అధికారంలోకి రాగానే మైనార్టీ పథకాలు మళ్లీ కొనసాగుతాయి.

 *ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని జగన్ సంక్షోభంలోకి నెట్టివేశారు*

 

*జగన్‌రెడ్డి కనుసన్నల్లోనే ముస్లింలపై అనేక దాడులు..హత్యలు*


*మైనార్టీలకు చెందిన రూ.6వేల కోట్లు దారి మళ్లించారు*


*జగన్‌ మాటలు నమ్మి మరో సారి ముస్లింలు మోసపోవద్దు*


*అధికారంలోకి రాగానే మైనార్టీ పథకాలు మళ్లీ కొనసాగుతాయి* --- రాష్ట్ర ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ రఫీ


మంగళగిరి టౌన్, మే 11(ప్రజా అమరావతి): సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని ఏపీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ రఫీ పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే13న తేదీన జరిగే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటి చేస్తున్న నారా లోకేష్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌కు ముస్లిం సోదరులు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీలకు చాల అన్యాయం జరిగిందని చెప్పారు. ముస్లిం పేద ప్రజలకు ఒక్క పథకం ద్వారా కూడా లబ్ది జరగలేదన్నారు. ముస్లీంలను అన్ని రకాలుగా మోసం చేసిన ఘనత జగన్‌‌కే దక్కుతుందని చెప్పారు. ఇలాంటి జగన్‌‌కు ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీతో కలిసి వెళ్లడాన్ని ప్రశ్నిస్తున్న జగన్‌రెడ్డి ఐదేళ్ళలో ముస్లింలకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని తొలిసారిగా ప్రతిపాదించిందే చంద్రబాబునాయుడు అనే విషయాన్ని గుర్తుచేశారు. సీఏఏ బిల్లుకు వైసీపీ పార్లమెంట్‌లో మద్దతు తెలపడమే కాకుండా రాష్ట్రంలో నోటిఫికేషన్‌ సైతం తెచ్చిందన్నారు. టీడీపీ హయాంలోనే ముస్లింలకు ఎక్కువగా మేలు జరిగిందన్నారు. రంజానతోఫా, ఇమామ్‌, మౌజన్లలకు గౌరవ వేతనం, మసీదుల మరమ్మతులకు నిధులు, పెళ్లికానుక, విదేశీ విద్య, షాదీఖానాల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు టీడీపీ పాలనలోనే జరిగాయన్నారు. కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీ, కడపలో హజ్‌హౌస్‌ నిర్మించారన్నారు. జగన్ మైనార్టీలకు చెందిన రూ.6వేల కోట్లు దారి మళ్లించినట్లు తెలిపారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కర్నూల్‌లో అబ్దుల్‌ సలామ్‌ కుటుంబంతో కలిసి ఆత్మహత్మ చేసుకున్నారని, వైసీపీ నేతల వేధింపులతో విస్బా ఆత్మహత్య చేసుకుందన్నారు. దాచేపల్లిలో ముస్లిం యువకుడు అలీషా మద్యం అమ్ముతున్నాడని నింద వేసి కొట్టి చంపేశారు. కడపలో అక్బర్‌ బాషాకు చెందిన భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్యకు యత్నించాడు. ముస్లిం యువకులపై పుంగనూరులో కేసులు పెట్టి 12మందిని జైలుకు పంపారు. మసీదును కబ్జా చేస్తున్నారని పోరాడినందుకు నరసరావుపేటలో ఇబ్రహీంను నరికి చంపారని అన్నారు. ఇలాంటి వందలాది ఘటనలు జరిగితే జగన్‌రెడ్డి ఏనాడైనా స్పందించారా? అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే మైనార్టీ పథకాలు మళ్లీ కొనసాగుతాయని పేర్కొన్నారు. హౌజ్‌‌కు వెళ్లే ముస్లింలకు 1లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తామని చంద్రబాబు హమీ ఇచ్చినట్లు చెప్పారు. ముస్లిం సోదరులందరికి ఉపాధి కోసం రూ 5 లక్షల నుండి రూ 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగుతుందని తెలిపారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ముస్లిం మహిళలకు ఫించన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. ముస్లిం ప్రజల కోసం పాటు పడే చంద్రబాబుకు కోసం కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 


ఈ కార్యక్రమంలో ఏపీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ మిర్సా బాబు, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖాదర్, షేక్ హాజీ, మహబూబ్, షేక్ రజాక్, ఇస్మాయిల్, షేక్ ముస్తాఫా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Comments