కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లలో ఈవిఎం కమిషనింగ్.... *కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లలో ఈవిఎం కమిషనింగ్....*  *ఈవియం కమిషనింగ్ ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో నిర్వహించాలి…* 


 *చింతలపూడిలో ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, వె. ప్రసన్న వెంకటేష్..* 


ఏలూరు/చింతలపూడి,మే 06 (ప్రజా అమరావతి): ఈనెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లతో ఈవియం కమిషనింగ్ జరుగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. 


సోమవారం చింతలపూడి వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ లో నిర్వహిస్తున్న నెం.68  చింతలపూడి అసెంబ్లీ సంబందించి ఈవియం కమిషనింగ్ ప్రక్రియను  జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీచేశారు.  ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు ప్రాధాన్యత క్రమంలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సందర్బంగా ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ఈవియం కమిషనింగ్ అమర్చే విధానాన్ని గమనించారు. ఈవియంలో బ్యాల్లేట్ అమర్చిన తరవాత సీల్ వేసే విధానాన్ని పరిశీలించారు. కమిషనింగ్ పూర్తయిన ఈవియంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే విధానాన్ని పరిశీలించారు. అలాగే ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్దుల ప్రతినిధుల సమక్షంలో  కమిషనింగ్ సక్రమముగా జరుగుతున్నది లేనిది పోటీలోవున్న అభ్యర్దుల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ప్రక్రియ ఏ సమయంలో ప్రారంబించారని రేపటి రోజున కూడా త్వరగా ప్రారంబించి త్వరిత గతిని పూర్తీ చెయ్యాలని చింతలపూడి రిటర్నింగ్ అధికారి,  జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కె.అద్దయ్యను ఆదేశించారు. అలాగే కమిషనింగ్ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందికి చల్లటి త్రాగు నీరు, అల్పాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిషనింగ్ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని,ఈవియం కమిషనింగ్ లో సాంకేతిక సమస్యలొస్తే సంబందిత ఈవియం టెక్నీషియన్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. 


కార్యక్రమంలో ఏ ఆర్ ఓ జోజి, డ్వామా పిడి ఏ.రాము, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Comments