*గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్” రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర రవాణా,యువజన, క్రీడా శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి.
*
*రానున్న రోజులలో ప్రజలను మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి వెల్లడి.*
విజయవాడ, సెప్టెంబర్, 27 (ప్రజా అమరావతి );.
2024 సంవత్సరమునకు గాను "గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్” కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. "యాప్" ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశ పెట్టడం, ఇన్ బస్సు లో డిజిటల్ టికెట్లు జారీ చేయడం , సంస్థ అన్ని బస్సులలో ట్రాకింగ్ సిస్టం ను ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకున్నదని తెలిపారు. సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు భద్రతమైన, సుఖమయమైన ప్రయాణం అందించేందుకు కృషి చేస్తామని, రానున్న రోజులలో ప్రజలను మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఢిల్లీ లో హోటల్ హాలిడే ఇన్ లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో సంస్థ యాజమాన్యం ఈ అవార్డును అందుకోవటం జరిగినది అని విజయవాడలో మీడియాకు తెలిపారు.
addComments
Post a Comment