రాష్ట్రంలో వైసీపీ మూకలు చేస్తున్న దాడులు, అరాచకాలు దౌర్జన్యాలపై రాష్ట్ర గవర్నర్ కు ఎన్డీఏ నేతల ఫిర్యాదు.

 విజయవాడ (ప్రజా అమరావతి);



*రాష్ట్రంలో వైసీపీ మూకలు చేస్తున్న దాడులు, అరాచకాలు దౌర్జన్యాలపై రాష్ట్ర గవర్నర్ కు ఎన్డీఏ నేతల ఫిర్యాదు


*


*ఓడిపోతున్నామని భయంతోనే జగన్ రెడ్డి చేయిస్తున్న దాడులు ఇవి*


*ఇన్ని అరాచకాలు జరుగుతున్న చోద్యం చూస్తున్న పోలీసులు*


ఐదేళ్ల హింస రాజకీయానికి ప్రజలు స్వస్తి చెప్పారు


దాడులు దౌర్జన్యాలను ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, శాంతి పద్ధతులను పునరుద్ధరించాలి


-ఎన్డీఏ నేతలు*



రెండు రోజులుగా రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు దౌర్జన్యాలు అరాచకాలపై గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. ఓడిపోతున్నామని భయంతోనే అధికార వైసిపి ఈ దాడులు చేయిస్తుందని గవర్నర్ కు కూటమి నేతలు తెలియజేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతలను తిరిగి పునరుద్ధరించాలని కూటమి నేతలు గవర్నర్ ను కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ....


*వైసీపీ గూండలు రోడ్లపైకి వస్తే పోలీసులు చోద్యం చూశారు : వర్ల రామయ్య*

"ప్రభుత్వ అరాచకాలనీ ఎదుర్కొని ఒటు హక్కును వినియోగించుకున్నవారందరికి కూటమి తరపున కృతజ్ఞతలు. రాష్ట్రంలో నశించిన శాంతిభద్రతలు, ప్రభుత్వ దౌర్జన్యాలు, మా పై జరిగిన అరాచకత్వాన్ని గవర్నర్ కు వివరించాం. పోలీసులు, పోలీసు అధికారులు  వ్యవహరించిన తీరు గురించి చెప్పాం. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నరసరావుపేట ఇలా అనేక చోట్ల పోలీసులు వైకాపాతో మిలాఖాత్ అయి టీడీపీ నాయకులపై, ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేశారు. వీటన్నిటిపైనా చర్యలు తీసుకోవాలి అని గవర్నర్ ను కోరాము. రాడ్లు, కర్రలు, పెట్రోల్ క్యాన్లతో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆధారాలతో సహా గవర్నర్ కు సమర్పించాం. గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారు. పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకం సినిమాలను తలపించేలా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా గవర్న్ గారికి చూపించాం. వైసీపీకి ఓటు వేయలేదా కొట్టండి అని, వీడు మన పార్టీ కాదు కొట్టండని వైసీపీ మూకలు దాడులు చేశారు. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. వీరి దౌర్జన్యాలు చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా లేక ఇస్లామిక్ దేశంలో ఉన్నామా అని అనుమానం కలుగుతోంది. చంద్రగిరిలో పులివర్తి నాని ని కొట్టి చంపడానికి ప్రయత్నించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహారించాడు. వీటన్నింటిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటివి జరగకుండా చూస్తానని కూడా గవర్నర్ హామీ ఇచ్చారు. గవర్నర్ చాలా సౌమ్యంగా వ్యవహరించారు. ఆయన దృష్టికి ఇలాంటివి అనేకం వచ్చినట్లు చెప్పారు.  అసమర్ధ పోలీసుల పైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పార్టీతో ఎవరు లాలూచీ పడ్డారో, చేతులు కలిపారో ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని గవర్నర్ అన్నారు. ఎవరైతే ఎన్నికల విధులను లోపభూయిష్టంగా వ్యవహరించారో వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన హామీ ఇవ్వడంతో మేము చాలా సంతోషించాం జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇక సాగవు" అని వర్ల హేచ్చరించారు.


 


*ఓటమి భయంతో వైసిపి దాడులు: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి దినకర్*

"పోలింగ్ జరిగే సమయంలో అత్యధిక పోలింగ్ నమోదు అవ్వడం చూసి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి హింసను ప్రేరేపించారు. పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. ప్రజలు ఈ రాక్షస పరిపాలనకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారు. 82% ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషదాయకం. ఇది ప్రజాస్వామ్య విజయం. పోస్ట్ వైలెన్స్ సృష్టించారు. ఓటింగ్ శాతం తగ్గించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కూటమి భారీ విజయం సాధించబోతుందని వైసీపీ నాయకులు ఎప్పుడైతే తెలుసుకున్నారో టీడీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. తిరుపతిలో పులవర్తి నాని మీద దాడి జరిగింది. హతమార్చాలని ప్రయత్నించారు. దర్శి లో హింసను ప్రేరేపించారు. తాడిపత్రిలో పోస్ట్ పోల్ వైలెన్స్ సృష్టించారు. పెద్దారెడ్డి అనేక అరాచకాలు సాగించారు. ఇవన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి సమన్లు వచ్చాయి. గవర్నర్ కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఆర్థిక పరమైన విషయాల్లో అస్తవ్యస్తం జరిగింది. 14,200 కోట్లు పేదలకు దక్కాల్సిన దాన్ని బూచిగా చూపి ఎన్నికల ముందు లబ్ది పొందాలని చూశారు.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 14వ తర్వాత దాన్ని ఇవ్వాలని చెప్పారు. ఓడిపోతున్నమని తెలిశాక వాళ్ళ మిత్రులందరికీ కాంట్రాక్టుకు దోచిపెట్టే ప్రయత్నం చేశారు.  కూటమి విజయం సాధించినట్లయింది. కాంట్రాక్టుల జేబుల్లోకి వెళ్లే నిధుల్ని ప్రజలకు అందేలా చేశాం. గవర్నర్ గారు మా వినతుల్ని నిశితంగా పరిశీలించారు. న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు" అని దినకర్ అన్నారు.


