కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం .



పామర్రు: సెప్టెంబర్ 11 (ప్రజా అమరావతి);


కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం


బుధవారం కృష్ణాజిల్లాలో పామర్రు నియోజకవర్గంలో తోట్ల వల్లూరు మండలంలో రొయ్యూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నియోజకవర్గంలో వరద నష్టం కేంద్ర బృందానికి వివరించారు


పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కేంద్ర బృందాన్ని కలిసి వరద నష్టం వివరించి, సంబంధిత ఛాయాచిత్రాలు కేంద్ర బృందానికి చూపి రైతు లను ఆదుకోవాలని కోరారు.


కేంద్ర బృందంలో

 

1)అనిల్ సుబ్రమణియం, సంయుక్త కార్యదర్శి,  (IS-I & CS), కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నాయకత్వంలో


2)రాకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్, కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ  ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ.


3)డాక్టర్. ఎస్ వి ఎస్ పి శర్మ, సైంటిస్ట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, హైదరాబాద్ సభ్యులుగా ఉన్నారు.



Comments