ఫలితమిచ్చిన స్వీప్ కార్యకమాలు...



ఫలితమిచ్చిన స్వీప్ కార్యకమాలు...


పోస్టల్ బ్యాలెట్ తో కలిసి 84.82 శాతం పోలింగ్ నమోదు...

ఏలూరు నగరంతోపాటు జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికల రికార్డును అధికమించిన పోలింగ్ శాతం...


ఏలూరు, మే, 15 (ప్రజా అమరావతి);... ఏలూరు జిల్లాలో నిర్వహించిన ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాలు(స్వీప్) ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు దోహదం చేశాయి. 2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 83.67 ఓటింగ్ శాతం నమోదు కాగా ప్రస్తుత ఎన్నికల్లో తుది గణాంకాలు సంకలన పూర్తయ్యేసరికి పోస్టల్ బ్యాలెట్ తో కలిసి దాదాపు 84.82 శాతంకు ఓటింగ్ పెరిగింది.  ప్రజా భాగస్వామికతో ఏలూరు జిల్లాలో విస్త్రృతంగా నిర్వహించిన స్వీప్ కార్యక్రమాలు ఇందుకు దోహదం చేశాయి. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం దృష్టిలో ఉంచుకొని ఈఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే లక్ష్యంగా జిల్లాలో 90 రోజలు నిర్విరామంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు అమలు చేసే భాగంగా ఓటర్స్ టర్నౌట్ ఇప్లిమెంటేషన్ ప్రణాళికను ఆమోదించి స్వీప్ నోడల్ ఆఫీసరుగా జిల్లా గ్రామ పంచాయితీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్ ను నియమించి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు.  కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు జిల్లాలో విస్త్రృతంగా స్వీప్ కార్యక్రమాలు అమలు చేసి జిల్లాలోని 7 నియోజవర్గాల్లో ఓటర్లలో చైతన్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో బాగంగా అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదు కావడంతోపాటు ఓటుహక్కు ప్రాధాన్యతను గుర్తించి బాధ్యతగా వినియోగించుకునేలా చేతన్య పరిచాయి. దీనిలో బాగంగా గిరిజన మరియు గ్రామీణప్రాంత ఓటర్లలో చునవ్ పాఠశాల, బూత్ లెవల్ లలో బూత్ లెవల్ అసోషియేషన్ గ్రూపులు ఏర్పాటు, కశాశాల విద్యార్ధులతో క్యాంపస్ అంబసిడర్లు ఏర్పాటుచేసి లెటరసి క్యాంపులు విస్త్రృతంగా ఏర్పాటు చేయడం, పట్టణ ప్రాంతాల్లోని అవగాహన సదస్సులు, మహిళా సంఘాల వారితో చర్చావేదికలు అలాగే మొదటిసారిగా ఓటుహక్కు నమోదుచేసుకున్న ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమాలు, ప్రయాణికులతో రద్దీగావున్న బస్సుకాంప్లెక్స్ లలో ఆరు అడుగుల నమూనా ఈవిఎంల ఏర్పాటు, అమ్మ పిలుస్తుంది ఓటుహక్కు వినియోగించుకోండని ఇతర రాష్ట్రాల్లో వున్న జిల్లా ఓటర్లను పోలింగ్ రోజున రప్పించి ఓటు వేయించాలనే ప్రత్యేక ఆహ్వాన పత్రిక ద్వారా పిలుపు జిల్లాలో పోలింగ్ శాతం పెరగడానికి దోహద పడింది. భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సూచించిన చునావ్ కా పర్వ్ దేశ్ గా గర్వ్, నతింగ్ లైక్ ఓటింగ్, ఐఓట్ ఫర్ షూర్ ఓటర్ల సందేశాలను పట్టణాల్లో, గ్రామాల్లో, మైకులు పెట్టి వినిపించడం, 547 గ్రామ పంచాయితీల్లో కళాజాత కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఉత్సాహపరచడం, అలాగే ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల మీద అవగాహన కల్పించడం, సంతకాల సేకరణ, కరపత్రాల పంపిణీ, ఓటుహక్కు వినియోగంపై ఇంటింటి ప్రచారం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సి-విజిల్, దివ్యాంగులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాక్ష్యం యాప్, 1950 టోల్ ప్రీ నెంబరు వినియోగంపై భారీస్ధాయిలో హోర్డింగ్ ల ఏర్పాటు, జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడం, నియోజకవర్గాల పరిధిలో ఎల్ ఇడి స్త్ర్క్రీన్ల ద్వారా డిజిటల్ ప్రదర్శనలు నిర్వహించడం, శివరాత్రి పర్వదినాన్న రికార్డుస్ధాయిలో 8 లక్షల మందికి కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించడం, వృద్ధాశ్రమాల్లో 'హోం ఓటింగ్' మీద అవగాహన కల్పించడం, అన్ని నియోజకవర్గాల్లో పోలీస్ కవాతులు నిర్వహించి ఓటర్లలో అభధ్రతా భావన తొలగించి విశ్వాసం కల్పించడం వంటి కార్యక్రమాలు జిల్లాలో పోలింగ్ శాతం పెంచడానికి దోహదం చేశాయి. ప్రముఖంగా అంధులకు, బధిరులకు, కంపెనీలలో పనిచేసే కార్మికులకు, ఉపాదిహామీ పధకం వేతన దారులకు, పారిశుద్య కార్మికులకు, మాజీ సైనికులకు, పి.వి.టి.జి. గిరిజనులకు, పట్టణ, గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఉన్న యువతీ,యువకులు, సీనియర్ సిటిజన్లకు, ప్రధానంగా పోలింగ్ కు 48 గంటల ముందు జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ జిల్లాలో వున్న 16 లక్షల 37 వేల 430 మంది ఓటర్లను ఉద్ధేశించి రండి. కదిలిరండి.. ఓటు మనహక్కు మాత్రమే కాదు.. మనఅందరి బాధ్యత.. అన్న పిలుపు జిల్లాలో అన్ని సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో అధిక సంఖ్యలో  ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోవడానికి ప్రముఖంగా దోహద పడింది. 

