పిల్లలను బడివైపు మళ్లించే మంత్రం.. వృత్తి విద్యా కోర్సు.*పిల్లలను బడివైపు మళ్లించే మంత్రం.. వృత్తి విద్యా కోర్సు


*

*విద్యార్థుల్లో వృత్తి విద్య పట్ల ఆసక్తి పెంపొందించాలి*

సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు  IAS., 

విజయవాడ (ప్రజా అమరావతి);


విద్యార్థుల్లో వృత్తి విద్యా కోర్సు పట్ల ఆసక్తి పెంపొందించేలా, ఆలోచనాత్మకంగా,  సరళ శైలిలో, ప్రస్తుత కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు  IAS.,  సూచించారు. 

బుధవారం విజయవాడలో పాఠశాల విద్యా శాఖ- సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో జరుగుతున్న 'వృత్తి విద్యా కోర్సు పాఠ్యపుస్తకాల రూపకల్పన' వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,  మాట్లాడుతూ..  ‘పిల్లలను బడివైపు మళ్లించే మంత్రం వృత్తి విద్యా కోర్సు’ అని కొనియాడారు. ఈ కోర్సులు జీవన నైపుణ్యాలు పెంపొందించడమే కాకుండా విద్యార్థులకు శారీరక, మానసిక అభివృద్ధికి కూడా  ఉపయోగపడతాయన్నారు.  పాఠశాలల్లో వృత్తి విద్యను బలోపేతం చేయడానికి ఒకేషనల్ ట్రైనర్స్, ఒకేషనల్ కోఆర్డినేటర్లు అంకిత భావంతో 

పని చేయాలని కోరారు. వృత్తి విద్యాకోర్సుకు సంబంధించిన మెటీరియల్ , టూల్స్, బుక్స్ ఇప్పటికే పంపడమైందని అన్నారు. ప్రతి విద్యార్థితో నెలకు ఒక ప్రాజెక్ట్ తయారు చేయించి తల్లిదండ్రుల కమిటీ సమావేశాల్లో వారి తల్లిదండ్రులకే బహుమతి ఇచ్చేలా తర్పీదునివ్వమన్నారు. వృత్తి విద్యాపట్ల విద్యార్థులకు స్వతంత్రంగా ఆసక్తి కలిగేలా అవగాహన పరచాలన్నారు. 

ఈ సమావేశానికి సమగ్ర శిక్షా ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి , జీసీడీవో ఏడీ  అబ్దుల్ రవూఫ్ సయ్యద్ ,  సూపరింటెండెంట్ ఎస్.శ్రీనివాసులు , ఒకేషనల్ కోర్సు స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీమతి బి.భారతి , కన్సల్టెంట్ శ్రీ రాజశేఖరరెడ్డి , విషయ నిపుణులు, జిల్లాల నుండి ఒకేషనల్ కోఆర్డినేటర్లు, ఎస్సీఈఆర్టీ, ఇంటర్మీడియట్ బోర్డు, సాంకేతిక విద్యా విభాగం ( టెక్నికల్ డిపార్ట్మెంట్), పాలిటెక్నిక్ విభాగాల నుంచి లెక్చరర్లు  తదితరులు పాల్గొన్నారు.

Comments