వైసీపీ పాలనలో బాధితులే నిందితులు*

 Press release


*మే 13 న సైకో పాలనకు ప్రజలు ముగింపు పలకాలి* 


*5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైంది* 


 *డబ్బు వ్యామోహంతో జగన్ చేసే అరాచకాలు చూస్తే అసహ్యమేస్తోంది* 


*వైసీపీ పాలనలో బాధితులే నిందితులు* 


*కరువు జిల్లా అనంతపురాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా* 


 *టీడీపీకి బీసీలే వెన్నుముక* 


 *మేం వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం* 


 *25 ఎంపీ సీట్లు 160 ఎమ్మెల్యే సీట్లు కూటమివే* 


 అనంతపురం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*



అనంతపురం (ప్రజా అమరావతి )


: అనంతపురం ప్రజాగళం సభ అదిరిపోయింది. టీడీపీ సభలకు వస్తున్న ప్రజాస్పందన చూస్తే రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం. టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‍ను ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలి. మే 13వ తేదీన హింసా రాజకీయాలు, బాదుడే-బాదుడు, అరాచకాలకు ముగింపు పలకాలి. మే 13న వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి, ఐదేళ్లుగా మనం పడుతున్న క్షోభకి అంతం పలకాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాతి యుగానికి ముగింపు పలికి స్వర్ణయుగానికి స్వాగతం పలకాలి. అనంతపురంలో తెలుగుతమ్ముళ్ల కసి, జనసైనికుల ఆవేశం, బీజేపీ కార్యకర్తల అభిమానం చూస్తుంటే కూటమికి ఏమాత్రం డోకా లేదు. కేంద్రంలో 400 ఎంపీ సీట్లతో నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి అవ్వబోతున్నారు. ఏపీలో 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు గెలుస్తున్నాం. 160 ఎమ్మెల్యేలతో మనం అసెంబ్లీకి వెళ్తున్నాం. ప్రజానీకానికి ఏమీ చేశావో చెప్పగలవా సైకో జగన్? ఏమీ చేస్తావో చెప్పే ధైర్యం ఉందా? 13న జరిగే ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు అవినీతి సొమ్ము పంచేందుకు జగన్ సిద్ధమయ్యారు. 


జే బ్యాండ్ మద్యంతో జగన్ ప్రజలను దోపిడీచేస్తున్నాడు. టీడీపీ హయాంలో రూ.60 ఉన్న క్వార్టర్ మద్యం ధర ప్రస్తుతం రూ.200లకు విక్రయించి జే-ట్యాక్స్ ద్వారా సైకో జగన్ తాడేపల్లి ఇంటికి పంపి దోచుకుంటున్నారు. కల్తీ మద్యం, నాసిరకం బ్రాందీ కారణంగా ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడుతున్నారు. ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? డబ్బుల కోసం జగన్ చేసే దుర్మార్గాలు చూస్తూంటే భాదేస్తోంది. వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ లేకపోవడానికి చిదంబర రహస్యమేంటి? వైసీపీ మద్యం మాకు వద్దనే ప్రజలే తిరుగుబాటుచేసే పరిస్థితికి వచ్చారు. 

 *బాదుడే బాదుడు* 

ఇసుక ధరలు పెంచి వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఒక్కప్పుడు రూ.1000 ఉన్న ఇసుక ధరను రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెంచి డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు సైకో జగన్. ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి పేదల రక్తం తాగుతున్నాడు. రూ.200 ఉన్న కరెంట్ ఛార్జీలను రూ.1000కి పెంచి ప్రజలపై భారం మోపాడు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అధిక ధరలకు విక్రయిస్తూ అరాచకంగా దోపిడీ చేస్తున్నారు. దోపిడీని ప్రశ్నిస్తే కేసులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి కుటుంబాలపై పెను భారం మోపాడు. సంక్షేమం పేరుతో రూ.10 ఇస్తూ.. రూ.100 దోపిడీ చేస్తూ, జగన్ రూ.1000 దోచుకుంటున్నాడు. భూగర్భ ఖనిజ సంపదను సైతం దోపిడీ చేస్తున్నారు. 


