సర్వ జనుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.

 


*ప్రశాంతమైన గోదావరి జిల్లాలను ఐదేళ్లలో అరాచకాలకు నిలయంగా చేశారు*

*రాష్ట్రం కోసం వచ్చి పనిచేస్తున్న ఎన్.ఆర్.ఐలపై నిందలా?*

*సర్వ జనుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది


*

*కూటమి ప్రజా మేనిఫెస్టో కళకళలాడుతోంది..జగన్ నకిలీరత్నాలు వెలవెలపోయాయి*

*సైకిల్, గ్లాసు, కమలానికి అడ్డొచ్చే ధైర్యం ఎవరికుంది?*

*పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ లను మూసేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి*

*40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని ధ్వసం చేసిన వాడు పేదవాడా?*

*కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ భూమిపై మీ ఫోటోలు వేసి భూమి పత్రాలు ఇస్తాను*

*జగనన్న జలగ రాజ్యంలో దోపిడీయే విధానం.*

*10 శాతం ఎక్సైజ్ షాపులు గీత కార్మికులకు రిజర్వు చేస్తాం*

*నాటకాల రాయుడు జగన్ ను ముస్లింలు నమ్మొద్దు*

*కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తాం*

- కాకినాడ ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకాకినాడ (ప్రజా అమరావతి): రాష్ట్రంలో దొంగలు పడ్డారు. కాకినాడలో ఒక బంధిపోటు దొంగ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. మే13 నే పోలింగ్. ఎక్కువ సమయం లేదు. అబద్దాల కోరు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఏం చేస్తారు? బంగాళాఖాతంలో కలుపుతారా లేదా? కూటమి మూడు పార్టీలు కలిసి సైకోతో పోరాడుతున్నాం. జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి పోరాడుతున్నారు. నన్ను, పవన్ కళ్యాణ్ లను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పాను. మీరు నా మాట వినలేదు. నేడు నా మాటే నిజమైంది. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ ఉంటే..కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో చిన్న సైకో తయారయ్యాడు. కాకినాడ నాకు నచ్చిన నగరం. చిన్నతనం నుంచి ఈ నగరంతో నాకు అనుబంధం ఉంది. కాకినాడ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డా. బ్రిటీషు వారి కాలం నుంచి కాకినాడ ఎంతో ప్రసిద్ది చెందింది. ఇక్కడి పొడవైన రోడ్లు ఎంతో సుందరంగా ఉంటాయి. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ పథకంలో కాకినాడను ఎంపిక చేసి అభివృద్ధి చేశాం. నేడు అటువంటి కాకినాడ గంజాయికి కేంద్రంగా తయారయ్యింది. డ్రగ్స్ కు క్యాపిటల్ గా మారింది. దొంగ బియ్యం రవాణ కేంద్రంగా తయారుచేశారు. చివరకు ఇక్కడికి పేకాట కూడా  తీసుకొచ్చి దానిలో కమీషన్లు దండుకుంటున్నాడు ఈ పెద్దమనిషి. ఈయనే జగన్ బినామి. జగన్ ఆస్తులు ఈయన పేరుతోనే ఉన్నాయి. 


