డబ్బు మాటలతో వస్తున్న.. కార్పోరేట్స్ను తిప్పి కొట్టండి.

 *మంగళగిరిలో జొన్నా గెలుపు కోసం  మెగా బైక్ ర్యాలీ*


*భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు....ఉలిక్కిపడిన మంగళగిరి*


*మంగళగిరిలో కాంగ్రెస్ యువ నాయకుడు తాయి సుధీర్ ఆధ్వర్యంలో జొన్నకు అపూర్వ స్వాగతం*


*ఎర్రజెండా బిడ్డకు అపూర్వ స్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు*


*మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనున్న వేళ...  ఎర్రజెండాలతో ఎరుపెక్కిన మంగళగిరి గడ్డ*


*డబ్బు మాటలతో వస్తున్న..  కార్పోరేట్స్ను  తిప్పి కొట్టండి


*


*ఇప్పుడే లోకేష్ అపాయింట్మెంట్ దొరకాలంటే యజ్ఞమే.. అటువంటివాడు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటాడా..?*


*కార్పొరేషన్ పేరుతో ఇంటి, చెత్త పన్నుల భారం వేసిన వైసిపిని నమ్మొద్దు*


*-- జొన్న శివశంకరరావు,  ఇండియా కూటమి బలపరిచిన మంగళగిరి సిపిఎం అభ్యర్థి*


మంగళగిరి (ప్రజా అమరావతి);


*సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ,,ప్రజాతంత్ర పక్షాలు బలపరిచిన ఉండవల్లి హ్యాట్రిక్ సర్పంచ్,రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి,  పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్, ఎర్రజెండా ముద్దుబిడ్డ..  కామ్రేడ్ జొన్న శివశంకరరావు గెలుపుని కాంక్షిస్తూ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఉండవల్లి సెంటర్లో బైక్ ర్యాలీ మొదలయింది.*


*ఈ ర్యాలీ ఉండవల్లి సెంటర్ నుండి మొదలుపెట్టి,ఉండవల్లి,  ముగ్గు రోడ్డు,తాడేపల్లి టౌన్,క్రిస్టియన్ పేట, కుంచనపల్లి, వడ్డేశ్వరం,కొలనుకొండ,ఆత్మకూరు,మంగళగిరి,చిన కాకాని గుండా కాజా చేరుకోనుంది.*


*ఎర్రజెండా అభిమానులు, శ్రేయోభిలాషులు,జొన్నా శివశంకర్ గెలుపు కోరి.. బండెనక బండి కట్టి చీమలదండులాగా ముందుకు కదిలారు.*


*మరికొద్ది గంటల్లో.. ఎలక్షన్ క్యాంపెయిన్ ముగియనున్న  తరుణంలో... ఎర్రజెండాలతో మంగళగిరి పురవీధుల్లో తిరుగుతూ కమ్యూనిస్టులు... ఉద్యమాల గడ్డ మంగళగిరిని ఎరుపెక్కిచ్చేశారు...!*


*వాడ వాడల ఎర్రజెండాకు అపూర్వ ఆదరణ లభించిందని ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలను జీవితంలో మర్చిపోలేనని ఇండియా కోటమి మంగళగిరి అభ్యర్థి జొన్న శివశంకర్ తెలిపారు.*


*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లోకేష్ స్థానికుడు కాదని.. 2014 లోని ఆయన నిజస్వరూపం బయటపడిందని... రెండు మంత్రి పదవులు అనుభవించి.. మంగళగిరి కి చేసింది మాత్రం శూన్యమని...  25 వేల మంది పట్టాల కోసం అలమటిస్తుంటే ఒక్క పట్టా కూడా ఇచ్చిన పాపను పోలేదు అంటూ దుయ్యబట్టారు.*


*మెగా కార్పొరేషన్ పేరిట ఇంటి పన్నుల భారం... విపరీతంగా పెంచేసి...  చెత్త పన్ను వేసి ప్రజలను ఇబ్బంది పెట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.*


*చేనేత కార్మికుల సమస్యలు స్వర్ణకారుల సమస్యలు డ్రైనేజీ మంచినీటి సమస్యలు పరిష్కరించాలన్నా... మంగళగిరి అభివృద్ధి పథంలో ముందుకు పోవాలన్నా ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కామ్రేడ్ జొన్న శివశంకరరావు ప్రజలకు పిలుపునిచ్చారు.*


*ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ శ్రేణులతో పాటు జొన్న అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.*

Comments