7వ 'రాష్ట్రీయ పోషణ్ మాహ్‌' 2024లో 6వ రోజు నాటికి 35 రాష్ట్రాలు/యూటీల్లోని 752 జిల్లాల్లో 1.37 కోట్ల కార్యకలాపాలు నిర్వహణ.



7వ 'రాష్ట్రీయ పోషణ్ మాహ్‌' 2024లో 6వ రోజు నాటికి 35 రాష్ట్రాలు/యూటీల్లోని 752 జిల్లాల్లో 1.37 కోట్ల కార్యకలాపాలు నిర్వహణ


బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కార్యక్రమాలు


విద్య, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఆయుష్, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖల ద్వారా అత్యధిక కార్యకలాపాలు నిర్వహణ


విజయవాడ (ప్రజా అమరావతి);


రక్తహీనత, ఎదుగుదల పర్యవేక్షణ, పరిపూర్ణ పోషకాహారం, 'పోషణ్‌ భీ పడాయ్‌ భీ', 'మెరుగైన పరిపాలన కోసం సాంకేతికత' వంటివి కీలకాంశాలుగా 7వ 'రాష్ట్రీయ పోషణ్ మాహ్'ను (జాతీయ పోషకాహార మాసం) 31 ఆగస్టు 2024న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభించారు. పర్యావరణ సుస్థిరత కోసం 'ఏక్ పేడ్‌ మా కే నామ్' ‍‌(అమ్మ పేరిట ఒక మొక్క) చొరవను కూడా భాగం చేశారు. ఇందుకోసం 13.95 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించారు.


దేశవ్యాప్త కార్యక్రమంలో 6వ రోజు నాటికి, 35 రాష్ట్రాలు/యూటీల్లోని 752 జిల్లాల్లో 1.37 కోట్ల కార్యకలాపాలను నిర్వహించారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు అత్యధిక కార్యకలాపాలు జరిగాయి.


కీలకాంశాల పరంగా, ఇప్పటి వరకు, రక్తహీనతపై 39 లక్షల కార్యకలాపాలు, ఎదుగుదల పర్యవేక్షణపై 27 లక్షల కార్యకలాపాలు, పరిపూర్ణ పోషకాహారంపై దాదాపు 20 లక్షల కార్యకలాపాలు, 'పోషణ్ భీ పడాయ్‌ భీ'పై 18.5 లక్షల కార్యకలాపాలు, 'ఏక్ పెడ్‌ మా కే నామ్‌' ద్వారా పర్యావరణ సుస్థిరతపై 8 లక్షల కార్యకలాపాలను నిర్వహించారు. 'మెరుగైన పరిపాలన కోసం సాంకేతికత'లో భాగంగా 10 లక్షలకు పైగా కార్యకలాపాలు జరిగాయి. ఐసీటీ అప్లికేషన్‌ అయిన 'పోషణ్‌ ట్రాకర్‌' ద్వారా పోషకాహార సూచికలు, లక్ష్యిత ప్రాంతాలను సమర్ధవంతంగా అమలు చేయడం, పర్యవేక్షించడంలో సాయపడటం దీని లక్ష్యం.


2018లో, దేశంలోని మొట్టమొదటి పోషకాహార లక్ష్యిత ప్రజా ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు కలిసి పని చేయడం ప్రధానాంశంగా మారింది. దీనివల్ల వివిధ వర్గాల ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను చేరుకోవడానికి వీలైంది. ప్రస్తుత పోషణ్‌ మాహ్‌లో, ఇప్పటి వరకు, 1.38 లక్షల కార్యకలాపాలతో విద్యా మంత్రిత్వ శాఖ ముందడుగులో ఉంది. 1.17 లక్షల కార్యకలాపాలతో ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, 1.07 లక్షల కార్యకలాపాలతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, 69 వేల కార్యకలాపాలతో ఆయుష్ మంత్రిత్వ శాఖ, 64 లక్షల కార్యకలాపాలతో పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలిచాయి.