*పోలీసుల హింసను ప్రేరేపించారు: జనసేన నేత చల్లపల్లి శ్రీనివాసరావు*

"రాష్ట్ర ప్రజలందరూ ధర్మాన్ని నిలబెట్టాలి. మంచినీ గెలిపించాలని నినాదంతో కోట్లాదిమంది ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఓట్లు వేయడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని వైసిపి గతి తప్పి, మతి తప్పి ప్రవర్తిస్తోంది. ఎక్కడపడితే అక్కడ అల్లర్లు సృష్టించింది. ఎన్నికలు సజావుగా జరగకుండా చూడడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఫెయిలయ్యారు. రకరకాల హింసలకు ప్రేరేపించారు.  వీటన్నిటిని ఎన్ డి ఏ కూటమి తరపున గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామన్నారు. పేదలకు అందాల్సిన డబ్బు 14వ తేదీన అందించండి అని ఎన్నికల కమిషన్ చెప్పింది. అయితే ఇంతవరకు చర్యలు లేవు. ఆ డబ్బు వెంటనే ప్రజలకు అందేలా చూడాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం" అని కోరారు.



*వైసీపీ అరాచకాలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు*

"పవిత్ర స్థలమైన తిరుపతి, చంద్రగిరిలలో  ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పులవర్తి నాని పై జరిగిన హత్యా ప్రయత్నం, తాడపత్రి లో పెద్దారెడ్డి అరాచకాలు, నరసరావుపేటలో దుర్మార్గాలు, మాచర్లలో మహిళ పైన దాడి, దర్శిలో శ్రీలక్ష్మి కుటుంబ సభ్యుల పైన దాడులు జరిగాయి. వీటన్నింటిని  గవర్నర్ దృష్టికి తెచ్చాం. చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలవడం జరిగింది. దీనిపై స్పష్టంగా అన్ని చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవకుండా చూస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు" అని తెలిపారు.


*నిరాశ నిస్పృహల వల్లే వైసీపీ దాడులు: మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు*

"ప్రభుత్వ అధికారులు పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కూడా శాంతిభద్రతలు లోపించాయి. రాష్ట్రంలో అరాచకం పోవాలి. రాష్ట్ర నలుమూలల  నుంచే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి  ఓటు హక్కు వినియోగించుకున్నారు.  రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పోవాలి. ఐదు గంటలు 6 గంటలు  వేచి ఉండి, అర్థరాత్రి రెండు గంటల వరకు కూడా నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిలబడ్డారుంటే వైసీపీ పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకతే నిదర్శనం. రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఓట్లు వేశారు. ఇది చూసి  తట్టుకోలేక వైసీపీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. ఓటర్లను బెదిరింపులకు పాల్పడ్డారు. పలనాడు జిల్లాలో హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి. దాడులు చేస్తున్నా, పెట్రోల్ పోసి తగలబెడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూతులు వద్ద పోలీసు బందోబస్తు లేదు. పెట్రోలింగ్ లేదు. బూతులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు.  తాడిపత్రి స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులివర్తి నాని పై దాడి జరిగింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జగన్ చేయించారు.  అరాచకాలు సృష్టించారు. వైసిపి నాయకుల్ని మద్యం పోయించి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. వీటన్నింటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. కచ్చితంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారు ఛీఫ్ ఎన్నికల కమిషన్ నుండి డీజీపీ, ఛీఫ్ సెక్టటరి లకు సమన్లు వచ్చాయి. కచ్చితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. టిడిపి, జనసేన, బిజెపి పల్నాడు వెళ్లి బాధితులకు ధైర్యం కల్పిస్తాం. అందుకు గవర్నర్ గారిని అనుమతి కోరాం. 144 సెక్షన్ ఉన్నప్పటికి బాధితులకు నైతిక స్థైర్యాన్ని కల్పించాలి అనుకున్నాం. ప్లానింగ్ వేసుకొన్నాం. భవిష్యత్ కార్యారక్షణ తయారు చేసుకుంటాం. ఇలాంటి సంఘటనలు జరగనివ్వం. గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 


నిరాశ నిస్పృహలతో, సహనం కోల్పోయి వైసీపీ ఇలా చేస్తోంది. రాష్ట్రంలో అవినీతి పరిపాలన రాజ్యమేలింది.  ఇన్నాళ్లు సాగింది దోపిడీ పరపాలన. ఇది అంతం కావాలి.  


*టీడీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి*

రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల్లో పాల్గొని ఓట్లేశారు. లైన్లలో మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నిల్చొని ఓట్లేశారు. అయితే వైసీపీ నాయకులు అరాచకాలు సృష్టించారు, ఎప్పుడు ఇలాంటి అరాచకాలు జరగలేదు. పలనాడు ప్రాంతంలో వైసీపీ అభ్యర్థులు, పార్లమెంటు పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ వారి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికల ముందు నుంచే గ్రామాల్లోకి వెళ్లి భయభ్రాంతానికి గురి చేశారు. వారు ఓట్లు అడిగే పరిస్థితి లేదని గ్రహించి ప్రజల్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. కక్షలు, కార్పన్యాలను ప్రేరేపించారు. పలనాడు ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం.  నిప్పు రాజేశారు. అరాచకాలు సృష్టించారు. ఇప్పటికైనా కక్షలు కార్పణ్యాలను నివారించాలి"  అని డిమాండ్ చేశారు.

Comments