ఓటు వేసిన గిరిజనులకు జగన్ కాటు వేశాడు.*ఓటు వేసిన గిరిజనులకు జగన్ కాటు వేశాడు*గిరిజనులకు బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ రద్దు చేసిన దుర్మార్గుడు జగన్*


*లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోచుకుని భారతీ సిమెంట్స్ కు తరలింపు*


*జనవరిలో నొక్కిన బటన్ కు నేటికీ డబ్బులెందుకు జమకాలేదు?*


*బటన్ నొక్కిన 24 గంటల్లో పడాల్సిన డబ్బులు ఎందుకు పడలేదు జగన్?*


*నువ్వు నొక్కిన బటన్ పేదల కోసం కాదు...దళారుల కోసం*


*జీవో నెం.3తో గిరిజనులకు ఉద్యోగాలు కల్పిస్తా* 


*గిరిజలనులు పండించే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేశాం* 


*-కురుపాం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*


కురుపాం (ప్రజా అమరావతి):- ఓటు వేసిన గిరిజనులనే జగన్మోహన్ రెడ్డి కాటేశాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. తాము బెస్ట్ అవెయలబుల్ స్కూల్స్ తీసుకొస్తే వాటిని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాంలో గురువారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...‘‘జగన్ దళిత ద్రోహి, గిరిజనుల ద్రోహి. మీకోసం ఈ ఐదేళ్లలో జగన్ ఏమైనా అభివృద్ధి చేశాడా? ఇక్కడ వైసీపీకి అన్ని సీట్లు కట్టబెడితే అభివృద్ధి జాడలేకుండా చేశాడు. ఓటు వేసిన వాళ్లను కాటు వేసే రకం ఈ జగన్ రెడ్డి. కనీసం ఇప్పటి వరకు ఒక రోడ్డు వేశాడా? మీకోసం ఒక్క సంక్షేమయినా చేశాడా?. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు. మారుమూల ప్రాంతంలో ఉంటారు. అడవుల్లో ఉంటారు. అలాంటి గిరిజనుల కోసం టీడీపీ 16 పథకాలు తీసుకొస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు.  

*గిరిజనులకు సంక్షేమం అందించిన ఘనత టీడీపీదే*

టీడీపీ హయాంలో ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన బిడ్డలందరినీ ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి కావాలంటే అక్కడకు పంపించి చదివించాం. కానీ ఆ పథకాన్ని రద్దు చేశారు. గిరిజనుల కోసం బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే వాటిని రద్దు చేశారు. 60 శాతం సబ్సిడీతో ట్రైకార్ ద్వారా రుణాలు ఇచ్చాం. మరి ఈ ఐదేళ్లలో ఒక్క పథకమైనా మీకు అందిందా? గిరిజనుల్లో పేదవారు ఉంటారనే ‘గిరి గోరుముద్ద’ పథకం కింద బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాం అది కూడా రద్దు చేశారు. కేంద్రం మంజూరు చేసిన ‘ఏకలవ్య మోడల్ స్కూల్స్’ ని నిర్వీర్యం చేశారు. ‘జగజ్జీవన్ రావ్ జ్యోతి’ పథకం పెట్టి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తే వాటిని రద్దు చేశారు. టీడీపీ హయాంలో కరెంట్ చార్జీలు రూ. 200 ఉంటే ఇప్పుడు రూ.1000 కి పెంచారు. జగన్ కి గిరిజనులంటే చిన్నచూపు. టీడీపీ హయాంలో గిరిజనుల ఆరోగ్యం కోసం మొబైల్ అంబులెన్సులు, ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేస్తే  ఈరోజు వాటిని రద్దుచేశారు. టీడీపీ హయాంలో ‘గిరి నెట్’ తీసుకొచ్చాను. అల్లూరి సీతారామరాజు మ్యూజియం, రూ.500 కోట్లతో సెవెన్ డే టెక్నాలజీ తెచ్చాను. అవన్నీ రద్దు చేశారు. టీడీపీ హయాంలో బాక్సైట్ ఆపేస్తే ఇప్పుడు బాక్సైట్ ని లాటరైట్ ముసుగులో  భారతీ సిమెంట్ కి దోచిపెట్టారు