*ప్రశాంతమైన గోదావరిని ఐదేళ్లలో పులివెందులను చేశారు*

బాబాయిని గొడ్డలితో చంపినవాడు పిల్లవాడా? జగన్ రెడ్డి చెబుతున్నట్లు పిల్లవాడైతే పార్లమెంటుకు కాదు..పలకా బలపం ఇచ్చి ఆయనను బడికి పంపాలని చెప్పాను. బాబాయిని చంపిన ఆ పిల్లవాడిని మ్యూజియంలో పెట్టాలి. కాకినాడ ప్రజలకు రోషం ఉంటే..ఈ సిటీని నాశనం చేసిన వాడిని బంగాళఖాతంలో కలుతారా? లేదా? ఈ రాష్ట్రంలో ఒక అహంకారపూరితమైన సైకో ఉన్నాడు. ఇక్క కాకినాడలో పిల్ల సైకో ఉన్నాడు. అక్కడ విధ్వంసమే విధానం. అమరావతిని నాశనం చేశాడు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. ఊరికో సైకోను తయారు చేశాడు పెద్ద సైకో జగన్ రెడ్డి. తూర్పుగోదావరి చాలా ప్రశాంతమైన జిల్లా.. మంచి నీళ్లు అడిగితే..కొబ్బరి నీళ్లు ఇస్తారు. ఐదేళ్లలో ఇలాంటి జిల్లాలో దుర్మార్గులు వచ్చి పులివెందులను చేయాలని చూస్తే వదిలిపెడుదామా? ఈ చిన్న సైకో పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా సరిపోడు..ఎవరితో పెట్టుకుంటున్నాడో ఈ చిన్న సైకో గుర్తుపెట్టుకోవాలి. రౌడీయిజాన్ని అణచివేసిన పార్టీ టిడిపి. డబ్బు మదంతో విర్రవీగే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరకి కళ్లెం వేస్తాం. మాబాధంతా మా గురించి కాదు. మీ గురించే.

*రాష్ట్రం కోసం ఎన్.ఆర్.ఐలు వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు*

ఆంధ్రప్రదేశ్ అంటే..సమర్ధవంతమైన ప్రజలు, మెరికల్లాంటి యువత, సారవంతమైన భూములు, 900 కి.మీ పొడవైన తీరప్రాంతం. ఈరోజు తెలుగువారు ప్రపంచంలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. దానికి నేనే పునాది వేశా. కానీ, ఈ రాష్ట్రంలో 2019లో సైకో వచ్చి సర్వనాశనం చేశాడు. నేడు ఎన్ఆర్ఐలు వచ్చి రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. అనేక మంది స్వచ్చందంగా వచ్చి పనిచేస్తున్నారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ, అవకాశాలు కల్పించండని అడుగుతున్నారు. మీరు బానిసలుగా మిగిలిపోతారా? ఎన్నికల్లో గెలిస్తే.. పవన్ కళ్యాణ్ కు, నాకు అధికారం వస్తుందని మీరు అనుకుంటే అది తప్పు. మన భవిష్యత్తు కోసం మీరు ఓటేయాలి. కూటమి అభ్యర్ధులు గెలిచి తూర్పు గోదావరి చరిత్ర మరలా తిరిగి రాయాలి. 

*సర్వ జనుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది*

మూడు పార్టీలు త్యాగాలు చేశాం. ఏనాడు టిడిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ సీట్లు పొత్తులో ఇవ్వలేదు. జనసేన, బీజేపీలు కూడా తక్కువ సీట్లతో సర్ధుకున్నారు. మేం తగ్గాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. రాష్ట్రం బాగుపడాలని మేం కలిశాం. రూ.13 లక్షల కోట్లు అప్పు ఉంది. అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి. నిన్నటి వరకు పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు పోలీసులు రాష్ట్ర భవిష్యత్తు కోసం మద్దతు తెలుపుతున్నారు. మీ అందరి కోసం సైకో పోవాలి..ఎన్డీఏ రావాలి. సర్వ జనుల సంక్షేమం కోసం పనిచేయాలి. 

