రాష్ట్రంలో డెంగ్యూ నివారణకు పటిష్టమైన చర్యలు.



*రాష్ట్రంలో డెంగ్యూ నివారణకు పటిష్టమైన చర్యలు


*

*వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు*


అమరావతి (ప్రజా అమరావతి):

రాష్ట్రంలో గెంగ్యూ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ ఎం.టి.కృష్ణ బాబు అన్నారు.

16.05. 2024 తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి పై పోస్టర్స్ ను స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కృష్ణ బాబు  గురువారం మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ ఏడో ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాలులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ డాక్టర్ శ్రీ వెంకటేశ్వర్ , డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ పద్మావతి , డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రమణ్యేశ్వరి , నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ దుంపల వెంకట రవి కిరణ్ , మరియు ఎన్వీబీడీసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కృష్ణ బాబు  మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ  నెట్వర్క్ ఆసుపత్రులలో అనుమానస్పద డెంగ్యూ జ్వరాల రక్త నమూనాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా వున్న 54 డెంగ్యూ నిర్ధారణ కేంద్రాల్లో పరీక్షించి తగు చికిత్స, నివారణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ళ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్  మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టి లో వుంచుకొని దోమల ద్యారా వచ్చే వ్యాధుల పై ప్రజలకు వివిధ మా ధ్యమాల ద్వారా పూర్తి అవగాహన కల్పించాలన్నారు.


Comments