వైసీపీ అసమర్ధ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది.



వైసీపీ అసమర్ధ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది



రాష్ట్రాభివృద్ది, సంక్షేమం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం


రాక్షస పాలనను అంతమెందించేందుకు మూడు పార్టీల పొత్తు


మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీయే కూటమి అభ్యర్దులను గెలిపించండి


- సినీ నటుడు నారా రోహిత్ 

రేపల్లె (ప్రజా అమరావతి);

వైసీపీ 5 ఏళ్ల పాలనలో  రాష్ట్రం అన్ని విధాల నాశనమైందని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. మంగళవారం నాడు బాపట్ల జిల్లా  రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం బలుసుల పాలెం, మెట్ట గౌడ పాలెం,  నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకిలో ఎన్డీయే కూటమికి మద్దతుగా నారా రోహిత్ ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.... జగన్ అసమర్ద పాలనతో ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది. 2019లో మనం తప్పు చేసి ఒక రాక్షసుడిని సీఎంగా ఎన్నుకున్నాం. ఆ రాక్షసుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ మూడు పార్టీలు ముందుకొచ్చాయి. నాడు రావణాసురుడిని చంపడానికి లక్ష్మణుడు, హనుమంతుడు, వానర సైన్యం కలిసినట్లు నేడు వైసీపీ రాక్షష పాలనను అంతం చేయడానికి మూడు పార్టీలు కలిశాయి. మే 13వ తేదిన ఓటు ద్వారా ఆ రాక్షసుడిని అంతమెందిద్దాం.  మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.  పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. సమర్దవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి.  రేపల్లె ప్రజల కష్ట, నష్టాల్లో తోడుండే నాయకుడు అనగాని సత్యప్రసాద్ ని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించండి. 

వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్రంలో అభివృద్ది లేదు, సంక్షేమం లేదు,  అన్ని రంగాలు నాశనమయ్యాయి.  అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టగల ఏకైనా నాయకుడు  చంద్రబాబు నాయుడు.   నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సైబరాబాద్ నిర్మించి లక్షలాదిమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారు.  విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ ను సైతం తన అనుభవం, సమర్ధతో పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి 5.13 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించారు. రాజధాని అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండుకళ్లుగా భావించి నిర్మారం చేపట్టారు,  లోటు బడ్జెట్ లో సైతం అనేక సంక్షేమ పధకాలు అందించారు. రేపు ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి. టీడీపీకి ఓటేసి మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలి. అందరూ మే 13న ఖచ్చితంగా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటేసి ఎన్డీయే కూటమి అభ్యర్దులను  భారీ మెజార్టీతో గెలిపించాలి.  పవన్ కల్యాణ్ సినిమాలోని డైలాగు లా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లు మీ లాస్ట్ పంచ్ బ్యాలెట్ పైన పడాలి. వైసీపీ ఫ్యాను రెక్కలు తెగి కింద పడాలని రోహిత్ అన్నారు.

Comments