రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార 05-09-2024 నిర్వహించ వలసిన కార్యక్రమం తాత్కాలిక వాయిదా.


అమరావతి (ప్రజా అమరావతి),


*రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార 05-09-2024  నిర్వహించ వలసిన కార్యక్రమం తాత్కాలిక వాయిదా*


Dr. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి లో నిర్వహిస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం05-09-2024 C K Convention, మంగళగిరి లో చేయుటకు   ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ వాతావరణం అనుకూలించని కారణంగా,ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రివర్యులు, మంత్రులు,  రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులందరూ వివిధ జిల్లాల్లో వచ్చిన వరద బాధితుల సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం మరియు పురస్కార గ్రహీతల రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని   రాష్ట్ర స్థాయిలో నిర్వహించాల్సిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల  ప్రదానోత్సవం వాయిదా వేయడం జరిగిందని డైరెక్టర్ శ్రీ. వి .విజయరామరాజు , I.A.S. డైరెక్టర్ ఆఫ్ స్కూల్  ఎడ్యుకేషన్  తెలియజేశారు.  మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది పత్రికాముఖంగా తెలియజేస్తామని తెలపడం జరిగింది.

Comments