*కూటమి ప్రజా మేనిఫెస్టో కళకళలాడుతోంది..జగన్ నకిలీరత్నాలు వెలవెలపోయాయి*

మాది ప్రజా మేనిఫెస్టో..జగన్ ది నకిలీ నవరత్నాలు..వెలవెల పోయాయి.  ప్రజా మేనిఫెస్టో కళకళలాడుతుంది. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం. ఆడబిడ్డలకు మహాశక్తి కింద నెలకు రూ.1500, ఏడాది రూ.18,000 ఇస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. తల్లికి వందనం తో బిడ్డలందరినీ చదివిస్తాం. ఆంక్షలు లేవు. ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తాం. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000 ఇస్తాం. నేనే మహిళలకు వంటగ్యాస్ ఇచ్చాను. డ్వాక్రా సంఘాలు పెట్టాను. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు నేను ఇచ్చాను. దీంతో రివర్స్ నేడు కట్నం వచ్చింది. ఏడాది మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్లాలన్నా ధైర్యంగా వెళ్లండి. నేను, పవన్ కళ్యాణ్ లే మీ డ్రైవర్లు.

*సైకిల్, గ్లాసు, కమలానికి అడ్డొచ్చే ధైర్యం ఎవరికుంది?*

యువతకు జాబు కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం. ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలతో ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. స్కిల్ డెవపల్ మెంట్ సెంటర్లు పెట్టి ప్రంపంచ కంపెనీల్లో పనిచేసుకునేలా వర్క్ స్టేషన్లు తీసుకొస్తాం. అవసరమైతే కాకినాడలోనే ఐటీ టవర్ కడుతాం. నచ్చిన కంపెనీలో పనిచేసుకోవచ్చు. టెక్నాలజీని నేను ప్రమోట్ చేశా. సెల్ ఫోన్లు టెక్నాలజీని మనమే ప్రోత్సహించాం. నేడు మీ చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లు దాని ఫలితమే. రాబోయే ఎనిమిది రోజులు సైకిల్ ఎక్కండి. చేతిలో  గ్లాసు, కమలం పట్టుకోండి. ఎవడైన అడ్డువస్తే..గ్లాసుకు పదును పెట్టండి. అడ్డువచ్చే ధైర్యం ఎవరికీ లేదు. మీరు వేసే ఓటు జగన్ రెడ్డి గుండెల్లో దిగాలి. 

*పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ లను మూసేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి*

రైతులను రాజులు చేస్తాం. తూర్పుగోదావరి గోదావరి జలాలతో కళకళలాడే జిల్లా..అలాంటి జిల్లాలో పంట హాలిడేలు ప్రకటించే పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి. అది చేసే భాధ్యత నాది. ఇంటింటికి త్రాగునీరు ఇస్తాం.  ప్రతీ ఒక్కరిటీ ఇళ్లు కట్టించే బాధ్యత మాది. జాగ లేనివారికి జాగా ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ లను మూసేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. వృద్ధులు ఫించన్‌ డబ్బులతో అన్న క్యాంటీన్ లో తింటే నెలకు రూ. 450 అవుతుంది. మిగిలినది రూ.1500 వందలు. దీంతో నెలంతా బ్రతికుతారనుకున్నా. అటువంటి అన్నక్యాంటీన్లను సైకో రద్దు చేశాడు. జగన్ రెడ్డి చెబుతున్నట్లు ఇది క్లాస్ వార్ కాదు. ఇది క్యాష్ వార్. ఒకప్పుడు క్వాటర్ బాటిల్ రూ.60 నేడు రూ.200. మద్యంబాబుల బలహీనతను క్యాష్ చేసుకుని దోచుకున్నాడు. మన రాష్ట్రంలో దొరికే బ్రాండ్లు మరెక్కడ దొరకవు. జేబ్రాండ్లతో 35 వేల మంది ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచిన దుర్మార్గుడు జగన్. 

