ఆర్కెవివై,కృషోన్నతి యోజన పధకాల అమలుపై రాష్ట్ర స్థాయి సాంక్షనింగ్ కమిటీ సమావేశం.

 ఆర్కెవివై,కృషోన్నతి యోజన పధకాల అమలుపై రాష్ట్ర స్థాయి సాంక్షనింగ్ కమిటీ సమావేశం


అమరావతి,22 మే (ప్రజా అమరావతి):రాష్ట్రంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషోన్నతి యోజన కింద వ్యవసాయ,అనుబంధ రంకాల్లోని పధకాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేసేందుకు సంబంధించి కన్సాలిడేటెడ్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక-2024-25 అమలుపై రాష్ట్ర స్థాయి సాంక్షనింగ్ కమిటీ సమావేశం బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.రాష్ట్రీయ కృషి వికాసయోజన, కృషోన్నతి యోజన కింద 2024-25లో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 1193 కోట్ల రూపాయల కేంద్ర,రాష్ట్రాల ప్రభుత్వాల భాగస్వామ్యంతో వ్యవసాయ,అనుబంధ రంగాల్లో వివిధ పధకాలు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేస్తున్నారు.ఈవార్షిక కార్యాచరణ పణాళిక కింద చేపట్టనున్నవివిధ పధకాలకు సంబంధించి కేటాయించిన నిధులు మంజూరు తదితర అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి వ్యవసాయ,అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు.ముఖ్యంగా రాష్ట్రీయ కృషి వికాస యోజన వార్షిక కార్యాచరణ కింద సాయిల్ హెల్త్ ఫెర్టిలిటీ,రెయిన్ ఫెడ్ ఏరియా డెవల్మెంట్,సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్,క్రాపు డైవర్షిఫికేషన్ ప్రోగ్రామ్,పెర్ డ్రాప్ మోర్ క్రాప్,ఆగ్రో ఫారెస్ట్రీ,పరంపరాగతి కృషి వికాస్ యోజన పధకాలకు కేటాయించిన నిధులు వాటి ద్వారా చేపట్టిన కార్యక్రమాలను సిఎస్ డా.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.

వ్యవసాయ రంగంలో 134 కోట్ల రూ.ల వ్యయంతో కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లో డ్రోన్లను అందుబాటులోకి తేవడం,రైతు భరోసా కేంద్రాల ద్వారా సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం,జిల్లా స్థాయిలో పెస్టిసైడ్స్ టెస్టింగ్ లేబరేటరీలు ఏర్పాటు,జిల్లా అగ్రి ఇన్పుట్స్ క్వాలిటీ కంట్రోల్ లేబరేటరి ఇన్ప్రాస్ట్రక్చర్,ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ లేబరేటరీల్లో తగిన పరికరాలు అందుబాటులోకి తేవడం వంటి అంశాలపై సిఎస్ సమీక్షించారు.తదుపరి కృషోన్నతి యోజన కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్షించారు.

ముఖ్యంగా రాష్ట్రీయ కృషి వికాస యోజన ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగ పునరుజ్జీవనం కోసం రెమ్యునరేటివ్ అప్రోచ్‌లు రైతుల ప్రయత్నాలను బలోపేతం చేయడం,నష్టాలను తగ్గించడం మరియు వ్యవసాయ వ్యాపార వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయాన్నిలాభదాయకమైన ఆర్థిక కార్యకలాపంగా మార్చడం లక్ష్యంగా ఉంది. అలాగే కృషోన్నతి యోజన కింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్,నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్,మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హర్టికల్చర్,నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్‌ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్స్,నేషనల్ మిషన్ ఫర్ సైస్టెనబుల్ అగ్రికల్చర్,సాయిల్ హెల్త్ కార్డు పథకం,పరంపరాగత్ కృషి వికాస్ యోజన,నేషనల్ స్కీం ఆన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అండ్ టెక్నాలజీ,ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్,ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చర్ సెన్సస్ అండ్ స్టాటిస్టిక్స్,ఇంటిగ్రేటెడ్ స్కీం ఆన్ అగ్రికల్చర్ కో-ఆపరేషన్,ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్,నేషనల్ అగ్రిటెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్,ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఫర్ సెరీల్స్ అండ్ వెజిటబుల్స్ కార్యకలాపాలు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేసేందుకు కృషి జరుగుతోంది.

ఈసమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఆశాఖ కమీషనర్ సిహెచ్.హరికిరణ్,ఉద్యాన వన శాఖ కమీషనర్ శ్రీధర్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖలకు సంబంధించి అమలు చేస్తున్నకార్యక్రమాలను తెలియ జేశారు.

ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర రైతు సాధికార సమితి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ కుమార్,పౌరసరఫరాల శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్,వ్యవసాయ,అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments