ఇంటింటికీ ఆయుష్మాన్ భారత్.





*ఇంటింటికీ ఆయుష్మాన్ భారత్*



*ఆరేళ్లు పూర్తి చేసుకున్న పిఎం  జన ఆరోగ్య యోజన*


*ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ - పక్వాడా భారీ ర్యాలీ...*


విజయవాడ (ప్రజా అమరావతి): ఇంటింటికీ ఆరోగ్యం, ఆయుష్మాన్ భారత్ పేరుతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని 

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో డాక్టర్ జి.లక్ష్మీ షా అన్నారు.  

 పేదలకు, అర్హులైన వారికి ఉచిత వైద్యం అందచేయడం సంతోష కరమని, ఈ సేవలకు పునరంకితమవుదామని ఆయన అన్నారు.  ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పై వర్క్ షాపు నిర్వహించారు. రోగుల రికార్డులు, రిపోర్టులు  డిజిటలైజ్ చేయడంపై అవగాహన కల్పించారు.

నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్స్, యాజమాన్యాలకు త్వరలో ప్రవేశ పెట్టబోతున్న హైబ్రిడ్ విధానము గురించి వివరించి, వారి నుండి సలహాలు , సూచనలు తీసుకున్నామని , వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటామని  లక్ష్మీ షా ఈ సందర్భంగా తెలిపారు.  ఈ సమావేశమునందు రోడ్డు ప్రమాదాలకు గురైన వారికీ చికిత్స అందించటం గురించి  మార్గదర్శకాలను ఆసుపత్రుల వారికీ వివరించామన్నారు.

నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్స్,  యాజమాన్యాల ప్రతినిధులు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉన్నతాధికారులు  పాల్గొన్నారు-

Comments