నీతేనా?*


*ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఒక్క అల్లరైనా జరిగిందా?*


*ఇద్దరు 'కే'ల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల మనోవ్యథకు ఏం బదులిస్తారు?*


*డోన్ పట్టణం పాత బస్టాండ్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*



డోన్, నంద్యాల జిల్లా, మే,11 (ప్రజా అమరావతి); కోవిడ్ విపత్తులో భయంతో మనుషులు లేక నిర్మానుష్యంగా మారిన రోడ్లు, ఫ్లైట్లలో తిరిగి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. బయటికొస్తే ఏమవుతుందో తెలియని భయాందోళనలో కూడా ధైర్యంగా ప్రజలకు భరోసానిచ్చామన్నారు. నాడు కోవిడ్ కాలంలో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఏం చేశారని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. డోన్ పట్టణం పాతబస్టాండ్ సర్కిల్ సమీపంలో శనివారం మంత్రి బుగ్గన భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకు ముందు ఫ్లై ఓవర్ నుంచి మొదలుపెట్టి పాత బస్టాండ్ గాంధీ బొమ్మ సర్కిల్ దగ్గరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. అనంత మంత్రి బుగ్గన మాట్లాడుతూ..మంత్రి బుగ్గన అందుబాటులో లేరని ప్రచారం చేస్తున్న కూటమి అభ్యర్థి కోట్లకు..డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ.3,500 కోట్లతో పూర్తి చేసిన 195 ప్రాజెక్టుల అభివృద్ధి  కనపడలేదా అని ప్రశ్నించారు. ఎక్కడా సీటివ్వలేమని తేల్చి చెబితే అన్ని ప్రయత్నాలు చేసి గత్యంతరం లేక డోన్ కు వచ్చి అడ్డా అంటారా అని మండిపడ్డారు. డోన్ 'కోట్ల' అడ్డా అయితే టీడీపీ కార్యాలయం ఫంక్షన్ హాల్ లో ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఇటీవల గృహప్రవేశం చేసి పూజలు నిర్వహించిన ఇళ్లైనా కోట్ల సొంతమా కాదా అనడిగారు.


పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా పదవులు అనుభవించిన కోట్ల డోన్ కు ఏం చేశారో చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం ఏనాడైనా ప్రజలకు మంచి చేసే పనికోసం ఏనాడైనా గళం విప్పారా? అన్నారు. కోట్లపై అభిమానం కురిపిస్తున్నారని మాట్లాడుతున్న నేపథ్యంలో అంత అభిమానం చూపేవారు డోన్, ఆలూరు, ఎమ్మిగనూరు, కర్నూలు ప్రజలు 5సార్లు ఎందుకు ఓడించారో చెప్పాలన్నారు. దొంగ కేసులు పెట్టేది..ఇటీవల దొంగల ఇంటికి వెళ్లి దోపిడీ చేసుకోమ్మని ప్రోత్సహించింది మీరు కాదా అని మంత్రి బుగ్గన నిలదీశారు. మీరే చూసుకోండి..మీరే దోచుకోండంటూ పట్టణంలోని వార్డులను వేలం వేసినట్లు మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. నీతి, అవినీతికి మధ్య యుద్ధం అని కోట్ల మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. డోన్ లో ఫ్లైఓవర్ పొడవు ఎందుకు పెరుగుతూ పోయిందో ప్రజలకు చెప్పాలన్నారు. అంగళ్లు, బియ్యం, బెల్లం అన్నింటిపై వసూళ్లు, దందాలు చేసిందెవరో స్పష్టతనిస్తే బాగుంటుందన్నారు. కీలకమైన రాష్ట్ర విభజన సమయంలో వంటవార్పులతో సీమ ప్రజలు రోడ్ల మీద పడితే..తమరికి కేంద్ర మంత్రి పదవి ఏ నీతిలో ఏ రీతిలో వచ్చిందో చెప్పాలన్నారు. అల్లర్లు కాకుండా చూసేందుకు సోనియా గాంధీకి హామీ ఇచ్చి చీకటి ఒప్పందంతో రైల్వే కేంద్ర మంత్రి అయిన మాట వాస్తవం కాదా అన్నారు. గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన గానీ, ఘర్షణ గానీ జరిగిందా అని ప్రజలను అడిగారు. ఇద్దరు 'కే'లు ఒక్కటయ్యామని వేదికపై చేతులెత్తి చెబుతున్నారన్నారు. మీరు వేరై..రక్తం ఏరై..ఎన్నో అమాయాక ప్రాణాలను బలిగొన్నప్పుడు.. ఆ కుటుంబాల మనోవ్యథని మీ కలయిక తీరుస్తుందా అని ఘాటుగా స్పందించారు.



Comments