పసుపు మాయంగా మారిన పశ్చిమ గోదావరి.



*జన నీరాజనాలతో హోరెత్తిన నారా రోహిత్ ఎన్నికల ప్రచారం*


*రోహిత్ కారుపై పూల వర్షాలు కురిపించిన తెలుగు తమ్ముళ్లు*


*పసుపు మాయంగా మారిన పశ్చిమ గోదావరి


*


*కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో నారా రోహిత్ రోడ్ షో*


*అనంతరం తణుకు నియోజకవర్గ యువతతో రోహిత్ ఆత్మీయ సమావేశం*


పశ్చిమ గోదావరి జిల్లా (ప్రజా అమరావతి):- తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ చేపట్టిన మన కోసం మన నారా రోహిత్ పర్యటన రెండో రోజు కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో నారా రోహిత్ రోడ్ షో నిర్వహించారు. నారా రోహిత్ కు కార్యకర్తలు, నాయకులు నీరాజనం పలికారు. నారా రోహిత్ పర్యటనతో రోడ్లన్నీ పసుపు మయంగా మారాయి. రోహిత్ కాన్వాయ్ పై పూల వర్షాలు కురిపించారు. కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు గెలిపించాలని కార్యకర్తలను అభిమానులను నారా రోహిత్ కోరారు. నిలిచిపోయిన రాష్ట్రాభివృద్ధి తిరిగి అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలని, అందుకోసం ప్రజలందరూ కృషి చేయాలని నారా రోహిత్ కోరారు.


అనంతరం తణుకు నియోజకవర్గంలో పర్యటించిన నారా రోహిత్ యువతతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.... "2019లో మనం తప్పు చేశాం. రాష్ట్రాన్ని జగన్ చేతిలో పెట్టాం. ఈసారి 

మీరంతా ఎంతో కష్టపడి చదువుకున్నారు. ఉద్యోగాలు రాక ఎంతో ఇబ్బందులు, కష్టాలు పడుతున్నారు. ఈ ఐదేళ్లలో మన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.  ఒక్క ఐటీ కంపెనీ రాలేదు.

కావున మీరు అందరూ ఆలోచించాలి. మీకు తెలిసినవారికి కూడా చెప్పండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. చంద్రబాబు మళ్లీ  సీఎం అవ్వాలి. ఆయనకు తోడుగా పవన్ కల్యాణ్ ఉండాలి. అందరూ పోరాడి జగన్ అనే ఈ రాక్షసుడిని తరిమి కొట్టాలి. టీడీపీ, జనసేన కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టారు. నా మీద పెట్టారు. మా పెదనాన్నను అరెస్టు చేశారు. పవన్ కల్యాణ్ పై కూడా కేసులు పెట్టారు. వారికి తెలిసిందొక్కటే అవతలివారిని తొక్కేయడం. కానీ వారికి తెలియదు. మనం బంతిలాంటివారం. వారు కింద వేసి కొట్టే కొలది మేము ఇంకాస్త ఫోర్సుతో పైకి లేస్తాం. ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇప్పుడు సమయం వచ్చింది. లాస్ట్ పంచ్ మనదైతే దాని కిక్కే వేరు అనే పవన్ కల్యాణ్ డైలాగ్ లాగ గెలుపుకు మనమే కారణం కావాలి. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది. అందరూ ఆలోచించుకోవాలి. ఈ పరీక్ష మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ మీరు ఓటు వేయకుండా ఐదేళ్లు బాధపడద్దు. కాబట్టి తప్పక ఓటేయండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి. మీ భవిష్యత్తును రాసుకొనే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోండి. కూటమిని గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయాలి. అలాగే పవన్ కల్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు. పవన్ కల్యాణ్ కు డబ్బులు, హోదాలు ఆశించరు. ఆయన మన కోసం కష్టపడుతున్నారు. అందరి కోసం ఆయన బయటికి వచ్చి కష్టపడుతున్నారు. చంద్రబాబుకు 73 ఏళ్లు. ఆయన ఇంతగా తిరగాల్సిన అవసరం లేదు. కాని ఆయన మన కోసం, జనం కోసం కష్టపడుతున్నారు. కావున గుర్తించి వారికి ఓటు వేసి టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేయాలి" అని నారా రోహిత్ యువతకు పిలుపిచ్చారు.

Comments