ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంగా జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు

  


*పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్*


ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంగా జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు



92% శాతం ఓటింగ్ పెంచాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశం 


పోలింగ్ కేంద్రం వద్ద సదుపాయాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపు 


ఏలూరు (ప్రజా అమరావతి ):  రానున్న ఎన్నికలలో జిల్లాలో ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయని స్వీప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఆదివారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఏలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ 2019 సర్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో 79.77% పోలింగ్ నమోదు కాగా జిల్లాలో 83.75% నమోదు అయ్యిందన్నారు. జిల్లాలో అత్యల్పంగా ఏలూరు నియోజకవర్గంలో ఓటింగ్ శాతం 68.10%గా నమోదయ్యిందని, ఇది రాష్ట్ర అవేరేజ్ కన్నా తక్కువని గుర్తు చేసారు. జిల్లాలో 1744 పోలింగ్ కేంద్రాలు ఉంటే 409 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ శాతం రాష్ట్ర పోలింగ్ శాతం కన్నా  తక్కువ ఓటింగ్ నమోదు అయ్యిందని అన్నారు.  దీనికి ప్రధాన కారణం పట్టణ ప్రాంతాలలో ఉన్న ఎగువ శ్రేణి వర్గం, యువ ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో తక్కువ భాగస్వామ్యం కావడమన్నారు.  ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికలలో 92% ఓటింగ్ శాతం పెంచే విదంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఓటర్స్ టర్న్ అవుట్ ప్రణాళికను ఆమోదించారని దానిలో భాగంగా జిల్లాలో అన్ని ప్రాంతాలలో  ఇప్పటివరకు 2500 స్వీప్ కార్యక్రమాలు చేపట్టామని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.


*పోలింగ్ కేంద్రం వద్ద సదుపాయాలు భేష్*


స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సజావుగా జరగడానికి ఎన్నికల అధికారులు సకల సదుపాయాలు కల్పించారని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఓటర్లతో పాటు, ఇతర జిల్లా ప్రభుత్వ ఓటర్లు కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన సదుపాయాలు పట్ల సంతృప్తి వ్యక్తం చేసారన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాలు కల్పించడం,  హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి ఉద్యోగులకు మైక్ ద్వారా సమాచారం అందించడం, చలవ పందిళ్ళు,  త్రాగునీరు సదుపాయంతో పాటు మజ్జిగ, స్నాక్స్ కూడా  ఓటర్లకు అందించడం అభినందనీయమన్నారు. అనుసంధానకర్తలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఓటరుకు సమాచారం, సహకారం అందించారు.  ఉద్యోగులు అందరు  స్వేచ్చాయుత వాతావరణంలో తమ ఓటుహక్కు వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రంగం అన్ని ఏర్పాట్లు చేసినందున ఉద్యోగులందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవలని అన్నారు.  అలాగే మే 13, పోలింగ్ రోజున ప్రతి ఓటరు తమ ఓటుహక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ముక్కంటి, కమీషనర్ వెంకట్ కృష్ణ, జడ్పీ సీఈఓ సుబ్బారావు తదితరులు ఎన్నికల విధులలో పాల్గొన్నారు

Comments