*40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని ధ్వసం చేసిన వాడు పేదవాడా?*

ప్రక్కనే గోదావరి ఉన్నా ఇసుక దొరికే పరిస్థితి లేదు. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1000. ఇప్పుడు రూ.5000. జగన్ రెడ్డి నిర్వాకంతో 40 లక్షల మంది భవననిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులుండే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి వాడు పేదవాడా? ఇంటి జాగా ఇచ్చి అందులో కమీషన్లు కొట్టేసిన దుర్మార్గులు వైసీపీ నేతలు..వీరు పేదవారా? ఎక్కడ చూసినా దోపిడీ. కరెంటు ఛార్జీలు 10 సార్లు పెంచాడు. 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇప్పుడు వెయ్యి రూపాయలు. ఇలాంటి వాడికి పేదల పట్ల కనికరం ఉంటుందా?. పేట్రోలు, డీజీల్ ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు, పప్పు, ఉప్పు, చింతపండు అన్ని ధరలు పెరిగాయి. చివరకు చెత్తపైన పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. ఏం చెప్పినా వినాలనేది సైకో మనస్థత్వం. దొంగను పట్టుకుని బోనులో నిలబెట్టడానికి నేను, పవన్ కళ్యాణ్ లు సిద్దంగా ఉన్నాం.

*కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ భూమిపై మీ ఫోటోలు వేసి భూమి పత్రాలు ఇస్తాను*

తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు. వారసత్వంగా వచ్చిన భూమిపై మీ ఫోటో గానీ, మీ తాత ఫోటో ఉండాలి. జగన్ ఫోటో ఎందుకు? జగన్ అన్న భూహక్కు పత్రం అంట. మీ భూమి ఈయన బాబు ఇచ్చాడా? భూమి పత్రాలపై తన ఫోటో వేసుకుని సైకో ఆనందపడుతున్నాడు. మేం వచ్చిన తర్వాత మీ ఫోటోతో భూమి ఫాస్ పుస్తకాలు ఇచ్చే భాధ్యత నాది. జగన్ రెడ్డి పాస్ పుస్లకాలను చింపి ముక్కలు చేద్దాం. నా భూమిపై మీ పెత్తనం ఏంటని సైకో పార్టీవారు వచ్చి ఓటు అడిగితే నిలదీయండి. జగన్ రెడ్డి తెచ్చిన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కాదు. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు. రేపటి నుంచి మీ భూమి హక్కు పత్రాలను ఒరిజినల్స్ వారి దగ్గర పెట్టుకుని మీకు జిరాక్స్ కాఫీలు ఇస్తారట. శాశ్వత రికార్డులు ఉంటేనే భూములు కొట్టేసిన వ్యాక్తి జగన్ రెడ్డి. అలాంటిది రికార్డే లేకపోతే..మీ పరిస్థితి ఏమిటీ? దొంగ దగ్గర తాళాలు పెట్టుకుంటే ఏమవుతుందో ఆలోచించండి. మీ భూములు అమ్ముకోవాలన్న జగన్ రెడ్డి పర్మిషన్ కావాలి. జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు పోవాలంటే రాబోయే ఎన్నకల్లో ప్యాన్ కు ఉరెయ్యాలి. ఫ్యాన్ ను చిత్తుచిత్తుగా ఓడించాలి. ఫ్యాన్ ను చెత్తబుట్టలో పడేయండి. భూహక్కు రక్షణ తెచ్చానని చెబుతున్నాడు. మన భూమికి ఈయన ఇచ్చే హక్కు ఏంటి? ఇప్పుడు లేదా మీకు హక్కు? దారుణమైన చట్టాన్ని తీసుకొచ్చి కథలు చెబితే ఊరుకోవద్దు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం పైనే చేస్తా. మీ ఆస్తిపై కన్నుపడిన ఫ్యాన్ ను భూస్థాపితం చేయాలి. కేవలం విశాఖపట్నంలో 40 వేల కోట్ల ఆస్తులు కొట్టేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. 

