ఎన్నికల వేళ మంగళగిరిలో వైసీపీకి భారీ షాక్!.



*ఎన్నికల వేళ మంగళగిరిలో వైసీపీకి భారీ షాక్!*



*లోకేష్ సమక్షంలో టిడిపిలోకి 260 కుటుంబాలు*


*ఇసుక, గ్రావెల్ లో దోచిన సొమ్ముతో ఓటర్లకు ప్రలోభాలు*


ఉండవల్లి (ప్రజా అమరావతి );ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గ అభివృద్ధికి కలిసి రావాలన్న నారా లోకేష్ పిలుపుతో వైసీపీ నుంచి 260 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంగళగిరి పట్టణం 21వ వార్డుకు చెందిన గుంటి ప్రతాప్, మునగాల రమేష్, వంగర హనుమంతరావు ఆధ్వర్యంలో 200 చేనేత కుటుంబాలు, మంగళగిరి పట్టణం వకుళాదేవి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, బాపనయ్య నగర్ 28 వ వార్డుకు చెందిన దిడ్ల సత్యానందం ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామం నుంచి తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 15 మంది టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో యువనేత లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో నన్ను ఓడించాలని రూ.300 కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఈ డబ్బు ఎన్నికలకు ముందు ఖర్చుపెట్టి ఉంటే పేదలకు ఇళ్లు, తాగునీరు అందేవి. ఇసుక, గ్రావెల్ లో దోచుకున్న ప్రజాధనంలో పది శాతం ఖర్చుపెట్టి ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. అదంతా మన డబ్బే. ఎక్కడున్నా నా మనసంతా మంగళగిరిపైనే ఉంటుంది. ప్రధాని వచ్చినప్పుడు కూడా మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించా. ఎయిమ్స్ నీటి సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లా. దశాబ్దాలుగా ఉన్నవారు సమస్యలు పరిష్కరించలేదు. దొడ్డి దారిలో డబ్బులు సంపాదించి ఓట్లు కొనుగోలు చేసేందుకు నేను రాలేదు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. నీతి, నిజాయతీలతో పనిచేస్తా. 53,500 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని లోకేష్ చెప్పారు.


Comments