*పథకాలు రద్దుతో పేదలకు సంక్షేమం దూరం చేసిన జగన్ రెడ్డి*

టీడీపీ ప్రభుత్వంలో జీవో నెం.3 ద్వారా స్థానిక ఉద్యోగాలు కల్పించాం. జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెం.3 కోసం పోరాటం చేసి స్థానిక ఉద్యోగాలు కల్పించే బాద్యత నాది. గిరిజన ప్రాంతంలో ఒక్క రోడ్డయినావేశారా? ఒక్క గుంతయినా పూడ్చారా? గిరిజనులకు ద్రోహం చేసిన జగన్ తాను గిరిజన బిడ్డను అని అబద్దాలు చెప్తున్నాడు. ఇతను గిరిజన బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ. ఎస్సీల 26 పథకాలను రద్దు చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పైన దాడులు చేయించాడా. మన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, లకు 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తా. వైసీపీ ఏర్పాటు చేసిన నవరత్నాలు-నవమోసాలయ్యాయి. అందుకే నేను మీ కోసం సూపర్ సిక్స్, ఎన్నికల మేనిఫెస్టో, మోడీ గ్యారంటీ తీసుకొచ్చాం. టీడీపీ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమం

విజయవాడలో జరిగిన మోడీ రోడ్ షో చూసి వైసీపీ గుండె పగిలింది. ఓటమి ఖాయమని నిర్ణయించుకున్నారు. మీ ఓటుతో వైసీపీకి బుద్ది చెప్పాలి. పార్లమెంట్ కి కమలం పువ్వు, అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమిని గెలిపించాలి. పేదవాళ్లందరికీ పింఛన్లు ఇస్తా. రూ.200 ఉన్న పింఛన్ ను రూ.2000 కు పెంచింది టీడీపీ. మొట్ట మొదటి సారి పింఛన్లు ప్రారంభించింది ఎన్టీఆర్. క్వాలిఫికేషన్ లేకపోయినా గిరిజనులకు ఉద్యోగాలు కల్పించింది ఎన్టీఆర్. ఏప్రిల్ 1 వ తారీఖు నుంచే ఇంటి దగ్గరకు వచ్చి రూ.4000 పింఛను ఇచ్చే బాధ్యత నాది. బకాయిలతో కలిపి రూ.7000, వికలాంగులకు బకాయిలతో కలిపి రూ.12 వేలు ఇస్తా. 

నాసిరక మద్యంతో పేదల్నీ దోచుకుంటున్నాడు

గతంలో జగన్ రెడ్డి పాదయాత్ర చేసి, తలపైన ముద్దులు పెట్టాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి బాదుడే బాదుడు. కరెంటు ఛార్జీలు పెంచారు. మద్యంపై రేట్లు పెంచేశారు. టీడీపీ హయాంలో క్వార్టర్ రూ.60 ఉంటే ఇప్పుడు రూ.200 కి పెంచాడు. అదనంగా రూ.140 దోచుకుంటున్నాడు. అది కూడా నాశీరకం మద్యం. మద్యంలో దోచుకుంటున్న డబ్బులన్నీ తాడేపల్లి కొంపకు చేరతాయి. పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకులు, రేట్లు పెంచేశాడు. చెత్త పన్ను వేశాడు దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా లేదా? మళ్లీ టీడీపీ వచ్చిన తర్వాత ఇవన్నీ రద్దు చేస్తా.

*యువతను నిర్వీర్యం చేశారు*

వైసీపీ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. డీఎస్సీ పెట్టి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా, జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇప్పటి వరకు ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా లేదు. అందుకే ‘జాబ్ కావలంటే బాబు రావాలి’ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతా. సంవత్సరానికి 4లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదు సంవత్సారాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. కురుపాంలో చదువుకున్న బిడ్డలు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేలా ఏర్పాటు చేస్తా. నైపుణ్య కేంద్రాలు, స్కిల్ సెన్సర్స్ చేసి మిమ్మల్ని ఆదుకుంటా. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగభృతి కింద రూ.3 వేలు ఇస్తా. 

*మహిళల అభివృద్ధి చంద్రబాబుతో సాధ్యం*

మహిళల కోసం డ్వాక్రా సంఘాలు, వంటగ్యాస్, పొదుపు ఉద్యమం నేర్పించా. ఆడపిల్లలకు కాలేజీల్లో రిజర్వేషన్లు కల్పించా. ‘మహాశక్తి’ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, సంవత్సరానికి 18 వేలు ఇస్తాం. ‘తల్లికి వందనం’ ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు సంవత్సారానికి రూ.15 వేలు, ఇద్దరు బిడ్డలుంటూ రూ.30 వేలు, ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి అందరినీ చదివిస్తా. ‘దీపం’ పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రతి ఆడబిడ్డకు రక్షణగా ఉంటా. అన్నదాతకు సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తా. మోడీ గ్యారంటీ కింద 3 కోట్ల ఆడబిడ్డలను లక్షాదికారుల్ని చేస్తానని హామీ ఇచ్చారు. నేను కనీసం 40 లక్షల మందినైనా లక్షాదికారుల్ని చేస్తా. చట్టసభల్లో మహిళలకు సీట్లు ఇచ్చాం. భవిష్యత్తులో ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇస్తుంది. మరోవైపు మంచినీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేనొచ్చిన తర్వాత నీటి సమస్యను తీరుస్తా. 