*జగనన్న జలగ రాజ్యంలో దోపిడీయే విధానం.*

కాకినాడ పోర్టు ఇతరులు చేతుల్లోకి పోయిందా లేదా?. కాకినాడ పోర్టును మెడమీద కత్తిపెట్టి కూటినీళ్లకు ఈ సైకో రాయించుకున్నాడు. 40 ఏళ్లు కష్టపడి ఆ పోర్టును అభివృద్ధి చేశాం. ప్రక్కనే సెజ్ లో 4 వేల ఎకరాలు ఉంది. రెండో పోర్టు రావాలని వాటిని నేనే సేకరించాను. అవి కూడా నేడు చేతులు మారాయి. జగనన్న జలగ రాజ్యంలో దోపిడీయే విధానం. కొండబాబు ప్రశ్నించాడని ఆయన ఇంటిపై దాడి చేశారు. జగన్ రెడ్డికి కోరలు పీకాలి. విశాఖ, కృష్ణపట్నం పోర్టులు వేరే వారి చేతుల్లోకి వెళ్లిపోయాయి. అమర్ రాజా, లులూ లాంటి పరిశ్రమలు రాష్ట్రం విడిచి పోయాయి. విశాఖలో రామానాయుడు స్టూడియో కట్టడానికి భూమి ఇస్తే దాన్ని కూడా దుర్మార్గులు రాయించేసుకున్నారు. ప్రజల ఆస్థుల పైకి వచ్చిన వారిని వదిలిపెట్టకూడదు. 


కాపులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. రూ.3200 కోట్లు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. సైకో జగన్ రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి రూ.10 కోట్లు ఖర్చు చేయలేదు. రాబోయే ఐదేళ్లలో కాపుల కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇస్తున్నా. జయహో బీసీ ..బీసీలకు ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. 50 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ ఫింఛన్ ఇస్తాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్ధిక సహాయం చేస్తాం. వలలు, బోట్లు, ఆధునికీకరణ కోసం ఆర్ధిక సహాయం చేస్తాం. 217 జీవోను రద్దు చేసి మరలా చెరువులను మత్స్యకారులకు ఇస్తాం. 

*10 శాతం ఎక్సైజ్ షాపులు గీత కార్మికులకు రిజర్వు చేస్తాం*

ఈరోజు బీసీల్లో వడ్డెర కులస్థులున్నారు. కాంట్రాక్టర్లల్లో వారికి రిజర్వేషన్లు పెడతాను. గీత కార్మికులు చేసే పని ఎక్సైజ్ పని. 10 శాతం ఎక్సైజ్ షాపులు గీత కార్మికులకు రిజిస్ట్రేషన్ చేస్తా. వాళ్ల వృత్తి మద్యం షాపులను రన్ చేయడం. అందుకే 10 శాతం వారి కోసం పెడతాను. వారికి ఆదాయం పెంచుతాను. చేనేత కార్మికులకు 200 యూనిట్ లు మర మగ్గాలకి, పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తా. సంవత్సరానికి రూ.24  వేలు ఆర్థిక సహాయం చేస్తాను. 

*నాటకాల రాయుడు జగన్ ను ముస్లింలు నమ్మొద్దు*

ముస్లింలకు న్యాయం చేశాం. దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య నిధులు రావడంలేదు. ఇమామ్, మౌజన్ లకు ఈ ముఖ్యమంత్రి రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు. ముస్లింలకు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు. అందుకే మళ్లీ ప్రత్యేక శ్రధ్ద పెట్టాను. మేం కూటమిలో ఉన్నా ఉద్యోగాల్లో, కాలేజీల్లో నాలుగు శాతం రిజర్వేషన్ ను కాపాడుతానని  మీకు హామీ ఇస్తున్నాను. 2014-19లో నేనే అడ్వకేట్లను పెట్టి 4 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీం కోర్టులో పోరాడాను. మళ్లీ పోరాడుతాం. మీ రిజర్వేషన్ లు కాపాడే బాధ్యత మాది అని ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నాను. నా హయాంలో మసీదులు కట్టించాను.  జగన్ ఒక్క మసీదు కూడా కట్టలేదు. కట్టలేడు. ఓట్ల కోసం జగన్ దొంగ డ్రామాలాడుతున్నాడు. జగన్ నాటకాల రాయుడు. అతన్ని మీరు నమ్మొద్దు. హజ్ యాత్రకు పోయేవారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి నేను ముందుకొచ్చాను. విదేశీ విద్య పెడతాను. మౌజన్, ఇమాం లకు నెలవారీగా పదివేలు, ఐదు వేలు రెమ్మునరేషన్ ఇస్తా. ముస్లింలను అన్ని విధాల ఆదుకునే బాధ్యత నాది. మా మేనిఫెస్టో ఎంతవరకు బాగుందో మీరు ఒకసారి చూసుకోండి. 

*కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తాం*

హిందూ దేవాలయాలు, సత్రాల పరిరక్షణ కోసం  హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం.   50 వేల కంటే ఆదాయం ఎక్కువ వచ్చే ఆలయాల్లో అర్చకులకు కనీసం 15 వేలు ఇప్పించే బాధ్యత మాది. 50 వేల కంటే తక్కువ వస్తే ఆలయాల్లోని అర్చకులకు ధూప దీప నైవేద్యం కింద 5 వేల నుంచి 10 వేలు ఇస్తాం. వైసీపీ హయాంలో దాడులకు గురైన ప్రతీ దేవాలయ నిర్మాణాలను పునర్నిర్మిస్తా. చివరకు రాముడి తలను కూడా తీసేశారు. అలాంటివారిని తప్పక శిక్షిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు. ఇది మీకు న్యాయమా? వారిని శిక్షించాలా? లేదా? తప్పక శిక్షించాలి. పురోహితుల్ని, వంట బ్రాహ్మణులను కులవృత్తిగా గుర్తిస్తాం.  బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ ని నిర్మిస్తాం. తిరుపతితో సహా అన్ని టెంపుల్స్ లలో బ్రాహ్మణులను కమిటి సభ్యులుగా వేసే బాధ్యత నాది. దేవాలయాలను కాపాడే బ్రాహ్మణులకు తగిన గుర్తింపు ఇవ్వాలి. అందుకే అన్ని ట్రస్టు బోర్డులు పెడతాం. బ్రాహ్మణులు నియోజకవర్గానికి ఒక భవనం కావాలన్నారు. అది కూడా  ఇస్తాం. వేద విద్య అభ్యసించేవారికి ఉద్యోగం వచ్చే వరకు యువగళం కింద మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసే బాధ్యత మాది.  అర్చకుల్ని గుళ్లల్లో కొడుతున్నారు. ఇమాం లను మసీదుల్లో కొడుతున్నారు. నేనొస్తానే ఇలాంటి వారిని కోర్టులో నిలబెడుతా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. 

2 వేల పెన్షన్ చేసింది ఎవరు? 2 వేల నుంచి 3 వేలు చేస్తానని చేశాడా? అబద్దాల కోరు. ఇప్పుడున్న రూ.3 వేల పింఛన్ రూ.4 వేలు ఇస్తాం. పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచే ఇచ్చి జూలై లో రూ.7 వేలు పించన్ ఇస్తాం. దివ్యాంగులకు రూ.4 వేలను రూ.6 వేలు ఇస్తాం. జూలై వారికి రూ. 12 వేలు ఇస్తాం. కాళ్లు, చేతులు లేనివారికి రూ.15 వేలు ఇస్తాం. జగన్ పెంచే రూ.250 పింఛన్ కోసం 2028 వరకు వెయిట్ చేయమంటున్నాడు. నెల మొదటి తారీఖునే ఇంటి వద్దకే తెచ్చిస్తాం. శవరాజకీయాలు చేసే సైకో జగన్ రెడ్డి. వాలంటీర్లను వద్దన్నామని 33 మంది వృద్ధులను పొట్టనపెట్టుకున్నాడు. ఈ నెల 1.50 వేల మంది గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. వీరు 40 ఫించన్ లు ఇస్తే...సరిపోయేది..కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని తలా తోక లేకుండా మాట్లాడుతున్నాడు. ఈనెల 7 మంది చనిపోయారు. దీనికంతటికి కారణం సైకో కాదా? శవరాజకీయాల కోసం పేదలను బలి తీసుకుంటావా? కోడికత్తి, గులకరాయి, గొడ్డలి, శవరాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు ఇంటికి పోవడమే తరువాయి. చంద్రన్న భీమాతో రూ.10 లక్షలు ఇస్తాం. లైసెన్స్ ఉన్న ప్రతీ ఆటో డ్రైవర్‌కి రూ.15000 ఇస్తాం. విద్యుత్ ఛార్జీలు పెంచం. తగ్గించే మార్గం చూస్తాం. చెత్తపన్ను రద్దు చేస్తాం. జేబ్రాండ్లను రద్దు చేస్తాం. అన్న క్యాంటీన్లు పెడుతాం. గంజాయి, డ్రగ్స్ లను ఉక్కుపాదంతో తొక్కేస్తాం. ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం.