మీ ఆస్తులపై సైతం జగన్ రెడ్డి కన్నేశారు. మీ భూమి పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ రెడ్డి ఫోటో వేసుకుని మీ భూములపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. మీకు తరతరాల నుంచి వచ్చిన ఆస్తిపై మీ ఫోటో ఉండాలి కాని.. సైకో చెత్త ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫోటో ఎందుకు? ఇది న్యాయమా? దీనిపై ప్రజల్లో తిరుగుబాటు రావాలి. మీ ఇంటికి ప్రచారానికి వస్తున్న వైసీపీ నాయకులను దీనిపై నిలదీయాలి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఫోటో తీసేసి మీ ఫోటోనే పెడతా. జగనన్న భూరక్ష పథకం పేరుతో ఉన్న పాసుపుస్తకాన్ని చించి చెత్తబుట్టలో వేద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం అమలులోకి వస్తే మీకు భూమిపై ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. మీ భూమి జగన్ రెడ్డి చేతుల్లో ఉంటుంది. వారసత్వంగా మీకు వచ్చిన భూమిని జగన్ రెడ్డి బినామీ పేరుతో అమెరికాలో కంపెనీ పెట్టి రికార్డ్ అన్ని అందులో ఉంచేందుకు సిద్ధమయ్యారు. మీ భూమి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా చేస్తున్నారు. భూమిపై పన్నును రద్దు చేసిన మహానాయకుడు నందమూరి తారకరామారావు. మీ మెడకు ఉరితాళ్లు వంటి లైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలంటే మే13న వైసీపీకి ఉరి వేయాలి. ప్రజా వ్యతిరేకమైన నల్లచట్టాన్ని ఆమోదించే పరిస్థితే లేదు. 


ధర్మవరం మీటింగ్‍లో కేంద్ర హోంమంత్రి అమిత్‍ షా రాష్ట్రంలో గూండాగిరి, అవినీతి, భూ-కబ్జాలు పోవాలని.. అమరావతినే రాజధానిగా చేసేందుకే ఈ కూటమి ఏర్పడిందని స్పష్టంగా చెప్పారు. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి కూటమి పనిచేస్తుంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడేందుకే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు. హంద్రీనీవా నిర్మాణం నందమూరి తారక రామారావు ఆలోచన. కృష్ణా జలాలను రాయలసీమకు తేవాలని సంకల్పించిన నాయకుడు ఎన్టీఆర్. హంద్రీనీవాను పూర్తి చేసి రాయలసీమకు నీరిచ్చాం. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే కియా అనంతపురం జిల్లాకు వచ్చింది. స్థానికంగా నీరు లేకపోతే ఒక సంవత్సరంలోనే గొళ్లపల్లి రిజర్వాయర్ కు నీరు తెచ్చి.. కరువు సీమలో తయారైన కియా కార్లు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. జాకీ పరిశ్రమను అనంతపురం జిల్లా నుంచి తరిమికొట్టారు. టీడీపీ హయాంలో జిల్లాకు నీటి వనరులు సమకూరిస్తే హార్టికల్చర్ హబ్‍గా మారింది. సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడంతో లక్షలాది మంది రైతులు బావుపడ్డారు. జిల్లాలో పది లక్షల పంటకుంటలు తవ్వించిన పార్టీ టీడీపీ. ఐదేళ్లలో జిల్లాలో ఒక్క పరిశ్రమ కానీ.. ఒక్క బిల్డింగ్ కానీ నిర్మించారా? అనంతపురం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపించి అనేకమైన అభివృద్ధి పనులు చేస్తే.. వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. 52 సీట్లలో 49 సీట్లు గెలిపించిన రాయలసీమకు జగన్ రెడ్డి ఏమైనా ఒరగబెట్టారా? ఇరిగేషన్‍లో ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఇరిగేషన్ కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఐదేళ్లలో జగన్ కేవలం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారు. సుపరిపాలనతోనే మీ జీవితాల్లో వెలుగు సాధ్యం. 

