*రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతు
అమరావతి (ప్రజా అమరావతి),
- *బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది.*
- *రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనా అనుభవం వల్ల ప్రాణనష్టం లేకుండా చూడగలిగాం.*
- *మారుమూల వరద ప్రాంతాలను డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా గుర్తించి సాయమందిస్తున్నాం.*- *పంటనష్టాలను అంచనా వేసి ప్రతి రైతునూ ఆదుకుంటాం.*
- *రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి.*
- సైతం చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాం.
- రాష్ట్రంలో కనీవిని ఎరుగని రైతుల్లో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. బ్యారేజీని నిర్మించిన తర్వాత ఇంత భారీస్థాయిలో వరదరావడం ఇదే తొలిసారి.
- ఇంత వరద పోటెత్తినప్పటికీ అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతతో వ్యవహరించి ఎలాంటి ప్రాణం ఇస్తాం లేకుండా అధికార యంత్రాంగాన్ని నడిపించిన తీరు అద్భుతం. సహాయక చర్యల్లో ప్రభుత్వం, అధికార యంత్రాంగం, పార్టీ యంత్రాంగం పెద్దఎత్తున భాగస్వామ్యం అవుతుంది.
- ముఖ్యమంత్రి రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలను కష్టం నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేస్తున్నారు.
- విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎవరు వెళ్లలేని ప్రాంతాలకు సైతం ముఖ్యమంత్రి వెళ్లి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు భరోసా కల్పించారు.
- 7,20,000కు పైగా ఆహార ప్యాకెట్లను నేరుగా బాధితులకు అందజేయడం జరిగింది.
- ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కు అవసరమైన ఆహార పదార్థాలను వివిధ మార్గాల ద్వారా ముంపు బాధితులకు అందజేయడం జరుగుతుంది.
- వరదనీటి ప్రాంతంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. అదనపు ట్యాంకర్లు, ట్రాక్టర్ల ద్వారా సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నాం.
- 40 వరకు డ్రోన్ల సహాయంతో మారుమూల వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఆహార పదార్థాలు అందిస్తున్నాం.
- 55 టన్నుల ఆహార పదార్థాలను హెలికాప్టర్ల ద్వారా అందజేత.
- ఇళ్ల చుట్టూ వరద నీరు చేరి ఉండడంతో జ్వరాలు వంటి బారినపడ్డ బాధితులకు డ్రోన్ ద్వారా మందులు కూడా అందిస్తున్నాం.
- 70 పునరావాస కేంద్రాల ద్వారా దాదాపు 15 వేల మందికి పునరావాసం కల్పించి వారందరికీ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం.
- ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
- విజయవాడ మాదిరిగానే నూజివీడులోనూ చెరువులకు గండ్లు పడడం వల్ల వరద నీరు పొలాల్లోకి వచ్చి చేరింది.
* కేంద్రంతో మాట్లాడి ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలను, బోట్లను తెప్పించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయం అందించాం.
* వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవడం జరుగుతుంది.
* ప్రభుత్వం అందరినీ అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి పార్థసారథి తెలిపారు.
addComments
Post a Comment