విజయవంతమైన జానపద కళాజాత కార్యక్రమాలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్.




*విజయవంతమైన జానపద కళాజాత కార్యక్రమాలు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్*




92% శాతం ఓటింగ్ పెంచాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశం 


15 బృందాలు, 100 మంది కళాకారులతో 10 లక్షలు ఓటర్లు లక్ష్యంగా స్వీప్ అవగాహనా కార్యక్రమాలు. 


ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంగా కీర్తి కల్చరల్ సొసైటీ వారిచే జిల్లాంతా జానపద కళాజాత కార్యక్రమాలు  


ఏలూరు (ప్రజా అమరావతి):  రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంగా జానపద కళాజాత కార్యక్రమాలు జిల్లాంతా నిర్వహించామని స్వీప్ నోడల్ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. సోమవారం ఏలూరు కేంద్రంగా పత్రిక ప్రకటన విడుదల చేసారు. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ మాటల్లో వివరాలు ఇలా ఉన్నాయి. 2019 సర్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో 79.77% పోలింగ్ నమోదు కాగా ఏలూరు జిల్లాలో 83.75% ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని అన్నారు.   ఏలూరు నియోజకవర్గంలో పట్టణ ప్రాంత ఓటర్లు అధిక శాతం ఓటు వేయడానికి ముందుకు రాకపోవడంతో 68.10% మాత్రమే పోలింగ్ నమోదయ్యిందని గణంకాలు వివరించారు. జిల్లాలో  ఉన్న 1743 పోలింగ్ కేంద్రాలలో 409 కేంద్రాలలో తక్కువ పోలింగ్ నమోదు అయ్యిందని ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదని అందుకనే ఈసారి జిల్లా యంత్రంగం అప్రమత్తం అయ్యిందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు గత 80 రోజుల నుంచి జిల్లాలో పోలింగ్ శాతం పెంచే లక్ష్యంగా 2500  ఓటరు అవగాహనా కార్యక్రమాలు స్వీప్ లో భాగంగా చేపట్టామన్నారు.  పట్టణ ప్రాంతాలలో ఉన్న ఎగువ శ్రేణి వర్గం, యువ ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం అయితే పోలింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని రానున్న ఎన్నికలలో 92% ఓటింగ్ లక్ష్యంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఓటర్స్ టర్న్ అవుట్ ప్రణాళికను ఆమోదించారని అన్నారు.  దానిలో భాగంగా జిల్లాలో పది లక్షల ఓటర్లు లక్ష్యంగా కీర్తి కల్చరల్ సొసైటీ వారి జానపదకళా బృందాలతో ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. 


*ఎన్నికల పండుగకు తరలి రండి* 


కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో జిల్లాలోని 1743 పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, చలువ పందిళ్ళు, మినీ వైద్య శిభిరాలు, దివ్యంగుల కోసం ర్యాంపులు తదితర వసుతులతో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేసారని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. జిల్లాలో 16 లక్షల 38 వేల మంది ఓటర్లు ఉండగా, వారంతా ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మే 13, పోలింగ్ రోజు అందరికి ఎన్నికల పండుగని పోలింగ్ రోజు ప్రతి ఓటరు తప్పకుండ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఉద్యోగాలు, చదువులు నిమిత్తం దూర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను పోలింగ్ రోజు తమ సొంత ఊర్లకు రప్పించి ఓటు వేయించాలని ఉద్దేశంతో 'అమ్మ పిలుస్తుంది'  అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించమని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.





Comments