 *ముస్లింల సంక్షేమానికి  కూటమి కట్టుబడి ఉంది* 

 గతంలో ఎన్డీఏతో పొత్తులో ఉన్నప్పటికీ ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగలేదు. ఉమ్మడి ఏపీలో రెండు ఉర్దూ యూనివర్సిటీలు నిర్మించాం. 13 జిల్లాల్లో ఉర్దూను రెండో బాష చేశాం. విజయవాడ, కడపలో హజ్ హౌస్‍లు నిర్మించాం. దుఖాన్-మఖాన్ నిర్వహించాం. రంజాన్ తోఫా కింద సరుకులు అందజేశాం. దుల్హాన్, విదేశీ విద్య, ఇమామ్-మౌజన్లకు గౌరవ వేతనాలు టీడీపీ హాయంలోనే ఇచ్చాం. అబ్దుల్ కళాంను రాష్ట్రపతిగా చేయడానికి నా బాధ్యతగా కృషి చేశా. వైసీపీ దుర్మార్గులు అబ్దుల్ సలీంను దొంగగా చిత్రీకరించి నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మక్కాకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తాం. దుల్హాన్, విదేశీ విద్య పక్కాగా అమలు చేస్తాం. ఇమామ్‍లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు జీతాలు అందజేస్తాం. మసీదుల నిర్వహణకు నిధులు ఇస్తాం. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాది. CAA, NRC మీద సైకో జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారు. CAA, NRC బిల్లులకు పార్లమెంట్‍లో విజయసాయిరెడ్డి, లోక్‍సభలో మిథున్ రెడ్డి మద్దతిచ్చారు. మైనార్టీలను అన్ని విధాలుగా కాపాడుకుంటాం. రూ.100 కోట్లతో నూర్ బాషాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. 

 *సూపర్ సిక్స్* 

సూపర్ సిక్స్, మోదీ గ్యారెంటీ అమలైతే మీ జీవితాల్లో పెనుమార్పులకు నాంది పలుకుతుంది. సూపర్ సిక్స్ ద్వారా మహాశక్తి పథకం కింద ప్రతి మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తాం. ఐదేళ్లలో ప్రతి ఆడబిడ్డకు రూ.90 వేలు ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం పథకం కింద స్కూల్‍కి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15000 ఇస్తాం. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తాం. దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. నేనే ఒక డ్రైవర్‍ లా మారి మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాం. కేంద్రంలో ఉండే మోడీ గ్యారెంటీ కింద 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తాయి. మూడు కోట్ల మంది మహిళలను లక్షాదికారులను చేస్తామని మోదీ గ్యారెంటీ ఇచ్చారు. కేంద్ర సహాకారంతో రాష్ట్రంలోని పేద డ్వాక్రా మహిళలను లక్షాదికారులను చేస్తాం. డ్వాక్రా సంఘాల్లో యానిమేటర్లకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది.. టీడీపీ న్యాయం చేస్తుంది. జాబ్ రావాలంటే బాబు రావాలి. రాష్ట్రంలో యువత టీడీపీ కూటమి విజయం కోసం కూటమి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తా. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి యువత ఉద్యోగాలు పొందేందుకు దోహదం చేస్తాం. హైదరాబాద్‍లో ఐటీ అభివృద్ధికి పునాది వేసింది టీడీపీ. వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తాం. అనంతపురం నగరంలో ఐటీ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుడతాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాం, పుడ్ ఫ్రాసెసింగ్, కూరగాయాల ఫ్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్‍ల నిర్మాణానికి శ్రీకారం చుడతాం. రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. అవసరమైతే పుట్టపర్తి కేంద్రంగా ఎయిర్ కార్గో సైతం తీసుకొస్తాం. అన్నధాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 అందజేస్తాం. పంటలబీమా కింద రైతులు నష్టపోకుండా చూస్తాం.  

 *తెలుగుదేశం పార్టీకి కంచుకోట బీసీలు* అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్లు బీసీలకు ఇచ్చాం. ఒక పార్లమెంట్ కురబ, మరో పార్లమెంట్ బోయలకు ఇచ్చి సామాజిక న్యాయం చేశాం. వైసీపీలో సామాజిక న్యాయం నేతిబిరకాయలో నెయ్యి లాంటింది. రాయలసీమలో ముస్లింలకు, బోయలు, యాదవులు, కురబలు, ఈడిగ, లింగాయత్‍లకు టికెట్లు ఇచ్చి న్యాయం చేసిన పార్టీ టీడీపీ. రాయలసీమలో సామాజిక న్యాయంపై వైసీపీకి సవాల్ విసురుతున్నా. ఐదేళ్లలో  రూ.1.50 లక్షల కోట్లు బీసీలకు కేటాయిస్తాం. ఏటా రూ.5 వేల కోట్లతో పనిముట్లు అందజేస్తాం. 50 సంవత్సరాలకే బీసీలకు పింఛన్ అందజేస్తాం. నిర్ధిష్ఠమైన ప్రణాళికతో బీసీల అభివృద్ధికి తోడ్పడుతాం. దేవాలయాల్లో పనిచేసే నాయిబ్రహ్మణులకు రూ.25 వేలు కనీస వేతనం అమలు చేస్తాం. 200 యూనిట్ల వరకు నాయిబ్రహ్మణుల షాపులకు ఉచిత కరెంట్ ఇస్తాం. వడ్డెర్లకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. వాహన డ్రైవర్లకు ఏటా రూ.15000 అందజేస్తాం. వైసీపీ ప్రభుత్వంలో అధ్వాన్నంగా మారిన రోడ్లకు మహర్దశ కల్గిస్తాం. పేదరిక నిర్మూలన టీడీపీ ధ్యేయం. 

 *అనంతపురం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తా* 

స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాలభై ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నప్పటికీ తన తండ్రి విగ్రహం ఏర్పాటు తప్ప సాధించిన అభివృద్ధి శూన్యం. మూడు నెలల్లో పూర్తి చేస్తానన్న డంపింగ్ యార్డ్ నిర్మాణం ఏమైంది? స్వచ్ఛ భారత్ కింద వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుడుతే నిర్వీర్యం చేశారు. భూగర్భ డ్రైనేజీ కోసం టీడీపీ హాయంలో ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేయలేదు. అనంతపురం నగరంలో భూగర్భ డ్రైనేజీ చేపడతాం. అనంతపురం నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం. డంపింగ్ యార్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, పరిశ్రమలు ఏర్పాటు చేసి నగరానికి అనుసంధానం చేసే బాధ్యత టీడీపీది. బెంగళూరు నుంచి అనంతపురం నగర శివారు వరకు పెద్దఎత్తున పరిశ్రమలు నిర్మించి ఇండ్రస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందేందుకు దోహదపడతాం. రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి ప్రపంచంలో పెట్టిన పార్టీ టీడీపీ. అనంతపురం జిల్లాకు నీరిస్తే బంగారు పడించే రైతాంగం ఉంది. పరిశ్రమలు వస్తే మీ భూములకు విలువ పెరుగుతుంది. అనంతపురంలో సెంట్రల్ పార్క్ ను అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు గౌరవంగా ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొస్తాం. పెండింగ్‍లో ఉన్న పీఆర్సీ, టీఏ, డీలు సకాలంలో అందజేస్తాం. పింఛన్లు, జీతాలు ఒకటో తేదీనే అందజేస్తాం. ప్రభుత్వ ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్‍లోడ్ చేసే పరిస్థితికి ప్రధానోపాధ్యాయులను దిగజార్చారు. తల్లి, తండ్రి తర్వాత గురుకి ఉండే స్థానం ఉపాధ్యాయుడికి సమాజంలో ఉంది. ఉపాధ్యాయుల గౌరవం, ప్రతిష్ట పెంచుతాం. 

తెలుగు బాషను నాశనం చేయాలని చూస్తున్నారని, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీయాలని చూస్తున్నారని అమిత్ షా అన్న మాటలు వాస్తవం. తెలుగు బాషను మర్చిపోతే తెలుగుజాతి ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇంగ్లీష్ బాషను నేర్చుకొని ఉపాధి అవకాశాలు పొందుతాం. తెలుగుజాతి ఉనికి కోసం తెలుగు బాషను కాపాడుకోవాలి. తెలుగు బాషను ఎప్పటికీ శాశ్వతంగా కాపాడుకోవడం మన బాధ్యత. 

 *వైసీపీ పాలనలో బాధితులే నిందితులు* 

బాబాయ్‍ని గొడ్డలితో హత్య చేసి ఆ నెపం నారాసుర రక్తచరిత్ర అని టీడీపీపై మోపాలని చూశారు. సైకోల ప్రవర్తన ఇలాగే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే.. బాధితులనే నిందితులుగా మారుస్తున్నారు. ఇందుకు వివేకా కూతురు సునీత ప్రత్యక్ష ఉదాహరణ. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడారు. ప్రస్తుతం కనపడని గులకరాయి డ్రామాతో ప్రజలను మోసగించాలని చూస్తున్నాడు. గులకరాయి డ్రామా నాపై నెట్టాలని ప్రయత్నం చేశాడు. రాయి దాడి జరిగిన నిమిషాల్లోనే ప్లకార్డులతో నిరసన తెలుపుతూ డ్రామాకు రక్తి కట్టించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మరో డ్రామా చేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనించాలి. నార్త్ కొరియాలో కిమ్‍ మాదిరిగా ఏపీలో జగన్ రెడ్డి తయారయ్యాడు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టడమే కాకుండా.. వాటిని వీడియో కాల్‍లో చూసి రాక్షస ఆనందం పొందిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? జగన్ మానసిక స్థితి సరిగా లేదని సొంత చెల్లి షర్మిలనే చెప్పే పరిస్థితికి వచ్చారు. జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాలు, డబ్బు వ్యామోహంతో సొంత కుటుంబ సభ్యులే దూరమయ్యారు. తెలుగుజాతిలో ఎవరికి దగ్గని గౌరవం నాకు దక్కింది. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించే అవకాశం టీడీపీకి దక్కింది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా కావాలని ఆకాంక్షించారు. తెలుగుజాతి భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేది నా ఆకాంక్ష. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా భారీగా ఓట్లు వేసి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలి. పోస్టల్ బ్యాలెట్‍ లో సైతం ఉద్యోగస్తులు ఓట్లు వేయకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో అడ్మినిస్టేషన్ పరిపాలనకు చెదలు పట్టింది. తప్పుడు కేసులో టీడీపీ నేత జయరాం నాయుడును అరెస్ట్ చేశారు. వైసీపీ ఉచ్చులో చిక్కుకున్న అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల్ని హీనంగా చూసి మీ ప్రతిష్టను దిగజార్చిన వారిపై తగిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని కూటమి ఉండాలని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బీజేపీ కూడా ముందుకొచ్చింది. ఈ మూడు పార్టీల కలయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుంది. ప్రాంతీయ మనోభావాలను గౌరవించాలనే ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్నామని నరేంద్రమోదీ చెప్పారు. జిల్లాల వారీగా ఏబీసీడీ వర్గీకరణ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తాం. "హలో అనంతపూర్.. బాయ్ బాబ్ వైసీపీ".. "హలో ఏపీ.. బాయ్ బాయ్ జగన్".

Comments