స్వీప్ కార్యక్రమాల్లో కళాశాల విద్యార్దులు, మహిళా సంఘాలు, ఉపాధిహామీ కార్మికులు, తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మానవహారాలు, స్వీప్ సదస్సులు, ర్యాలీలు, సందేశాత్మక సెల్పీ పాయింట్లు, ఆరు అడుగుల ఈవిఎంల నమూనా ప్రదర్శన, అఖండజ్యోతి దీపాలంకరణ, తదితర కార్యక్రమాలు జిల్లా ప్రజలను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా రాష్ట్రస్థాయిలో జిల్లా స్వీప్ కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చింది. వివిధ వర్గాల ప్రజల్లో ఓటుహక్కు ప్రదర్శనపై ఆలోచన, ఆచరణ, జాగృతి చేసే విధంగా 547 గ్రామ పంచాయితీల్లో నిర్వహించిన కళాజాత కార్యక్రమాలు, ఎంతో దోహదపడ్డాయి. ఎన్నికలను పర్వదినంగా భావించి ప్రజాస్వామ్యం పట్ల అచంచల విశ్వాసాన్ని చాటుతూ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే పోలింగ్ రోజు స్వీప్ నోడల్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ బృందం జిల్లా  తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులలో పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లను ఘనంగా స్వాగతించడం అలాగే ఓటువేసిన ప్రతి ఓటరుకు 'గో గ్రీన్'  అనే నినాదంతో పచ్చని మొక్కలు ఇచ్చి వీడ్కోలు పలకడం జిల్లా ఓటర్లను  విశేషంగా ఆకట్టుకుంది. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారిక ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేయడం విశేషం. ప్రధానంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఇన్ స్ట్రాగ్రామ్, యూ ట్యూబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ,షార్ట్ ఫిలిమ్స్ తదితర డిజిటల్ ప్రమోషన్స్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అయి జిల్లా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుండి మరి ముఖ్యంగా పలు విదేశాల నుండి కూడా ఓటర్లు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో స్వీప్ ప్రణాళికను సమర్ధవంతంగా నిర్వహించడం వలన అన్ని వర్గాల ఓటర్లలో స్పందన వచ్చి పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడింది.  జిల్లా వ్యాప్తంగా గత 90 రోజుల నుండి  2600 స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ఓటర్లలో చైతన్య అవగాహన పెంచడం వలన గత 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఏలూరు నగరంతోపాటు జిల్లాలో గత 2019 సార్వత్రిక ఎన్నికల రికార్డును అధికమించి పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 84.82 శాతం పోలింగ్ నమోదు అయి  గత ఎన్నికల రికార్డును తిరగరాసింది.  ఈ సందర్బంగా జిల్లా స్వీప్ నోడల్  అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గం పరిధిలోవున్న కాకసనూరు గ్రామం గిరిజనులు పోలింగ్ అధికారులను స్వాగతం పలికే సంప్రదాయం భారత ఎన్నికల సంఘం దృష్టిని ఆకర్శించి ప్రత్యేకంగా ఎక్స్ వేదిక ద్వారా ఆ విషయాన్నీ ట్వీట్ చేయడం జిల్లాలో స్వీప్ ద్వారా జరిగిన ఓటర్ల అవగాహన కార్యక్రమానికి అద్దం పడుతుందని అన్నారు.  తన మీద నమ్మకంతో స్వీప్ నోడల్ అధికారిగా భాద్యతలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు, సహకరించిన అధికారులందరికి మరియు జిల్లా ఓటర్లకు అందరికి జిల్లా ఓటరు లందరికి డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ధన్యవాదాలు తెలిపారు. 

   

Comments