ప్రతి కీలకాంశంలో నిర్దేశించిన కార్యకలాపాలతో పాటు, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు తమ స్థానిక వాతావరణానికి సరిపడే కార్యకలాపాలను చేపట్టడానికి స్వేచ్ఛ ఉంది. పిల్లల కోసం రక్తహీనత శిబిరాలు, కౌమార బాలికలకు (14-18 సంవత్సరాలు) రక్తహీనత శిబిరాలు, ఎదుగుదల పర్యవేక్షణ ప్రచారాలు, ఎదుగుదల కొలతల ధృవీకరణ, యుక్త వయస్సు మహిళల కోసం రక్తహీనత శిబిరాలు, ఎదుగుదల కొలతల శిబిరాలు (ఎస్‌ఏఎం/ఎంఏఎం స్క్రీనింగ్), పరిపూర్ణ పోషకాహారంపై కార్యాచరణ/శిబిరం (6 నెలల వయస్సులో సురక్షితమైన, తగినంత, తగిన పరిపూర్ణ ఆహారాలు), పట్టణ మురికివాడల్లో రక్తహీనత శిబిరాలు, స్థానిక ఆహార పదార్థాల ద్వారా పరిపూర్ణ వంటకాలను వండడంపై ప్రదర్శనలు, రక్తహీనతపై ఎస్‌హెచ్‌జీ, ఎన్‌ఎస్‌ఎస్‌/ఎన్‌వైకే మొదలైన కార్యకలాపాలు, పరిపూర్ణ పోషకాహారంలో ఆహార వైవిధ్యం కోసం అవగాహన శిబిరాలు, ఏడబ్ల్యూసీల్లో ఈసీసీఈ లెర్నింగ్ కార్నర్‌లను ప్రోత్సహించడానికి ప్రత్యేక శిక్షా చౌపాల్, ఏక్‌ పేడ్ మా కే నామ్ - పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞతో పాటు మొక్కలు నాటడం, స్వదేశీ బొమ్మలను ప్రోత్సహించే ఆటల-ఆధారిత అభ్యాసంపై పిల్లలు & తల్లిదండ్రుల కోసం ప్రదర్శనలు, పట్టణ మురికివాడల్లో ఎదుగుదల కొలతల శిబిరాలు (ఎస్‌ఏఎం/ఎంఏఎం స్క్రీనింగ్), టాయథాన్‌ - ఏడబ్ల్యూడబ్ల్యూలతో డీఐవై/ స్వదేశీ బొమ్మల తయారీ శిక్షణ శిబిరాలు, బొమ్మల ఆధారిత & ఆటల ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి 'ఖేలో ఔర్ పఢో' కార్యక్రమాలు, గర్భిణీల్లో బరువు పెరగటం కోసం ఎదుగుదల శిబిరాలు & పోషణ్‌ ట్రాకర్‌లో సమాచారం నమోదు, గ్రామంలో అందుబాటులో ఉన్న విభిన్న ఆహారాన్ని హైలైట్ చేయడానికి ఆహార వనరుల నమోదు, సంబంధిత నిపుణులతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యకలాపాలు వంటివి ఇప్పటివరకు నివేదించిన కార్యకలాపాలు.


ప్రజా భాగస్వామ్యం & ప్రభుత్వ సహకారం కలగలిసిన దేశవ్యాప్త సమగ్ర విధానంతో 'పోషణ్‌ మాహ్‌' విజయవంతంగా కొనసాగుతోంది. పోషణ-కేంద్రీకృత ప్రజా ఉద్యమాల ద్వారా ప్రతి ఒక్కరిని పాల్గొనేలా చేయడానికి & చైతన్యవంతం చేసేలా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకుంటున్న 'పోషణ్‌ మాహ్', "సుపోషిత్ కిషోరి సశక్త్ నారి" చొరవను ప్రేరేపిస్తోంది.

Comments