బిసిజి టిబి టీకాకు విశేష స్పంద‌న‌.


 



బిసిజి  టిబి టీకాకు విశేష స్పంద‌న‌


- 324964  మందికి బిసిజి టిబి టీకా

-రాష్ట్ర టిబి జాయింట్  డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ తాళ్లూరి ర‌మేష్ 

గుంటూరు, మే23 (ప్రజా అమరావతి);

18 ఏళ్లు పైబ‌డిన వారికి ఆరు కేట‌గిరీల్లో 12 జిల్లాల్లో కొన‌సాగుతున్న బిసిజి  టిబి టీకాకు విశేష స్పంద‌న ల‌భించింద‌ని రాష్ట్ర టిబి జాయింట్ డైరెక్ట‌ర్  డైరెక్ట‌ర్ తాళ్లూరి ర‌మేష్ అన్నారు. మొత్తం 324964 మంది ఈ టీకాలు వేసుకున్నార‌న్నారు. గురువారం నాడు ఆయ‌న గుంటూరు ప‌ట్ట‌ణంలోని ప‌లు ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల(UPHCs) ప‌రిథిలో గోరంట్ల‌, మ‌ల్లికార్జున పేట‌, నాజ్ సెంట‌ర్‌, గుంటూరువారి తోట‌, ఓల్డ్ గుంటూరు, ఐపిడి కాల‌నీ, లాంచెస్ట‌ర్ రోడ్, శ్రీనివాస‌రావు తోట త‌దిత‌ర సెష‌న్ల‌లో బిసిజి కా కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు.

ఈ టీకా కార్య‌క్ర‌మంలో గుంటూరు జిల్లా వెనుక‌బ‌డి ఉంద‌ని, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, సిబ్బంది మ‌రింత అంకిత భావంతో ప‌ని చేయాల‌ని ఈ సంద‌ర్భండా ఆయ‌న సూచించారు.  ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి   బిసిజి టిబి టీకాను వేసుకుంటున్నార‌ని, ప్ర‌తి వారంలో గురువారం నాడు ఈ టీకాను వేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ డాక్ట‌ర్ ఎస్‌. వెంక‌టేశ్వ‌ర్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర స్థాయిలో ఆయా జిల్లాల‌కు నియ‌మితులైన నోడ‌లాఫీస‌ర్లు టీకా కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌న్నారు. 12 జిల్లాల్లో బిసిజి టిబి టీకాను ఈనెల 16న ప్రారంభించామ‌నీ,  ఆ రోజు 171507  మంది బిసిజి టీకాలు వేసుకున్నార‌న్నారు. గురువారం నాడు విజ‌య‌న‌గరం, వైయ‌స్సార్ క‌డ‌ప‌, చిత్తూరు, య‌స్‌య‌స్‌పి నెల్లూరు, శ్రీ స‌త్య‌సాయి, కృష్ణా, నంద్యాల‌, ప‌ల్నాడు, విశాఖ‌ప‌ట్నం, అన్న‌మ‌య్య‌, గుంటూరు, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాల్లో 153370 మందికి ఇప్ప‌టి వ‌ర‌కు

 ఈ టీకాల్ని వేశామ‌ని  డాక్ట‌ర్ ర‌మేష్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సూచించిన ఆరు కేట‌గిరీల వారు త‌ప్ప‌ని స‌రిగా ఈ టీకాను వేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. 12 జిల్లాల్లోనూ మూడు  నెల‌ల‌ వ్య‌వ‌ధిలో ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయాల‌ని క‌మీష‌న‌ర్ ఆదేశించార‌ని  ఈ సంద‌ర్భంగా ఆయ‌న  తెలిపారు.

Comments