నాయకుడు అంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆదాయాన్ని పెంచాలి, రైతుకు అండగా ఉండాలి. కానీ, జగన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ నొక్కి ప్రజలకు మోసం చేస్తున్నాడు. బటన్ నొక్కి ఎంత బొక్కావో, ప్రజలపై ఎంత భారం వేశావో సమాధానం చెప్పాలి. రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్నావు. జనవరి లో బటన్ నొక్కాడు మరి ఇప్పటి వరకు మీ అకౌంట్లలో ఒక్క రూపాయైనా వచ్చిందా? ఉత్తుత్తి బటన్లతో ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు ఆ బటన్లు జగన్ రెడ్డి దళారులకు, కాంట్రాక్టర్లకు మాత్రమే. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.16 వేల కోట్లు రూపాయలు కాంట్రక్టర్లకు దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్. 

*మీరు భూములు కొనాలన్నా...అమ్మాలన్నా జగన్ అనుమతి కావాలా.?*

జగన్ రెడ్డి ఓ దుర్మార్గుడు, విధ్వంసకారుడు, దోపిడీదారడు. ఇలాంటి వ్యక్తిని మళ్లీ భరిస్తారా? సాగు చేసుకున్న భూములపై గిరిజనులకు హక్కు కల్పించాం. గిరిజలనులు పండించే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేశా. కానీ, జగన్ మీ భూమి పత్రాలపై ఫొటో వేసుకుని ‘జగనన్న భూహక్కు పథకం’ అంటున్నాడు. ఈరోజు మీ భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఉంది మళ్లీ జగన్ వస్తే అది కూడా ఉండదు. భూమికి సంబంధించిన ఒరిజినల్స్ అన్నీ జగన్ దగ్గర పెట్టుకుని మీకు జిరాక్స్ ఇస్తాడంట. మీ భూమి మీరు అమ్ముకోడానికి కూడా జగన్ పర్మిషన్ కావాలంట. మీరు అమ్మాలన్నా, కొనాలన్నా ఎమ్మార్వో, ఆర్డీవో కాకుండా జగన్ రెడ్డి గుమస్తా పర్మిషన్ కావాలి. మీరు సంపాదించిన ఆస్తి మీ హక్కు...దాన్ని తీసేస్తాడంట. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైనే పెడతాను. ఇక్కడున్న ఎమ్మెల్యే మిమ్మల్ని విపరీతంగా దోచేసింది. ఇసుకను కూడా దోచేసింది. అలాంటి ఎమ్మెల్యే మీకు వద్దు. 

*కురుపాం నియోజకవర్గానికి టీడీపీ ఇస్తున్న హామీలు*

ఏనుగుల వల్ల పంటలు నాశనమవుతున్నాయి.దానికి పరిష్కారం చూపిస్తా. తోటపల్లి బ్యారేజ్  పాత ప్రధాన కాల్వకు మిగులు జలాలు అందించి లిఫ్ట్ ద్వారా నీరందిస్తా. కోమరాడ, గరుకుపల్లి మండలాలకు నీరిస్తా. పూర్ణపాడు-లాబేసు మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేస్తా. కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాలకు సాగునీరు అందించడానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తా. గుమ్మలక్ష్మీపురం మండలంలో జీడి పరిశ్రమ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ఇప్పిస్తా. తోటపల్లి దగ్గర కొత్త వంతెన కట్టిస్తా. డ్రిప్ ఇరిగేషన్ పెడతా,  పోలీసులకు శని, ఆదివారాలు సెలవులు ఇప్పిస్తా. అందరినీ ఆదుకుంటా. పామాయిల్ రైతులను ఆదుకుంటా. ఒకప్పుడు పామయిల్ మొక్క రూ.3 కి ఇస్తే ఇప్పుడు రూ.300 తీసుకుంటున్నారు. జీవో నెం.3 రద్దు చేస్తానని హామీ ఇస్తున్నా. ఎంపీ గీతకు కమలం పువ్వు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించే బాద్యత మీది. మీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.  


Comments