ప్రభుత్వ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తాం. ఐఆర్ కూడా ఇస్తాం. ఉద్యోగులను జగన్ రెడ్డి బెదిరించాడు. నేను పవన్ కళ్యాణ్ లు మీ కోసం ఈ సైకోతో పోరాడుతూనే ఉంటాం. ఉద్యోగులు ఆలోచించి ఓటేయండి. రాష్ట్రం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాం.

మేం కాకినాడను స్మార్ట్ సిటీగా చేస్తే...జగన్ రెడ్డి డ్రగ్ సిటీగా మార్చాడు. మరలా కాకినాడను ప్రశాంత నగరంగా మార్చుతాం. ఫెన్షనర్స్ ప్యారడైజ్..కాకినాడ. అలాంటి నగరాన్ని భూ కబ్జాలకు, పేకాట క్లబ్బులకు, అరాచకాలకు, రౌడీయిజానికి, గూండాయిజానికి, క్రికెట్ బెట్టింగులకు నిలయంగా చేశాడు. ప్యాకాట ఆడించేవాడు మీకు కావాలా? రూ.15 వేల కోట్లు విలువ చేసే బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా తరలించారు. వీరిని భూస్థాపితం చేద్దామా వద్దా? ఇదొక పెద్ద కుంభకోణం. రేపు అనేది ఉందని ఈ సైకోలకు భయం లేకుండా పోయింది. ఇది చాలా దుర్మార్గం. తిరుపతి, విశాఖపట్నం, ఇక్కడ... ఎక్కడ చూసినా ఇష్టానుసారం చేశారు. జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంక్ 26 వేల మంది ఖాతాదారులు రోడ్డున పడ్డారు. వీరిలో కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికొచ్చారు. నేనున్నప్పుడు ఇలా ఎవరైనా చేసి బయట తిరిగేవారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. భయముండేది కదా? దోషులు వీరే, దొంగలు వీరే. యాక్షన్ తీసుకోకుండా వదిలేసే పరిస్థితికొచ్చారు. డబల్ బెడ్ రూం, టిడ్కో హౌస్ లు మొత్తం కట్టిస్తాను. మత్స్యకారుల డబ్బులు కూడా జగన్ దోచేశాడు. అది కూడా కక్కిస్తా. క్రైస్తవ మిషన్ ఆస్తుల్ని కొట్టేసే ప్రయత్నం జగన్ చేశాడు. దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతాం. రెవెన్యూ శాఖ హెచ్చరిక బోర్డులు పెట్టినా ఖాతరు చేయకుండా వంద కోట్ల విలువైన భూములు భూదాన యజ్ఞ బోర్డుల్ని ఖబ్జా చేసే ప్రయత్నంచేస్తున్నాడు. ఇది మీ నోటీసులో ఉంటుంది. కోవిడ్ సమయంలో ఆసుపత్రుల నుంచి పెద్ద ఎత్తున వాటాలు వసూలు చేశాడు. క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకునే మంచాల్ని, పరుపులు, ఇతర సామాగ్రిని కూడా పాదయాత్ర కోసం వాడుకున్నారు. ఈయన అవినీతి సామ్రాజ్యం జిల్లా మొత్తం వ్యాపించి ఉంది. పెద్దాపురం గుట్టల్ని మింగేశారు. ఈ అనకొండల్ని ఏం చేయాలి? జగ్గంపేట, అనపర్తి, తదితర ప్రాంతాల్లో ఇష్టానుసారంగా గ్రావెల్ ను దోపిడీ చేశారు. పెద్దాపురం, గండేపల్లి మండలాల పరిధిలో రామేశ్వరం మెట్టలో వందల ఎకరాల్లో గ్రావెల్ తరలించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కాకినాడ బెర్త్ నిర్మాణంలో కూడా కమీషన్లు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కాకినాడను దోమలు లేని సిటీగా చేస్తే..ఇప్పుడు వీరే దోమలను తయారు చేసి మీ ఇళ్లకు పంపుతున్నారు.

ప్రజాగళంతో నేను చేయాల్సింది నేను చేశాను. ఇకపై చేయాల్సింది మీరే. జగన్ రెడ్డి పేదల మనిషని ఫోజులు కొడుతున్నాడు. పేదల పక్షాన నేను ఉంటాను. ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తా. జగన్ రెడ్డికి తెలిసింది దోచుకోవడం...దాచుకోవడమే. ఎదిరించిన వారిని జగన్ రెడ్డి గొడ్డలితో బెదిరిస్తున్నాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో 160 పైగా సీట్లు మనమే గెలవాలి. 25 కు 25 పార్లమెంట్లు గెలవాలి. ఆశీర్వదించండి. చేపలు పంచడమే కాదు..ఆ చేపలను పట్టుకునే మార్గాన్ని చూపుతా. 

ఒక దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి పేదల మనిషా? సిఎం జగన్ రెడ్డి దళితుడిని చంపిన వాడిని కారులో ఎక్కించుకుని తిరిగాడు. దళిత డాక్టర్ కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు వేదించి చంపిన దుర్మార్గుడు జగన్. నేను అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేస్తే...ఈ సైకో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఈ సైకో కారణంగా సొంత కుటుంబ సభ్యులకే రక్షణ లేదు. వైసీపీ వారు ఇచ్చిన డబ్బులు తీసుకుని మొహమాట పడితే..మీ పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. 

తూర్పుగోదావరిలో అన్ని సీట్లు మనమే గెలుస్తాం. జగన్ రెడ్డి బెంజ్ కారు ఇచ్చిన ప్రజలు ఓట్లు వేయరు. కూటమి మ్యానిఫెస్టోను బాగా సమీక్ష చేసుకుని నిర్ణయం తీసుకుని ఓటు వేయండి. ఎండ వేడిమి ఉంది కదాని ఓటు వేయకపోతే...కొంపలు కూలిపోతాయి. ఆస్తులు, ఆడబిడ్డలు చెరబట్టబడుతారు. జగన్ రెడ్డికి డబ్బులతో అహం పట్టింది. మాదిగలకు జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తాం. కాకినాడ పార్లమెంట్ కు పోటీ చేస్తున్న శ్రీనివాస్‌ను గెలిపించండి. గ్లాసు గుర్తుకు ఓటేయండి. గ్లాసు గుర్తు కేటాయింపులో కూడా రాజకీయాలు చేస్తున్నారు. అయినా పోరుడుతాం. మీకందరికీ బాగా పరిచయం ఉండే వ్యక్తి, మత్స్యాకారుల ప్రజాప్రతినిధి కొండబాబును మంచి మెజారిటీతో గెలిపించడం. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీని గెలిపించండి.

Comments